Top Headlines Today: ఐటీ దాడులపై రాజకీయ దుమారం; పారిశ్రామిక వేత్తలుగా గిరిజనులు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
ఐటీ దాడులపై రాజకీయ దుమారం - భయపడేది లేదన్న కాంగ్రెస్ !
తెలంగాణ ఎన్నికల్లో మహేశ్వరం నుంచి పోటీ చేస్తున్న కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇళ్లు, ఫామ్ హౌస్‌లపై ఐటీ దాడులు దాడులు చేస్తున్నారు. అలాగే బడంగ్ పేట మేయర్ పారిజాత నరసింహారెడ్డితో పాటు మరికొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులపైనా గురి పెట్టారు. వీరిలో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నారు. ఎన్నికల ముంగిట ఇలా ఐటీ దాడులు చేయడం రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంకా చదవండి
పారిశ్రామిక వేత్తలుగా గిరిజనులు
గిరిజనులు పారిశ్రామికంగా ఎదగాల్సి ఉందనిమంత్రి కేటీఆర్ అన్నారు. ఎస్టీ ఆంథ్రప్రెన్యూర్స్ కోసం ప్రత్యేకంగా ఉత్పత్తుల పార్కు పెడతామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ పార్క్ హయత్‌లో గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సక్సెస్ మీట్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ పాల్గొన్నారు. గిరిజనులు చాలా ఎత్తుకు ఎదగాలని కలలు కనాలని, అలాంటివారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఎల్లారెడ్డి మండలంలో ముగ్గురు దళితబంధు లబ్దిదారులు రైస్ మిల్ పెట్టుకున్నారని తెలిపారు. అదేవిధంగా వాటర్‌వర్క్స్‌లో దళితబంధు కింద 150 వాహనాలు ఇచ్చామని వెల్లడిచారు. ప్రభుత్వ సంస్థలతో కలసి పనిచేసేవాళ్లకు పోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. వచ్చే నెల 3న మరోసారి విజయం సాధించి సక్సెస్ మీట్ జరుపుకుందాని చెప్పారు. ఇంకా చదవండి
కేసీఆర్ డిజైన్ చేశారు కనుకే కుంగింది-కాళేశ్వరం ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ సెటైర్
భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్‌ను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పరిశీలించారు. బ్యారేజ్‌పైకి మీదుకు వెళ్లి.. ఎక్కడెక్కడ కుంగింది.. ఎక్కడెక్కడ పగుళ్లు వచ్చాయి అన్నది పరిశీలించారు. ఆ సమయంలో.. కాంగ్రెస్ నేతలు వేలాదిగా బ్యారేజ్ దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసుకుని బ్యారేజ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు-కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు. ఇంకా చదవండి
విద్యార్ధినులతో ప్రిన్సిపాల్, టీచర్లు మసాజ్ లు - జిల్లా కలెక్టర్ ఆగ్రహం, ఇద్దరిపై సస్పెన్షన్
వారంతా నిరుపేద కుటుంబాల బిడ్డలే. బడుగు బలహీన వర్గాల చెందినవారు. అయితే బాగా చదువుకోవాలన్న తాపత్రయం ఆ విద్యార్థులది. తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా తమ బిడ్డలు బాగా చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని తల్లితండ్రులు భావించారు. కానీ తమ పిల్లలు సాంఫీుక సంక్షేమ వసతి గృహాల్లో పడుతున్న ఇబ్బందులు తెలియడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులు అధికారుల ముందు నోరు విప్పడంతో అసలు విషయం బట్టబయలయింది. ఈసంఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా విచారణలో వాస్తవాలు వెల్లడి అవ్వడంతో ప్రిన్సిపాల్ నీలిమతో పాటు మరో ఉపాధ్యాయినిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సంఘటన డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. ఇంకా చదవండి
'ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టడమే లక్ష్యం' - ఐసీఐడీ ప్లీనరీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
రాష్ట్రంలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ తెలిపారు. విశాఖ రాడిసన్ బ్లూ హోటల్ లో సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జల వనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న 25వ ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాన్ని, ఆయన కేంద్ర మంత్రి షెకావత్ తో కలిసి గురువారం ప్రారంభించారు. సుమారు 90 దేశాల నుంచి 500 మంది ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ నెల 8 వరకూ ప్లీనరీ జరగనుంది. తొలుత ముఖ్య అతిథులను సత్కరించిన అనంతరం వారికి నిర్వాహకులు జ్ఞాపికలు బహూకరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజనీ, గుడివాడ అమర్నాథ్ సైతం పాల్గొన్నారు. ఇంకా చదవండి