అన్వేషించండి

విమానం టేకాఫ్ అయ్యే ముందు ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడు - ఒక్కసారిగా టెన్షన్

Thai Airways: థాయ్‌లాండ్‌లో ఓ టూరిస్ట్‌ విమానం టేకాఫ్ అయ్యే ముందు ఎగ్జిట్ డోర్ తెరిచి అందరినీ టెన్షన్ పెట్టాడు.

Thai Airways News: కెనడాకి చెందిన ఓ టూరిస్ట్ థాయ్‌లాండ్‌లో ఫ్లైట్‌ టేకాఫ్ అయ్యే ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచి అందరినీ టెన్షన్ పెట్టాడు. Thai Airways ఫ్లైట్‌లో ఈ ఘటన జరిగింది. డోర్ తెరవడం వల్ల విమానంలో నుంచి దిగే స్లైడ్ ఒక్కసారిగా ఓపెన్ అయింది. ఫలితంగా టేకాఫ్‌కి తీవ్ర అంతరాయం కలిగింది. అప్రమత్తమైన అధికారులు ఆ టూరిస్ట్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరవాత పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే...నిందితుడి తరపున లాయర్‌ తన క్లైంట్ అమాయకుడని, ఏదో తెలియక చేశాడని వాదించాడు. ఏదో ధ్యాసలో ఈ పని చేశాడని చెప్పాడు. "ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచినట్టు నా క్లైంట్ అంగీకరించాడు. కానీ ఆ పని తను కావాలని చేయలేదు. ఉన్నట్టుండి ఏదో ధ్యాసలో పడిపోయాడు. ఆ భ్రమలోనే డోర్ తెరిచాడు" అని వెల్లడించాడు. ఈ ఘటనపై Chiang Mai ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం స్పందించింది. డోర్ తెరిచిన వెంటనే విమానాన్ని మళ్లీ టర్మినల్‌కి తీసుకొచ్చినట్టు వివరించింది. సేఫ్‌టీ ఇన్‌స్పెక్షన్ జరిపించిన తరవాత టేకాఫ్ అయిందని తెలిపారు. ఈ ఘటన కారణంగా దాదాపు 12 విమానాలు ఆలస్యంగా నడిచాయి. అయితే...ప్రయాణికులు మాత్రం దీనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైనా సముద్రంపై ప్రయాణించే సమయంలో డోర్ తెరిచి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో ఊహించుకోండి అంటూ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యంపై మండి పడ్డారు. గత నెల మెక్సికోలో ఈ తరహా ఘటన జరిగింది. ఓ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ తెరిచి విమానం రెక్కపై నడిచాడు. 

హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ కాసేపు అందరినీ టెన్షన్ పెట్టాడు. టేకాఫ్ అయ్యే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ని తెరిచాడు. ఇది చూసి ఒక్కసారిగా ప్రయాణికులు వణికిపోయారు. ఈ ఘటన గతేడాది జులైలో జరిగింది.  సిబ్బంది వెంటనే అప్రమత్తమవడం వల్ల ఘోర ప్రమాదం తప్పింది. నిందితుడు 40 ఏళ్ల హుస్సేన్‌ని ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సెక్యూరిటీకి  అప్పగించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వద్ద కూర్చున్న హుస్సేన్..ఉన్నట్టుండి దాన్ని ఓపెన్ చేశాడు. ఇది గమనించిన క్రూ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వేరే సీట్‌లో కూర్చోబెట్టింది. ఎగ్జిట్ డోర్‌ కవర్‌ని మళ్లీ మూసేసింది. సాధారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ డోర్ తెరుచుకునేలా దానిపై ఓ కవర్‌ అమర్చుతారు. అది కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. కానీ హుసేన్ మాత్రం దాన్ని మాన్యువల్‌గా ఓపెన్ చేశాడు. ఈ కవర్‌ని తీసేస్తే ఘోర ప్రమాదం జరిగే అవకాశముందని ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెల్లడించింది. Asiana Airlines ఫ్లైట్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ఉన్నట్టుండి ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు ఓ ప్రయాణికుడు. ఒక్కసారిగా ప్యాసింజర్స్‌ అందరూ ఉలిక్కిపడ్డారు. ఫ్లైట్ సేఫ్‌గానే ల్యాండ్ అయినప్పటికీ...డోర్ తెరవడం వల్ల గాలి గట్టిగా వీచి చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. 

Also Read: మసీదులో పూజలకు అనుమతా? బెంగాల్‌కి వస్తే ఊరుకోం - యోగికి తృణమూల్ నేత వార్నింగ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget