Konaseema News: విద్యార్ధినులతో ప్రిన్సిపాల్, టీచర్లు మసాజ్ లు - జిల్లా కలెక్టర్ ఆగ్రహం, ఇద్దరిపై సస్పెన్షన్ వే
BR Ambedkar Konaseema: సంక్షేమ వసతి గృహాల్లో జరుగుతోన్న దారణం విద్యార్థులు అధికారుల ముందు నోరు విప్పడంతో బట్టబయలయ్యింది. విచారణకు ఆదేశించిన కలెక్టర్ ప్రిన్సిపాల్, మరో టీచర్ ను సస్పెండ్ చేశారు.
వారంతా నిరుపేద కుటుంబాల బిడ్డలే. బడుగు బలహీన వర్గాల చెందినవారు. అయితే బాగా చదువుకోవాలన్న తాపత్రయం ఆ విద్యార్థులది. తమ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా తమ బిడ్డలు బాగా చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని తల్లితండ్రులు భావించారు. కానీ తమ పిల్లలు సాంఫీుక సంక్షేమ వసతి గృహాల్లో పడుతున్న ఇబ్బందులు తెలియడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. విద్యార్థులు అధికారుల ముందు నోరు విప్పడంతో అసలు విషయం బట్టబయలయింది. ఈసంఘటనపై విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా విచారణలో వాస్తవాలు వెల్లడి అవ్వడంతో ప్రిన్సిపాల్ నీలిమతో పాటు మరో ఉపాధ్యాయినిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ సంఘటన డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి బాలికల గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది.
జరిగింది ఇదీ..
అల్లవరం మండలం గోడి గ్రామంలో బాలికలు, బాలుర గురుకుల పాఠశాలలు వేర్వేరుగా ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ వసతులు అంతంత మాత్రంగా ఉన్నా తమ పిల్లలు మంచి స్థాయికి రావాలని తల్లితండ్రులు భావించి చదివించుకుంటున్నారు. అయితే గోడి బాలికల గురుకుల పాఠశాలలో కొన్ని రోజుల నుంచి విద్యార్థులతో బాత్రూమ్‌లు కడిగిస్తున్నారని కొందరు తల్లితండ్రులకు విద్యార్థులు చెప్పారు. దీంతో వారు పాఠశాల విద్యాకమిటీ ఛైర్మన్ కోట హనుమంతరావు, ఇతర పెద్దలకు తెలిపారు. దీంతో ప్రతి శనివారం విద్యార్ధులను కలుసుకునేందుకు తల్లితండ్రులకు అవకాశం కల్పించడంతో ఆరోజు తల్లితండ్రులతోపాటు కొందరు పెద్దలు పిల్లలను ఈ విషయం గురించి అడగ్గా కొంతమంది పిల్లలు వారంలో మూడు రోజులపాటు తామంతా బాత్రూమ్‌లు కడుగుతున్నామని, అంతే కాదు ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఉపాధ్యాయురాలు తమతో మసాజ్ సైతం చేయించుకుంటున్నారని మరికొందరు తెలిపారు. దీంతో ఆగ్రహించిన కొందరు ఈవిషయంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు కొందరు విద్యార్థులతో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్...
విద్యార్థులతో బాత్రూమ్‌లు కడిగించడంతోపాటు మసాజ్‌లు చేయించుకుంటున్నారన్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సాంఫీుక సంక్షేమ శాఖ అధికారులతోపాటు అల్లవరం ఎంపీడీవో విచారణ చేపట్టారు. ఇదే విషయంపై ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయేల్‌కూడా పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఎక్కువ మంది విద్యార్థులు తమతో బాత్రూమ్‌లు కడిగిస్తున్నారని విచారణలో తేల్చిచెప్పగా, ఇద్దరు విద్యార్థులు మాత్రం తమచేత ఇద్దరు ఉపాధ్యాయులు మసాజ్‌లు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఈ సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్‌కు అధికారులు అందజేశారు.
ప్రిన్సిపాల్, మరో టీచర్ సస్సెండ్..
విద్యార్థినులతో్ బాత్రూమ్‌లు కడిగించడం, బాడీ మసాజ్‌లు చేయించుకున్నారన్న ఆరోపణలు నిజాలేనని విచారణలో తేలడంతో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠశాల ప్రిన్సిపాల్ కే. నీలిమతోపాటు మరో ఉపాధ్యాయిని సస్సెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారని సాంఫీుక సంక్షేమ శాఖ జిల్లా కో ఆర్డీనేటర్ రాజకుమారి తెలిపారు. పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ కిరణ్మయికి ప్రిన్సిపాల్ బాద్యతలు అప్పగించినట్లు ఆమె వెల్లడించారు.
Also Read: Tiger Wandering: పులి తిరుగుతోంది, రాత్రి పూట బయటకు రావొద్దు - శ్రీకాకుళం జిల్లా వాసులకు పోలీసుల హెచ్చరిక!