Top Headlines Today: ఏపీకి కౌంటింగ్ డే టెన్షన్; కేసీఆర్‌ను మానసికంగా దెబ్బకొట్టే వ్యూహం - నేటి టాప్ న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
ఏపీకి కౌంటింగ్ డే టెన్షన్
ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఓట్ల లెక్కింపు దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ పెరిగిపోతోంది. గెలుస్తామా లేదా అన్న భయం నేతల్లో ఉంటే... పోలింగ్ రోజే విధ్వంసం జరిగిందని కౌంటింగ్ రోజు ఇంకెంత విధ్వంసం చూడాల్సి వస్తుందో అన్న అనుమానం సామాన్య ప్రజల్లో ఉంది. పోలింగ్ జరిగి పది రోజులు దాటినా అసలు ప్రజల నాడి ఏంటన్నది ఎవరికీ ఓ పట్టానా అర్థం కావడం లేదు. అదే టైంలో పార్టీ వ్యాఖ్యలు, నేతలు ఫిర్యాదులు, ఇలా అన్నీ ప్రజలను బెదిరగొట్టేస్తున్నాయి. ఇప్పుడు పరిణామాలు, ఘర్షణలు గెలుపు ఎవరిదీ అన్న చర్చే రాకుండా చేశాయి. తర్వాత మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఎపిసోడ్‌తో ఈ రాజకీయం పీక్స్‌కు వెళ్లింది. ఇంకా చదవండి
టీడీపీ బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలి
తెలుగు దేశంలో పార్టీ బాధ్యతలను నారా లోకేష్‌కు అప్పగించాలని ఆ పార్టీ లీడర్ బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. దీని ఎక్కువ టైం తీసుకోవద్దని సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేసిన రోజునే జరిగిపోవాలని అన్నారు. మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి పార్టీ పటిష్టానికి శ్రమించిన లోకేష్ కంటే అర్హుడు ఎవరని ప్రశ్నించారు. తాను చెబుతున్నది రిక్వస్ట్ కాదని డిమాండ్ అని అన్నారు. ఇంకా చదవండి
'వారిని జూన్ 6 వరకూ అరెస్ట్ చెయ్యొద్దు' - ఎన్నికల కేసుల్లో నిందితులుగా ఉన్న అభ్యర్థులకు హైకోర్టులో ఊరట
ఈ నెల 13న ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు, అల్లర్ల కేసుల్లో ప్రధాన నిందితులుగా ఉన్న టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు ఏపీ హైకోర్టులో (AP HighCourt) తాత్కాలికంగా ఊరట లభించింది. జూన్ 6 వరకూ వారిని అరెస్ట్ చెయ్యొద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలతో మాచర్ల (Macharla) పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో నిందితుడిగా ఉన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఉపశమనం లభించినట్లయింది. అటు, తాడిపత్రి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి, నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్, తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డిలకు సైతం అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది. ఇంకా చదవండి
కేసీఆర్‌ను మానసికంగా దెబ్బకొట్టే వ్యూహం
రాజకీయ వ్యూహాల్లో ప్రత్యర్థుల్ని మానసికంగా బలహీనం చేయడం కూడా కీలకం. కొత్త తరహా రాజకీయాల్లో ఇది మరీ ఎక్కువగా ఉంది. ప్రత్యర్థుల్ని ఆవేశపడేలా చేసి తప్పులు చేసే ప్రోత్సహించడం అనే రాజకీయ వ్యూహం చాలా కాలంగా పార్టీల నేతలు అమలు చేస్తున్నారు. ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురైనా స్థిమితంగా ఉన్న రాజకీయ నాయకుడే కాస్త ఆలస్యమైనా అధికారాన్ని అందుకుంటారు. ఇంకా చదవండి
హైదరాబాద్ హోటళ్లలో తినేది ఫుడ్ కాదు పాయిజన్
సందర్భం ఏదైనా, వారం ఏదైనా భాగ్యనగరం హైదరాబాద్‌లో చాలా మంది రెస్టారెంట్‌కు వెళ్లాల్సిందే! ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో మొదలు మధ్యాహ్నం లంచ్, రాత్రికి డిన్నర్‌తో సహా అన్నీ హోటల్లోనే కడుపు నిండా తినేస్తారు. వినియోగదారుల అవసరాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి. రకరకాల ఫ్లేవర్లు కలుపుతూ కష్టమర్ల కడుపుకు ఫుడ్ బదులు పాయిజన్ పెడుతున్నారు రెస్టారెంట్, హోటల్ యజమానులు. ఇంకా చదవండి