అన్వేషించండి

Breaking News Telugu Live Updates: తెలంగాణ డీజీపీ కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకుల యత్నం

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
TSPSC Group I last date TDP activist Murder AP Telangana Breaking News Telugu Live Updates Breaking News Telugu Live Updates: తెలంగాణ డీజీపీ కార్యాలయ ముట్టడికి యూత్ కాంగ్రెస్ నాయకుల యత్నం
ఏపీ, తెలంగాణ బ్రేకింగ్ న్యూస్

Background

నైరుతు రుతువనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ వారం ఏపీని రుతుపవనాలు తాకనున్నాయి. దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయని, మరోవైపు కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ సూచించింది.  పశ్చిమ బెంగాల్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతం వరకు సముద్రమట్టంపై 0.9 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం నెలకొని ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతంలోని కొన్ని చోట్ల, మిజోరం, మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాల వైపు నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఉత్తర, సెంట్రల్ బెంగల్, ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయాలు, పశ్చిమ బెంగాల్, సిక్కింలను మరో రెండు రోజుల్లో తాకనున్నాయి. తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై కనిపిస్తున్నా.. మధ్యాహ్నానికి వేడిగా మారుతోంది. పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 45 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ 40, 41 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

బంగారం ధరలు వరుసగా రెండో రోజు పెరిగాయి. నిన్నటితో పోల్చితే నేడు బులియన్ మార్కెట్‌లో ధరలు భారీగా పెరిగాయి. వెండి సైతం బంగారం బాటలోనే పయనించి భారీగా పుంజుకుంది. రూ.540 మేర పెరగడంతో  తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.48,100 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.1500 మేర పెరిగింది. నేడు హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.68,500 అయింది.

ఏపీలో పెరిగిన బంగారం ధర.. ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో  విజయవాడలో 24 క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర రూ.52,470 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 కు ఎగబాకింది. రూ.1,500 మేర పుంజుకోవడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.68,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం, తిరుపతిలో రూ.540 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,470 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,100 అయింది. ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.68,500 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. 

హైదరాబాద్‌లో ఇంధన ధరలు వరుసగా నాలుగోరోజు నిలకడగా ఉన్నాయి. నేడు హైదరాబాద్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 వద్ద స్థిరంగా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద స్థిరంగా ఉన్నాయి. ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర స్థిరంగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. వరంగల్ రూరల్ జిల్లాలో 33 పైసలు పెరగడంతో పెట్రోల్‌ లీటర్ ధర రూ.109.54 కాగా, 30 పైసలు పెరగడంతో డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.70 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. కరీంనగర్‌లో ఇంధన ధరలు దిగొచ్చాయి. 19 పైసలు తగ్గడంతో నేడు కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.85 కాగా, 17 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.97.99 అయింది. 

 

14:59 PM (IST)  •  04 Jun 2022

Telangana డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు 

Telangana డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్ నాయకులు  
మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ను నిరసిస్తూ డీజీపీ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. గ్రేటర్ హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోత రోహిత్ ఆధ్వర్యంలో ఆందోళన.. యూత్ కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మోత రోహిత్ 
మీడియాలో వచ్చే వరకు పోలీసులు స్పందించకపోవడం హాస్యాస్పదం. నాలుగు రోజుల తర్వాత మంత్రి కేటీఆర్ నిందితులను శిక్షించాలని హోం మంత్రిని ఆదేశించడం విడ్డూరంగా ఉందన్నారు. నిందితులను గుర్తించి శిక్షించడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం అందుకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, హోంమంత్రి రాజీనామా చేయాలి. డీజీపీ స్పందించి అసలైన దోషులను అదుపులోకి తీసుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు.

13:20 PM (IST)  •  04 Jun 2022

Janasena Party Meeting: మంగళగిరిలో మధ్యాహ్నం జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఈ రోజు మధ్యాహ్నం 2గం.30ని.లకు పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. సమావేశంలో పాల్గొన్న కార్యవర్గం, సభ్యులను ఉద్దేశించి సాయంత్రం పవన్ ప్రసంగిస్తారు. ఈ ప్రసంగానికి హాజరు కావాలని మీడియాను ఆహ్వానించారు. 

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రేవూరి పేరును రేవంత్ ఎలా ప్రకటిస్తారు? మంత్రి కొండా సురేఖ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
రేవూరి పేరును రేవంత్ ఎలా ప్రకటిస్తారు? మంత్రి కొండా సురేఖ కుమార్తె సంచలన వ్యాఖ్యలు
Historic Test Victory: సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
సుతార్ 10 వికెట్ల మాయాజాలంతో లంక చిత్తు.. 165 రన్స్ తేడాతో భారత్ ఘనవిజయం, 600వ టెస్టులో టీమిండియా బంపర్ విక్టరీ!
Historic Cricket Diplomacy: కరాచీలో టెస్ట్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ లో వెల్ల‌డి!
కరాచీలో టెస్ట్ మ్యాచ్ కావాలన్న ముషారఫ్.. అద్వానీ ఫోన్ కాల్ తో ఆగిన ప్లాన్, 2004 పాకిస్తాన్ టూర్ సీక్రెట్స్ పై తాజా బుక్ !
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 19 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget