Top Headlines Today: టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ - యాదాద్రి కాదు ఇక యాదగిరి గుట్ట, త్వరలో జీవో
AP Telangana Latest News 02 March 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: మంగళగిరి వైసీపీ ఇంఛార్జీగా లావణ్య - ఎమ్మెల్యే ఆర్కే ఏమన్నారంటే?
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ సమన్వయకర్తగా గంజి చిరంజీవి స్థానంలో మురుగుడు లావణ్యను వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ మేరకు జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ అంశంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరి సీటును గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామని స్పష్టం చేశారు. ఇక్కడ టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదు. 'మళ్లీ మళ్లీ చెప్తున్నా.. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురవేస్తాం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ - సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ శనివారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఉదయం హైదరాబాద్ లోని టీడీపీ అధినేత నివాసానికి వసంత వెళ్లారు. వసంతకు చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయనతో పాటు మైలవరం నియోజకవర్గం వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. గత కొంతకాలంగా వైసీపీపై అసంతృప్తితో ఉన్న వసంత కృష్ణప్రసాద్.. టీడీపీలో చేరనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఆ మేరకు శనివారం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ - కాలేజీ కోసం వేసిన రోడ్డు తొలగింపు, కావాలనే టార్గెట్ చేశారన్న బీఆర్ఎస్ నేత
మాజీ మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి (Malla Reddy) అధికారులు షాక్ ఇచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ (HMDA) లే అవుట్ లో ఆయనకు సంబంధించిన కాలేజీ రోడ్డును అధికారులు తొలగించారు. ఇక్కడ 2,500 గజాల భూమిని ఆయన ఆక్రమించి రోడ్డు నిర్మించారని ఆరోపణలున్నాయి. దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు. తన కాలేజీ కోసమే అప్పట్లో మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నారని ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
యాదాద్రి కాదు ఇక యాదగిరి గుట్ట - త్వరలో జీవో ఇస్తామన్న మంత్రి కోమటరెడ్డి
యాదాద్రి కాదు ఇకపై యాదగిరిగుట్టగా పిలువబుడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. యాదాద్రి పేరును యాదగిరి గుట్టగా మారుస్తూ త్వరలోనే జీఓ విడుదల చేస్తామని కోమటిరెడ్డి వెల్లడించారు. ఆయన శనివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే కేటీఆర్ ఇప్పటికీ తండ్రి కేసీఆర్ చాటు కొడుకే. నేను ఉద్యమాలు చేసి వచ్చాను. మేం జీరో బిల్ ఇచ్చినట్టు.. కేటీఆర్‌కి జీరో నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్ లేని కేటీఆర్ గురించి మాట్లాడడం వృథా. ఫ్లోర్ లీడర్ ఇవ్వకపోతే హరీష్ కూడా బీజేపీలోకి పోతాడు. కాళేశ్వరం కట్టిన చీఫ్ డిజైనర్ కేసీఆర్ మేడిగడ్డ ఎందుకు పోలేదు?. కాళేశ్వరం పనికిరాదని ఎన్‌డీఎస్‌ఏ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు కానీ వైదొలిగాను అని చెప్పలేదు. పైగా చంద్రబాబు ఆదేశిస్తే అనే పదం కూడా వాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మహాసేన రాజేష్ పోటీ నుంచి వైదొలిగారా ? - అసలు ఆయన ఏం చెప్పారంటే ?
" కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను.. జగన్ రెడ్డీ... గుర్తుపెట్టుకుంటాను! .. పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను! నాకోసం నా పార్టీనీ, చంద్రబాబుగారినీ, పవన్ కళ్యాణ్ గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు " అంటూ పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారని కొంత మంది ప్రచారం చేయడం ప్రారంభించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి