Top 10 Headlines Today: తెలుగు రాాష్ట్రాలతోపాాటు ప్రపంచ వ్యాప్తంగాా ఉన్న టాప్ టెన్ హెడ్‌లైన్స్ ఇవే
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
Top 10 Headlines Today:
నేడే పదో తరగతి ఫలితాలు
ఏప్రిల్ 3 నుంచి 18 వరకు జరిగిన పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉదయం 11 గంటలకు రిజల్ట్స్‌ను రిలీజ్ చేస్తారు. అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.inలో ఫలితాలను చూడొచ్చు.
వానలే వానలు
తమిళనాడు దక్షిణ కోస్తాంధ్ర మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మరింత బలపడి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. ఇది అల్పపీడనంగా మారుబోతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలు దంచి కొట్టబోతున్నాయి. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
హుస్సేన్ సాగర తీరాన మరో ఐకాన్ కట్టడం!
జూన్ నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రారంభోత్సవం కాబోతోంది! తెలంగాణ ప్రజల హృదయాలను హత్తుకునే ఈ కట్టడాన్ని వేగంగా పూర్తిచేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను, ఏజెన్సీ సిబ్బందిని ఆదేశించారు. ప్రతి ఒక్కరూ మనసుపెట్టి పనిచేయాలని చెప్పారు. విధించిన నిర్ణీత గడువులోగా ప్రారంభానికి సర్వం సిద్దం కావాలని చెప్పారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగి పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వచ్చే నెలలో సీఎం కేసిఆర్ చేతుల మీదుగా అమరజ్యోతి ప్రారంభం అవుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు.
ఎమ్మెల్యే పోస్టుపై ఆసక్తి
ఎంపీ పదవిపై ఎందుకో నిరాసక్తత..ఎమ్మెల్యే పదవిపై ఎందుకో ఆతృత..మొత్తం మీద రాబోయే ఎన్నికలకోసం ఎవరి కసరత్తులు వారు ప్రారంభించారట...ఆ ముగ్గురు ఎంపీలు ఎమ్మెల్యే అభ్యర్ధిత్వానికే ఎక్కువ మొగ్గుచూపుతున్నారట..
నిరుద్యోగ భారతం
ఇటీవలే చైనాను దాటి, ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వానికి అతి పెద్ద సవాలు. నానాటికీ పెరుగుతున్న నిరుద్యోగ గణాంకాలు ఇలాంటి సవాలు తీవ్రతను పెంచుతూనే ఉంటాయి. తాజా డేటా ప్రకారం, 2023 ఏప్రిల్ నెలలో భారతదేశంలో నిరుద్యోగిత రేటు 8 శాతం దాటింది.
లోన్ చాలా ఈజీ
ప్రతి కుటుంబానికి ఒక సొంత నివాసం ఉండాలి. అది సామాజిక & ఆర్థిక భద్రతను అందిస్తుంది. దీంతోపాటు, గృహ రుణంపై పన్ను ప్రయోజనాల రూపంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు. హౌసింగ్ లోన్ అప్లికేషన్ త్వరగా ఆమోదం పొందాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే సరి.
స్మిత తమ్ముడి రియాక్షన్
రజినీకాంత్ తో సిల్క్ స్మితకు ఎఫైర్ ఉందని, ఆయన కారణంగానే ఆమె సూసైడ్ చేసిందని సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై స్మిత తమ్ముడు స్పందించారు. బుద్ధి జ్ఞానం లేనివారే ఇలాంటి దుష్ప్రచారం చేస్తారన్నారు.
వేసవిలో జీన్స్ మంచిదే కానీ
డెనిమ్... ఇది ఒక రకమైన ఫ్యాబ్రిక్. మందంగా ఉంటుంది. దీంతో తయారు చేసిన జీన్స్ వేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. దాదాపు 90 శాతం యువత ఇప్పుడు వీటినే వేసుకుంటున్నారు. అయితే వీటిని మండే ఎండల్లో వేసుకుంటే అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వస్త్రం వేడిని గ్రహిస్తుంది. గాలి దాని గుండా లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటుంది. ఎండల్లో జీన్స్ వేసుకున్న చోట చెమట పట్టినా, అది ఆరకుండా చేస్తుంది. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చర్మ ఎలర్జీలు, దద్దుర్లు వంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మండుతున్న ఉష్ణోగ్రతల మధ్య జీన్స్ వేసుకోకపోవడమే మంచిది.
తిరుగులేని గుజరాత్
రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ లో రాణించింది. సవాయ్ మాన్ సింగ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. తొలుత సంజూ శాంసన్ సేన 17.5 ఓవర్లకు 118 పరుగులకే ఆలౌటైంది. స్వల్ప టార్గెట్ ను గుజరాత్ ఆటగాళ్లు 13.5 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించారు.
మనసులో మాట చెప్పేయండీ
ఈ రోజు ఈ రాశివారు నూతన ఉత్సాహంతో ఉంటారు. ప్రేమికులు పెళ్లిదిశగా అడుగేసేందుకు ఇదే మంచి సమయం.