అన్వేషించండి

Top Headlines Today: జగన్, సీబీఐకు సుప్రీం నోటీసులు; కాంగ్రెస్‌లోకి ఆలంపూర్ ఎమ్మెల్యే - నేటి టాప్ న్యూస్

నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

ఐటీ, ఈడీ దాడులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ కుమ్మక్కు అయ్యాయని.. రెండు పార్టీలు ఒక్కటై.. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రజలకు బహిరంగలేఖ రాశారు. తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదు.. ప్రశ్నించే గొంతులే ఉండరాదన్న నియంతృత్వ పోకడలతో బీఆర్ఎస్, బీజేపీ వ్యవహరిస్తున్నాయని.. ఆ రెండు పార్టీల్లో చేరిన వారు పవిత్రులు.. కాంగ్రెస్ పార్టీలో చేరితే ద్రోహులు ఎలా అవుతారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య కుదిరిన కామన్ మినిమమ్మ ప్రోగ్రాంలో భాగంగానే.. కాంగ్రెస్ పార్టీలో చేరిన, కాంగ్రెస్ పార్టీ నేతలపై ఈడీ, ఐటీ దాడులు చేయిస్తు్న్నారని మండిపడ్డారు. ఇంకా చదవండి

జగన్, సీబీఐకు సుప్రీం నోటీసులు

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ (CM jagan Bail) రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama) వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో సీఎం జగన్, సీబీఐ (CBI) సహా ప్రతివాదులందరికీ జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా, జస్టిస్ పంకజ్ మిత్తల్ నేతృత్వంలోని సర్వోన్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. 'ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా.?' అని ధర్మాసనం పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించగా, నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ సైతం జత చేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను 2024, జనవరి తొలి వారానికి వాయిదా వేసింది. ఇంకా చదవండి

'ఎన్నికల తర్వాత నీ సంగతి తేలుస్తా' - ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దారెడ్డి, తాడిపత్రిలో టెన్షన్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం రాత్రి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హల్ చల్ చేశారు.  తాడిపత్రి ప్రభుత్వ ఆస్పత్రి కాంట్రాక్టర్లను మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బెదిరించారని ఆరోపిస్తూ ఆయన తన అనుచరులను వెంటబెట్టుకుని జేసీ ఇంటి వద్దకు ర్యాలీగా బయల్దేరారు. ఈ సమయంలో జేసీకి వ్యతిరేకంగా ఎమ్మెల్యే అనుచరులు నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. చివరకు డీఎస్పీ రంగయ్య సద్దిచెప్పడంతో పెద్దారెడ్డి వెనుదిరిగారు. అయితే, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఆయన ఇంటి వద్ద ఎమ్మెల్యేకు స్వాగతం పలకడానికి కుర్చీలు, టీ ఏర్పాటు చేసినట్లు టీడీపీ కార్యకర్తలు తెలిపారు. ఇంకా చదవండి

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు - చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత, చంద్రబాబు ముందస్తు బెయిల్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 29కి విచారణ వాయిదా వేస్తూ ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. అప్పటివరకూ చంద్రబాబుపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. మరోవైపు, ఇసుక కుంభకోణంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్లపైనా విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఇంకా చదవండి

టిక్కెట్ ప్రకటించి బీఫాం ఇవ్వని కేసీఆర్ - కాంగ్రెస్‌లో చేరిన ఆలంపూర్ ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం కాంగ్రె్స పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టిక్కెట్ ను మొదట ఆయనకే ఖరారు చేశారు. కానీ  చివరి క్షణంలో విజయుడు అనే నేతకు బీఫాం ఇచ్చారు. దాంతో అబ్రహాం అసంతృప్తికి గురయ్యారు.  ఇప్పపుడు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార బీఆర్‌ఎస్‌కు షాకిచ్చారు.  ఇటీవలే పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎంపికైన చల్ల వెంకట్రామిరెడ్డి ఆలంపూర్ లో అబ్రహాంకు టిక్కెట్ వద్దని పట్టుబట్టారు. తన ఆధిపత్యాన్ని చాటేందుకు డాక్టర్ అబ్రహంకు బి ఫామ్ దక్కకుండా చేయడమే కాకుండా.. ఆయన వ్యక్తిగత సహాయకునిగా ఉండే విజయుడికి టికెట్ దక్కించుకున్నారు.  ఇంకా చదవండి       

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget