Top Headlines Today: 118 మందితో టీడీపీ, జనసేన తొలి జాబితా!- తెలంగాణలో త్వరలోనే బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన
AP Telangana Latest News 24 February 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: టీడీపీ 94 స్థానాల జాబితా అభ్యర్థులు వీళ్లే - జనసేన మొదటి లిస్టులో ఎంతమంది అంటే? - 118 మందితో కూడీన టీడీపీ, జనసేన తొలిజాబితాను ప్రకటించారు. ఈ మేరకు రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించి జాబితా విడుదల చేశారు. బీజేపీతో పొత్తు విషయంలో క్లారిటీ రాకపోవడంతో క్షేత్రస్థాయిలో ఉన్న గందరగోళ పరిస్థితిని తొలగించేందుకు ఎలాంటి అభ్యంతరాలు లేని సీట్లలో అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు ప్రకటించబోయే 118 స్థానాల్లో 94మంది తెలుగుదేశం అభ్యర్థులు ప్రకటించారు. 24 మంది జనసేన అభ్యర్థులు పోటీలో ఉంటారని చెప్పిన పవన్ కల్యాణ్... ఐదు స్థానాలనే ప్రకటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
పల్లకీ మోయడమే తప్ప పావలా వంతు కూడా దక్కలేదా- పవన్‌పై వైసీపీ సెటైర్లు
జనసేన అధ్యక్షుడు అనే దాని కంటే ఆ పార్టీని టీడీపీలో విలీనం చేసి టీడీపీ ఉపాధ్యక్ష పదవి తీసుకుంటే బాగుంటుందని పవన్ కల్యాణ్‌కు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. చంద్రబాబు ఇచ్చిన 24 సీట్లు తీసుకొని ఎవరి పై ఏం యుద్ధం చేస్తారని ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సజ్జల చంద్రబాబు, పవన్‌పై విమర్శలు చేశారు. టీడీపీ, జనసేన మొదటి జాబితాపై మాట్లాడిన సజ్జల... వారి వద్ద చెప్పుకోవడానికి ఏమీ లేదని ఏదోలా బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆరాటమే కనిపిస్తోందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మల్కాజిగిరి సీటు కోసం కాంగ్రెస్ లో పోటీ, సీటు తనదేనంటూ ప్రచారం స్టార్ట్ చేసేసిన మైనంపల్లి
వచ్చే నెలలో పార్లమెంటు ఎన్నికల (Loksabha Elections)షెడ్యూల్ విడుదల కాబోతోంది. రెండు నెలల క్రితమే తెలంగాణ (Telangana)లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections)ముగియడంతో...నాడు కాంగ్రెస్ ( Congress) పార్టీ తరపున ఎమ్మెల్యే టిక్కెట్ దక్కని అసంతృప్త నేతలు మళ్ళీ ఎంపీ టిక్కెట్లపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే కొందరు నేతలు లాబీయింగ్ మొదలు పెట్టారు. బీఆర్ఎస్, బీజేపీలో టిక్కెట్ ఆశించి భంగపడ్డ నేతలు...కాంగ్రెస్ పార్టీలో అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణలో బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ముందే ప్రకటించే అవకాశం
తెలంగాణ (Telangana)అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లాపడిన బీజేపీ(BJP) కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు నిలుపుకునేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. కొత్త సీట్ల సంగతి ఎలా ఉన్నా ఉన్నవాటిని కాపాడుకోవడంపై దృష్టి సారించింది. ఇప్పటికే విజయసంకల్ప యాత్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఆపార్టీ ప్రచార రథాలు పరుగులెడుతుండగా... అభ్యర్థుల ఎంపికపై కేంద్ర అధిష్టానం దృష్టిసారించింది.అభ్యర్థుల జాబితా ఇప్పటికే సిద్ధం కాగా.. వీటిపై చర్చించేందుకు నేడు తెలంగాణ నేతలతో అమిత్ షా(Amith Sha) కీలక భేటీ నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తొలి జాబితాలో టీడీపీ సీనియర్ నేతలకు షాక్ - టిక్కెట్లు ఖరారు చేయని చంద్రబాబు!
తెలుగుదేశం, జనసేన ఉమ్మడి జాబితాలో తెలుగు దేశం పార్టీ సీనియర్లకు చోటు దక్కలేదు వీరిలో చాలా మంది సీట్ల విషయంలో చేరికలు.. ఇతర అంశాలను సర్దుబాటు చేయాల్సి ఉండటంతో ఆపినట్లుగా తెలుస్తోంది. కొంత మందికి టిక్కెట్లు నిరాకరించే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని గురజాల అసెంబ్లీ స్థానంలో గతంలో పలు దఫాలు ప్రాతినిథ్యం వహించిన యరపతినేని శ్రీనివాసరావుకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి