By: ABP Desam | Updated at : 30 Mar 2023 09:45 PM (IST)
Edited By: jyothi
బీజేపీ ఎమ్మెల్యే
BJP MLA: త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఆ ఎమ్మెల్యే అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది జరిగింది ఎక్కడో కాదు త్రిపుర అసెంబ్లీలో. అది కూడా ఒకవైపు రాష్ట్ర బడ్జెట్ పై శాసనసభలో చర్చ జరుగుతుండగా.. ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ తన మొబైల్ లో అశ్లీల వీడియో చూస్తున్నట్లు వైరల్ అవుతున్న వీడియోలో కనిపిస్తుంది. ఈ బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ త్రిపురలోని బగ్బస్సా నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్రిపుర రాష్ట్ర బడ్జెట్ పై సభలో చర్చ జరుగుతోంది. స్పీకర్, ఇతర ఎమ్మెల్యేలు బడ్జెట్ పై తీవ్రంగా చర్చిస్తున్నారు. అదే సమయంలో వెనక కూర్చున్న జాదవ్ లాల్ నాథ్ తన ఫోన్ లో వీడియో క్లిప్పులను స్క్రోల్ చేస్తూ ఉన్నారు. కొన్నింటి వద్ద పాజ్ చేసి అశ్లీలంగా కనిపించే క్లిప్ ను తిలకిస్తున్నారు. దీనిని ఓ వ్యక్తి దగ్గరుండి రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
#WATCH | "An MLA sitting and watching blue film when Assembly proceedings are ongoing, such an incident has happened for the first time in Tripura...We condemn this...We demanded that the Speaker gets an enquiry done into this and if found to be true takes action against him,"… pic.twitter.com/4tGT2B8r6e
— ANI (@ANI) March 30, 2023
ఈ ఘటనపై త్రిపుర అసెంబ్లీ స్పీకర్ బిశ్వబంధు సేన్ మాట్లాడుతూ.. ఎన్నో రకాల విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయని, వాస్తవాలు తెలుసుకోకుండా.. సదరు వైరల్ వీడియోపై చర్య తీసుకోలేనని తెలిపారు. ఈ వ్యవహారంపై తనకు ఎలాంటి లిఖితపూర్వక ఫిర్యాదు అందలేదని స్పీకర్ బిశ్వబంధు సేన్ బదులిచ్చారు. వైరల్ వీడియో వ్యవహారంపై జాదవ్ లాల్ నాథ్ కు సమన్లు పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో అశ్లీల వీడియోలు చూస్తున్నారన్న ఆరోపణలపై లాల్ నాథ్ ఇంకా స్పందించలేదు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఆయన అసెంబ్లీ ప్రాంగణం నుండి వెళ్లిపోయారని సంబంధిత వర్గాలు తెలిపాయి.
బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల వీడియోలు చూస్తూ ఓ బీజేపీ నేత అడ్డంగా దొరకడం ఇదే తొలిసారి కాదు. 2012 లో కర్ణాటకలోని అప్పటి బీజేపీ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు రాష్ట్ర అసెంబ్లీలో తమ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూడటం వివాదాస్పదం కావడంతో వారు రాజీనామా చేయాల్సి వచ్చింది. మంత్రులు, లక్ష్మణ్ సవాది, సీసీ పాటిల్ ఏ తప్పూ చేయలేదని విచారణ తర్వాత తేలడంతో వారిని బీజేపీ పార్టీ తిరిగి చేర్చుకుంది.
Inter Results: తెలంగాణ ఇంటర్ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్స్ ఇవే!
Group1: గ్రూప్-1 పరీక్షపై జోక్యానికి హైకోర్టు నిరాకరణ, ప్రతివాదులకు నోటీసులు జారీ!
Hyderabad Lady Death: బెంగళూరులో హైదరాబాద్ యువతి మృతి, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్న పోలీసులు!
SCR Recruitment: దక్షిణ మధ్య రైల్వేలో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టులు, అర్హతలివే!
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక
Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!
Adipurush Trailer: ‘ఆదిపురుష్’ ఫైనల్ ట్రైలర్ - భీకర యుద్ధంలో కదంతొక్కిన రామసేన!