అన్వేషించండి

Top 10 Headlines Today: ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ అప్‌డేట్స్‌తో మార్నింగ్ టాప్‌ టెన్స్‌ న్యూస్ ఇవే

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

Top 10 Headlines Today:  కమిటీ ఏం చెప్పింది

కలియుగ దైవం శ్రీనివాసుడి సన్నిధి తిరుమల శ్రీవారి ఆలయంలో వంశపారం పర్య అర్చకుల సమస్యకు ఇంకా పరిష్కారం దొరకలేదు. ఈ క్రమంలో శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి ట్విట్టర్ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. వంశపారం పర్య అర్చకుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ శివశంకర్ కమిటీ నివేదికను బయట పెట్టాలని కోరారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

సూర్యతో కాస్త జాగ్రత్త

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం ఏడు గంటలకు సూరీడు సుర్రుమంటున్నారు. బయటకు రావాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సి వస్తోంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం కారణంగా ఇప్పటి వరకు వేసవి సెగ తెలియకుండానే మే వచ్చేసింది. మే మొదటి వారంలో కూడా అంతగా ఎండ ప్రభావం కనిపించలేదు. కానీ గత నాలుగైదు రోజుల నుంచి మాత్రం భయపెడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సగటున 41 డిగ్రీలపైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న మూడు రోజులపాటు మరింత ఎక్కువ కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

తేలని పంచాయితీ

కర్ణాటక కాంగ్రెస్ సీఎల్పీ భేటీ ఆదివారం రాత్రి బెంగళూరులో రసవత్తరంగా సాగింది. సీఎల్పీ భేటీలో కాబోయే సీఎం ను ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ అధిష్ఠానం కోరగా... ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం ఇచ్చారు. కర్ణాటకు కొత్త సీఎంను ఎన్నుకోవాల్సిన బాధ్యతను కాంగ్రెస్ హై కమాండ్ కే అప్పగిస్తున్నట్లు ఎమ్మెల్యేలంతా ఏక వాక్య తీర్మానం చేయడంతో కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈమేరకు డీకే శివకుమార్ లేదా సిద్ధరామయ్యలో ఎవరు సీఎం కావాలనేది హైకమాండ్ నిర్ణయించునున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

కిషన్ రెడ్డి లేఖ

ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో కొన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆపేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. యశ్వంత్ పూర్- హజరత్ నిజాముద్దీన్ సంపర్క్ క్రాంతి ఎక్స్ ప్రెస్ రైలు మహబూబ్‌నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో ఆపేలా చర్యలు తీసుకోవాలని తన లేఖలో కోరారు. ఆ రైలు కాచిగూడ నుంచి బయలుదేరి ఎక్కడా ఆగకుండా 200 కిలోమీటర్లు ప్రయాణించి కర్నూలు చేరుకుంటుందన్నారు. కానీ ఇంత దూరంలో కనీసం ఎక్కడా స్టాప్ లేదని, మహబూబ్ నగర్, షాద్ నగర్ లాంటి రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగేలా చేయాలని కిషన్ రెడ్డి ప్రతిపాదించారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే ఈ ప్రాంత వాసులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం ఉందన్నారు.  మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణ ఎంసెట్‌-2023 ప్రాథమిక కీ విడుదల

తెలంగాణ ఎంసెట్‌-2023 ప్రాథమిక కీ విడుదలైంది. ఎంసెట్ అగ్రికల్చర్‌ & మెడికల్‌ స్ట్రీం ఆన్‌లైన్‌ పరీక్షల ప్రాథమిక కీని ఉన్నత విద్యామండలి మే 14న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లను కూడా విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ సమాధానాలు చెక్ చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

పుష్పగా మారిన ఎంపీ గురుమూర్తి 

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతోంది. ఆరో రోజు వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు మాతంగి వేషం ధరించి, పొంగళ్ళు సమర్పించి గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఆరవ రోజు గంగమ్మ జాతర పురష్కరించుకుని తిరుపతి ‌ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్రను ఘనంగా నిర్వహించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

పెట్రోల్ ధరల్లో స్వల్ప మార్పులు

చైనా, అమెరికాలో కొత్తగా పుట్టుకొచ్చిన ఆర్థిక ఆందోళనల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో తగ్గుదల కొనసాగింది. ఇవాళ, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 0.81 డాలర్లు తగ్గి 74.17 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.83 డాలర్లు తగ్గి 70.04 డాలర్ల వద్ద ఉంది. అయితే, మన దేశంలో చమురు ధరల మార్పుల మీద ఇవి ప్రభావం చూపడం లేదు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

నేటి రాశి ఫలాలు

ఈ రాశి విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటారు. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. పెద్దల మార్గదర్శకత్వం పొందుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది. ఏ పని లేకపోవడం వల్ల అశాంతి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఐపీఎల్‌లో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరాలంటే సమీకరణాలు ఎలా ఉన్నాయి?

రాజస్థాన్ రాయల్స్ (RR)పై 112 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేయడం ద్వారా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌, ముంబై ఇండియన్స్‌పై ఓటమి కచ్చితంగా ఆ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. ఇప్పుడు రాజస్థాన్‌పై విజయంతో ఆ జట్టు మరోసారి విన్నింగ్ ట్రాక్‌లోకి వచ్చింది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

ఫలితాలు విడుదల 

కేంద్ర ప్రభుత్వ శాఖలు/ విభాగాల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ ఎగ్జామినేషన్‌ (సీజీఎల్‌ఈ)-2022 తుది ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమీషన్(ఎస్‌ఎస్‌సీ) మే 14న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను నాలుగు జాబితాల్లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో పొందుపరిచింది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Request: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
నేను మీసం తిప్పితే రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్
KTR Arrest: అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
అరెస్టులు కాదు ప్రజల్లో చర్చ పెట్టడమే లక్ష్యం - రాజకీయంగా నష్టపోకుండా రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Guntur News: గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ  సర్కార్ నిర్వాకం -  ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
గుంటూరులో ఓ కాలనీ మొత్తం 22Aలోకి - 15 ఏళ్ల కిందటే రిజిస్ట్రేషన్ చేసినా వైసీపీ సర్కార్ నిర్వాకం - ఈ కాలనీ వాసుల కష్టాలు తీర్చేదెవరు?
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు- ఏడుగురు మృతి - మాధాపూర్‌లోని ఐటీ బిల్డింగ్‌లో ఫైర్ యాక్సిడెంట్
Look Back 2024: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
Stock Market: కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
కేంద్ర బడ్జెట్ శనివారం రోజున వస్తే స్టాక్ మార్కెట్లకు సెలవు ఇస్తారా, ఓపెన్‌ చేస్తారా?
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Embed widget