Top Headlines Today: డిసెంబర్ తర్వాత ఆ కూటమి ఉండబోదన్న కవిత- నేడు సుప్రీంకోర్టులో సీబీఎన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ
Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
Top 10 Headlines Today
I.N.D.I.A. కప్పుకూలడం ఖాయం
ఈ ఏడాది చివరిలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత విపక్షాలు కలిసి ఏర్పాటు చేసిన I.N.D.I.A కూటమి కూలిపోయే అవకాశం ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నికల ఫలితాలు చూశాక అందులోని పార్టీలో ఆ కూటమిలో ఉండాలా వద్దా? అని పునరాలోచనలో పడతాయని అభిప్రాయపడ్డారు. చెన్నైలో నేడు (అక్టోబరు 12) ఏబీపీ నెట్‌వర్క్ నిర్వహించిన ‘సదర్న్ రైసింగ్ సమ్మిట్ - 2023’ కార్యక్రమంలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఇందులో కవితతో పాటు కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వేదికపై ఉన్నారు. ‘2024 సాధారణ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు?’ అనే అంశంపై చర్చ జరిగింది. ప్రముఖ రచయిత చేతన్ భగత్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు కవిత తన అభిప్రాయాలు చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
క్వాష్ పిటిషన్‌పై నేడు విచారణ
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ కొనసాగనుంది. ఇప్పటికే ఈ అంశంపై ఇరు వర్గాల వాదనలు వినిపించాయి. ఈ కేసుపై ఢిల్లీలో మాట్లాడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... చారిత్రాత్మక తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెలాఖరులో జరగనున్నందున బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం ప్రచారం విషయంలో కీలక అడుగులు వేస్తోంది. ఇందుకోసం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇంఛార్జిలను నియమించింది. ప్రస్తుతానికి 54 నియోజకవర్గాలకు బాధ్యులను నియమించారు. కొత్తగా నియమితులు అయిన వీరందరితో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ విజయానికి అనుసరించాల్సిన కార్యాచరణ, వ్యూహాలపై కేటీఆర్, హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
రజినీ సినిమా కోసం వెయిటింగ్
దక్షిణాది ఐదు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ అభివృద్ధి గుర్తించి... దక్షిణ భారతదేశంలోని దార్శనిక ఆలోచనలు, దార్శనికతపై చర్చించేందుకు శతాబ్దానికి పైగా ఘన చరిత ఉన్న ABP నెట్ వర్క్ ఇవాళ చెన్నైలో ABP Southern Rising Summit 2023 నిర్వహించింది. ఈ కార్యక్రమానికి దగ్గుబాటి రానా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏబీపీ మీడియాతో ఇంట్రాక్ట్ అయిన దగ్గుపాటి రానా పాన్ ఇండియా సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ప్రజెంట్ సౌత్ మూవీస్ ని ఆల్ ఓవర్ ఇండియా ఆడియన్స్ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు ఈరోజు తెలుగు సినిమా కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది దీనిపై మీ స్పందన ఏంటని? అడగగా..పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
ద్రవిడ పాలనతోనే పురోగతి
తమిళనాడు ఎంత పురోగతి సాధించినా ద్రావిడ పాలనా విధానం వల్లనే అని తమిళనాడు మంత్రి ఉదయ నిధి స్టాలిన్ అన్నారు. ఏబీపీ సదరన్ రైజింగ్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 70వ దశకంలో కేంద్ర ప్రభుత్వం జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని ప్రోత్సహించిందని, దక్షిణ భారత రాష్ట్రాలు ఈ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేశాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
దసరా హాలిడేస్
ఏపీలోని పాఠశాలలకు అక్టోబరు 14 నుంచి దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. అక్టోబరు 24 వరకు సెలవులు కొనసాగనున్నాయి. ఈ సారి 11 రోజులపాటు అక్కడి స్కూళ్లకు దసరా సెలవులు రానున్నాయి. దసరా సెలవుల అనంతరం 25 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
పొడి వాతావరణం
‘రాబోయే 2 రోజులలో నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రం నుండి పూర్తిగా ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
హ్యాట్రిక్‌పై కివీస్ ఫోకస్
వరల్డ్ కప్‌లో భాగంగా శుక్రవారం మరో ఆసక్తిపోరు జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. రెండు వరుస విజయాలతో కివీస్ జట్టు ఊపు మీద ఉంది. రెండు మ్యాచ్‌లు ఆడి ఒక విజయం ఒక ఓటమితో బంగ్లాదేశ్ కాస్త ఒత్తిడిలో ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
గిల్ ప్రాక్టీస్ షురూ
టీమిండియాకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. ప్రపంచకప్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మళ్లీ రంగంలోకి దిగాడు. డెంగ్యూ కారణంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లకు గిల్ దూరమయ్యాడు. అయితే డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకున్న శుభ్‌మన్ మళ్లీ బ్యాట్ పట్టి రంగంలోకి దిగాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ జరగనున్న గుజరాత్‌లోని అహ్మదాబాద్ మైదానానికి చేరుకున్న గిల్... ప్రాక్టీస్ ప్రారంభించాడు. గిల్ ప్రాక్టీస్ ప్రారంభించిన పాకిస్థాన్‌తో అక్టోబర్ 14న జరిగే మ్యాచ్‌లో అతను బరిలోకి దిగుతాడా లేదా అన్నది ఉత్కంఠగా మారింది. అయితే గిల్ పూర్తి ఫిట్‌గా ఉంటే బరిలోకి దిగడం ఖాయమని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. శుభ్‌మన్ మాత్రం పాకిస్థాన్‌తో శనివారం జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగాలని పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ శుభ్‌మన్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు బీసీసీఐ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి
'ఫ్యామిలీ స్టార్'గా విజయ్ దేవరకొండ!
'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కథానాయకుడిగా ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలో ఓ కుటుంబ కథా చిత్రం రూపొందుతోంది. అందులో 'సీతా రామం' ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథానాయిక. మరో నాయికగా 'మజిలీ', 'రామారావు ఆన్ డ్యూటీ', 'మైఖేల్' సినిమాల ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటిస్తున్నారు. విజయ్ దేవరకొండతో 'గీత గోవిందం' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఈ సినిమా టైటిల్ ఖరారు చేశారట!పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి