అన్వేషించండి

Top 10 Headlines Today: తెలంగాణ సీనియర్ లీడర్ కొత్తకోట దయాకర్‌ కన్నుమూత, రోహిత్ శర్మపై సీనియర్ల ఆగ్రహం

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today: 

నేడూ ఉక్కపోతే

నైరుతి రుతుపవనాలు ఈరోజు కర్ణాటకలోని మరికొన్ని భాగాలు మరియు కొంకణ్, తమిళనాడు లోని మిగిలిన భాగాలు, ఆంధ్రప్రదేశ్ లోని మరికొన్ని భాగాలకు వ్యాపించాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు సోమవారం (జూన్ 12) ఓ ప్రకటనలో తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పన్నుల వాటా

ఏపీలో బీజేపీ అగ్రనేతల పర్యటన మరుసటిరోజే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు విడుదల చేసింది. రాష్ట్రాలకు 3వ విడత పన్ను నిధులను కేంద్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జూన్‌ నెలకు గానూ 3వ విడత కింద మొత్తం రూ.1,18,280 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జూన్‌ చెల్లింపులతో పాటు ఒక విడత అడ్వాన్స్‌ మొత్తాన్ని విడుదల చేసినట్లు వెల్లడించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు వచ్చాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

జనసేనలోకి టాప్‌ ప్రొడ్యూసర్

టాలీవుడ్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర సంస్థ (SVCC) ద్వారా తెలుగు చిత్ర సీమలో అనేక విజయవంతమైన సినిమాలను అందించిన నిర్మాత భోగవల్లి వెంకట సత్యనారాయణ ప్రసాద్ (బీవీఎస్ఎన్ ప్రసాద్) సోమవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన ప్రసాద్ ధర్మ పరిరక్షణ నిమిత్తం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న యాగ క్రతువులో పాలు పంచుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రేపు ప్రెస్ మీట్

బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రావు, జూపల్లి కృష్ణారావు పొలిటికల్‌ హైడ్రామాకు 24 గంటల్లో తెరపడనుందని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నప్పటికీ ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వారి రాజకీయ ప్రయాణంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్నింటికి తెరదించుతూ బుధవారం కీలకమైన ప్రెస్‌మీట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు బుధవారం పెట్టే ప్రెస్‌మీట్‌లో మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ జాయిన్ అవుతున్నారని టాక్‌ బలంగా వినిపిస్తోంది. ఈ నెల 15న ఖమ్మంలో బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీంట్లో కేంద్రహోంమంత్రి అమిత్‌షా పాల్గొననున్నారు. దానికి ఒక్క రోజు ముందే పొంగులేటి ప్రెస్ మీట్ పెట్టనున్నారు. 

 

వర్గపోరుకు మందు ఏదీ?

తెలంగాణ బీజేపీలో పార్టీ నేతల మధ్య వర్గ పోరాటం రోజు రోజుకు పెరిగిపోతున్న సూచనలు కనపిస్తున్నాయి. ఓ రకంగా కాంగ్రెస్ పార్టీని మించిపోతోంది.  కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెబుతూంటారు.  ఎందుకంటే అక్కడ ఉండే గ్రూపులు అన్ని మరి.  ఇతర పార్టీలపై పోరాడటం కన్నా వారిలో వారు పోరాడటానికే ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ట్రాక్‌లోకి వచ్చినట్లుగా ఉంది కానీ..  బీజేపీ మాత్రం కాంగ్రెస్ లా మారిపోయింది. పార్టీలో గ్రూపులు ఎక్కువైపోయాయి. కానీ వారందర్నీ సమన్వయం చేసేందుకు  బీజేపీ హైకమాండ్ సీరియస్ గా ప్రయత్నించడం లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

దయాకర్ ఇక లేరు

తెలంగాణకు చెందిన సీనియర్ లీడర్‌ కొత్తకోట దయాకర్‌రెడ్డి తుదిశ్వాస విడిచారు. కొద్దికాలంగా  అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పరిస్థితి విషమించి ఈ తెల్లవారుజామును మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం పర్కాపురం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కొత్తకోట దయాకర్‌రెడ్డి టీడీపీ తరఫున మూడు సార్లు ఎమ్మెల్యేలగా గెలిచారు. అమరచింత నుంచి రెండుసార్లు మక్తల్‌ నుంచి మరోసారి విజయం సాధించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రానివ్వబోను

