అన్వేషించండి

Telangana Elections 2023 : టిక్కెట్ ప్రకటించి బీఫాం ఇవ్వని కేసీఆర్ - కాంగ్రెస్‌లో చేరిన ఆలంపూర్ ఎమ్మెల్యే

Telangana Elections 2023 : ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆలంపూర్ లో అత్యధిక బీఆర్ఎస్ నేతలు పార్టీ మారిపోయారు.


Telangana Elections 2023 :  జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం కాంగ్రె్స పార్టీలో చేరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే టిక్కెట్ ను మొదట ఆయనకే ఖరారు చేశారు. కానీ  చివరి క్షణంలో విజయుడు అనే నేతకు బీఫాం ఇచ్చారు. దాంతో అబ్రహాం అసంతృప్తికి గురయ్యారు.  ఇప్పపుడు టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార బీఆర్‌ఎస్‌కు షాకిచ్చారు.  ఇటీవలే పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎంపికైన చల్ల వెంకట్రామిరెడ్డి ఆలంపూర్ లో అబ్రహాంకు టిక్కెట్ వద్దని పట్టుబట్టారు. తన ఆధిపత్యాన్ని చాటేందుకు డాక్టర్ అబ్రహంకు బి ఫామ్ దక్కకుండా చేయడమే కాకుండా.. ఆయన వ్యక్తిగత సహాయకునిగా ఉండే విజయుడికి టికెట్ దక్కించుకున్నారు.          

కేసీఆర్ తీరుతో  అసంతృప్తికి గురైన అబ్రహాం                    

దీంతో అబ్రహం తీవ్ర నిరాశకు గురయ్యారు. నామినేషన్‌కు ఒకరోజు ముందు విజయుడికి టికెట్ ప్రకటించడంతో అప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం చేసిన అబ్రహం నిరాశకు గురయ్యారు.  మౌనంగా ఉండడం తప్ప రాజకీయంగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ ప్రకటించి సంచలనం సృష్టించారు. అప్పటినుండి మౌనంగా ఉన్న అబ్రహం ఇటీవల అలంపూర్‌లో నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సభకు  వెళ్ళలేదు.

రిజర్వుడు నియోజకవర్గంలో పెత్తందార్ల ఆధిపత్యంపై విమర్శలు                                      

రిజర్వు నియోజకవర్గంలో పెత్తందార్ల ఆధిపత్యం ఏమిటి అని అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ప్రయోజనం లేకపోవడంతో ఆయన తన అనుచరులతో వరుసగా సమాజంలో చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.   రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అబ్రహంకు కాకుంటే టికెట్టు తన కుమారునికి ఇవ్వాలని కోరిన కేంద్రంలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న మంద జగన్నాథం డిమాండ్‌ను కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదు. మంద జగన్నాథం కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.  

వివాదాస్పదం అవుతున్నచల్లా వెంకట్రామిరెడ్డి తీరు                                             

చల్లా వెంకట్రామిరెడ్డి తీరు , అధిష్టానం నిర్ణయంతో విసుగు ఎత్తిన పలువురు ముఖ్యమైన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం డాక్టర్ అబ్రహం సైతం మాజీ ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, కొత్తకోట ప్రకాష్ రెడ్డి తదితరులతో కలిసి హైదరాబాద్ వెళ్లి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అలంపూర్ నియోజకవర్గ అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలినట్లయింది. ఇప్పటికే నలుగురు జడ్పీటీసీలు  సహా మెజార్టీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరిపోయినట్లయింది. ఎన్నికల సమయంలో ఇలా బీఆర్ఎస్ నుంచి నేతలు వచ్చి చేరడంతో.. కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ విజయంపై మరింత ధీమాగా ఉన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Diversions: ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
ఉజ్జయినీ మహంకాళి బోనాలు - హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
Breaking News: నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
నల్లచెరువు పునరుద్ధరణపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Embed widget