Top Headlines Today: జగన్ సహా 41 మందికి హైకోర్టు నోటీసులు; కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
సీఎం జగన్ సహా 41 మందికి హైకోర్టు నోటీసులు
ఏపీలో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. సీఎం జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది. ఇంకా చదవండి
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ ఓపెన్ ఛాలెంజ్
తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ గా ఉందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత వేగంగా అభివృద్ధి సాధించినట్లు మంత్రి కేటీఆర్ (Minister KTR) తెలిపారు. తొమ్మిదన్నరేళ్లలో తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై హైదరాబాద్ (Hyderabad)లోని హోటల్ కాకతీయలో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ (CM KCR) పాలనలో రైతులు ఆనందంగా ఉన్నారని, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో లక్ష్యాన్ని సాధించామని వివరించారు. ఇంకా చదవండి
వరంగల్‌లో ఈ బ్రదర్స్ రూటే సపరేటు
వారిద్దరూ సొంత అన్న దమ్ములు. ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగుతున్నారు. వారే ఎర్రబెల్లి దయాకర్ రావు బ్రదర్స్. ప్రత్యక్ష ఎన్నికల్లో కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు మాస్ లీడర్ గా విజయ ఢంకా మోగిస్తుంటే, ఆయన సోదరుడు ప్రదీప్ రావు పార్టీలు మారుతూ విజయాన్ని నమోదు చేసుకోలేకపోతున్నారు. ఇంకా చదవండి
వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదల
వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులను సీఎం జగన్ (CM Jagan)తన క్యాంపు కార్యాలయంలో గురువారం బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ ఏడాది జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు రూ.81.64 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75 వేలు అందజేశారు. అలాగే, మైనార్టీ, దూదేకుల, నూర్ భాషా కులస్థులకు రూ.లక్ష, భవన, ఇతర నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.40 వేల చొప్పున నగదు విడుదల చేశారు. పేద వర్గాలను ఆదుకునేందుకు, వారికి చేయూతనిచ్చేందుకు ఈ సాయం అందిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. సాయం పొందిన జంటల్లో 8,042 మంది అమ్మఒడి లేదా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద కూడా ప్రయోజనాలు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇంకా చదవండి
మాజీ ఎంపీ వివేక్ ఇంట్లో ఈడీ సోదాలు
మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకట స్వామి (Vivek venkat swamy) ఇళ్లు, కార్యాలయంలో మంగళ, బుధవారాల్లో ఈడీ అధికారులు (ED Raids) దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వివేక్ కు సంబంధించిన విశాఖ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా నుంచి విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఖాతాల్లోకి బదిలీ అయిన రూ.8 కోట్లు సైఫాబాద్ పోలీసులు ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో ఆ సమాచారంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. కాగా, విశాఖ ఇండస్ట్రీస్ ద్వారా తాజాగా రూ.100 కోట్ల నగదు బదిలీ జరిగినట్లు ఈడీ దర్యాప్తు తేలింది. ఇంకా చదవండి