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తెచ్చుకున్నదే తెలంగాణ వాళ్ళు పరిపాలించుకోవడానికి అని, అలాంటిది షర్మిల వచ్చి తెలంగాణకి నాయకత్వం వహిస్తా అంటే ఊరుకుంటామా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రానికి చెందిన షర్మిల, ఏపీ కాంగ్రెస్‌కి పని చేస్తే తాను స్వాగతిస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. షర్మిల ఏపీసీసీ చీఫ్‌గా పని చేస్తే, సహచర పీసీసీ చీఫ్‌గా ఆమెను కలుస్తానని స్పష్టం చేశారు. తాను ఇక్కడ ఉన్నని రోజులు షర్మిల నాయకత్వం తెలంగాణలో ఉండబోదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. షర్మిల తెలంగాణకి నాయకత్వం వహిస్తాను అంటే అది తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచడమే అవుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ తగ్గుముఖం

గుడ్‌న్యూస్‌! దేశంలో రిటైల్‌ ఇన్‌ఫ్లేషన్‌ తగ్గుముఖం పడుతోంది. మే నెలలో 4.25 శాతంగా నమోదైంది. 25 నెలల కనిష్ఠానికి చేరుకుంది. ఏప్రిల్‌ నెలలో ఇది 4.70 శాతంగా ఉండేదని స్టాటిస్టిక్స్‌ మినిస్ట్రీ సోమవారం వెల్లడించింది. వరుసగా మూడో నెల వినియోగ ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్బణం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్ ఇండియా నిర్దేశించుకున్న 2-6 శాతం పరిధిలోనే ఉండటం గమనార్హం.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

‘బెస్ట్ ఆఫ్ త్రీ’ కాన్సెప్ట్‌పై మాజీలు ఆగ్రహం

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన  తర్వాత టీమిండియా సారథి రోహిత్ శర్మ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ చేసిన ‘బెస్ట్ ఆఫ్ త్రీ’ కాన్సెప్ట్‌పై మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్  ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఫైనల్ అనేది ఒకటే ఉంటుందని.. రెండు, మూడు ఆడించరని రోహిత్‌కు  సూచించారు. విలేకరుల సమావేశంలో రోహిత్.. ఒక ప్రశ్నకు సమాధానంగా, విజేతను నిర్ణయించడానికి ఒక మ్యాచ్‌కు బదులుగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను నిర్వహించి ఉంటే చాలా బాగుంటుందని చెప్పాడు. దీనిపై  గవాస్కర్ స్పందిస్తూ.. ‘లేదు.. ఇదేం (డబ్ల్యూటీసీ ఫైనల్) ఇప్పటికిప్పుడు  నిర్ణయమైంది కాదు.  ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్ (2021-2023)  ప్రారంభంలోనే మీరు దీనికి సిద్ధమయ్యారు..పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

పెంపుడు జంతువుల బీమా:

పెంపుడు జంతువుల బీమా: మనుషులతో పాటు స్థిరచరాస్తులన్నింటికీ ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు. ఆఖరికి బ్యాంక్‌ డిపాజిట్లు, ప్రయాణాలకు కూడా ఇన్సూరెన్స్ ఉంది. బ్యాంక్ దివాలా తీసినా, ప్రయాణం క్యాన్సిల్‌ అయినా దాని తాలూకు నష్టపరిహారం లభిస్తుంది. అలాగే, పెంపుడు జంతువులకు కూడా బీమా సౌకర్యం ఉందని మీకు తెలుసా?. ఎక్కువ శాతం ఇళ్లలో పెంపుడు జంతువులు కూడా కుటుంబ సభ్యులే. వాణి ప్రాణప్రదంగా చూసుకుంటారు. వాటికి అనారోగ్యం వచ్చినా, దూరమైనా తట్టుకోలేరు. అందుకే, కుటుంబ సభ్యుల తరహాలోనే వాటికీ ఇన్సూరెన్స్‌ చేయవచ్చు. కొన్ని షరతులతో పెట్ యానిమల్స్‌కు కూడా ఇన్సూరెన్స్‌ కవరేజ్‌ (Pet Animal Insurance) అందిస్తున్నాయి బీమా కంపెనీలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Game Changer First Review : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేసిన ఎస్. జె సూర్య.. పోతారు.. అందరూ పోతారు
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adani Stocks: అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో రెండోరోజూ పతనం - అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం డౌన్‌
Tamannaah Bhatia : అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
అనార్కలీ డ్రెస్​లో అందమైన బొమ్మలా ఉన్న తమన్నా.. Golden Goddessలా ఉందంటోన్న ఫ్యాన్స్
Zomato: జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
జొమాటోలో ఉద్యోగాన్ని రూ.20 లక్షలిచ్చి కొంటారట - 18,000కు పైగా దరఖాస్తులు
Bank Locker Rules: బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
బ్యాంక్‌ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Embed widget