అన్వేషించండి

Top Headlines Today: అధికారంలోకి తెచ్చినా, కృతజ్ఞత లేదన్న షర్మిల! ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన కేసీఆర్

AP Telangana Latest News 28 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..

Telugu News Today: 'అండగా నిలిచి అధికారంలోకి తెచ్చినా కృతజ్ఞత లేదు' - ప్రజలకు మేలు కోసమే పుట్టింటికి వచ్చానన్న షర్మిల
తాను ఏపీ ప్రజలకు మేలు చేయడం కోసమే తన పుట్టింటికి వచ్చానని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharimila) అన్నారు. తిరుపతి (Tirupati) జిల్లాలో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ (Congress) పార్టీ కీలక నేతలు పల్లం రాజు, రఘువీరా రెడ్డి, కొప్పుల రాజు, గిడుగు రుద్రరాజు ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వైసీపీని తన భుజాలపై వేసుకుని పాదయాత్ర చేశానని.. అండగా నిలబడి అధికారంలోకి తెచ్చినా, ఈ రోజు కనీసం కృతజ్ఞత లేదని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి 

పార్ట్ టైంగా రాజకీయాలు చేయలేను - అందుకే పూర్తిగా తప్పుకుంటున్నా - గల్లా జయదేవ్
గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనను రెండుసార్లు గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటామని కొద్దిరోజుల క్రితమే గల్లా జయదేవ్ కుటుంబం ప్రకటన చేసింది. మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడైన గల్లా జయదేవ్.. రాజకీయాల్లోకి వచ్చి.. 2014, 2019లో రెండుసార్లు గుంటూరు ఎంపీగా గెలిచారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ప్రమాణ స్వీకారానికి సిద్ధమైన కేసీఆర్ - గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆ రోజునే గులాబీ బాస్ ప్రమాణం
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ (KCR) త్వరలోనే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తుంటి ఎముక గాయం నుంచి ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫామ్ హౌస్ లో గాయపడిన కేసీఆర్ కు వైద్యులు సర్జరీ నిర్వహించారు. అనంతరం వైద్యుల సూచన మేరకు గత 2 నెలలుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇప్పుడు చేతి కర్ర సాయంతో నెమ్మదిగా నడుస్తున్నారు. ఇటీవల ఎన్నికల్లో గజ్వేల్ (Gajwel) నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పుటికీ గాయం కారణంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ఇద్దరివీ సర్కార్ కొలువులే! ఒకరికి ఛీత్కారాలు, మరొకరికి జనం గుండెల్లో స్థానం - రెండూ ఒకేసారి!
ప్రభుత్వ ఉద్యోగం వస్తే కాలుమీద కాలేసుకొని బతకొచ్చనేది చాలా మంది భావన. అందుకే సర్కారీ కొలువు కోసం విపరీతంగా శ్రమిస్తుంటారు. ఉద్యోగం పొందినవారు సక్రమంగా చేసుకుంటే.. మరికొందరు అడ్డదారుల్లో లంచాలకు అలవాటు పడి అక్రమంగా సంపాదిస్తుంటారు. అలా లెక్కకు మించి అక్రమార్జనతో దొరికిపోయిన ప్రభుత్వ ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు. ఆదాయానికి వందల రెట్లు అధికంగా ఆస్తులు సంపాదించిన తీరు చూసి మనం విస్తుపోయాం. కానీ, అదే ప్రభుత్వ ఉద్యోగం కోసం తన సొంత ఆస్తులను త్యాగం చేసిన వారు మాత్రం ఇప్పటిదాకా చూడలేదనే చెప్పుకోవాలి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

వచ్చే ఎన్నికలపై షర్మిల ఎఫెక్ట్ ఎంత ఉంటుంది? ఫేస్‌ టూ ఫేస్‌లో జేసీ కీలక వ్యాఖ్యలు
జేసీ కుటుంబం నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా, జేసీ పవన్ రెడ్డి ఎంపీగా పోటీ చేయబోతున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వెల్లడించారు. అడగందే అమ్మయినా పెట్టదని.. అందుకే దీనిగురించి ఒక మాట చంద్రబాబును అడిగేసి వచ్చానని అన్నారు. చంద్రబాబు నుంచి మంచి స్పందన వచ్చిందని చెప్పారు. కుటుంబానికి ఒకటే టికెట్ అని కూడా అంటున్నారని.. కానీ జేసీ కుటుంబానికి కూడా ఒకటే సీట్ అంటే ఎలా? అని ప్రశ్నించారు.  పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget