Top Headlines Today: వైసీపీకి షాకుల మీద షాకులు; తెలంగాణలో జిల్లాలను తగ్గిస్తామన్న రేవంత్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
వైసీపీకి షాకుల మీద షాకులు
వైసీపీ (YSRCP)కి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ (Jagan)కు బై బై చెప్పేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో(Assembly Elections) తమకు టికెట్ దక్కదని నిర్దారణకు వచ్చిన నేతలు వైసీపీని వీడేందుకే మొగ్గు చూపుతున్నారు. తమకు ఏ పార్టీ టికెట్ ఇస్తామంటే ఆ పార్టీ వైపే ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, కాంగ్రెస్ పార్టీల నేతలకు టచ్ లోకి వెళ్తున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి ఊహించని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు జగన్ కు ఝలక్ ఇస్తున్నారు. మొన్న పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, నేడు తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి. ఇంకా చదవండి
తెలంగాణలో జిల్లాలను తగ్గిస్తామన్న రేవంత్
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపడుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. జిల్లాలను పునర్వ్యవస్థీకరిస్తామని, జిల్లాల సంఖ్య తగ్గిస్తామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు జ్యూడిషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జిల్లాలతో పాటు మండలాల పునర్వ్యవస్థీకరణ కూడా చేస్తామన్నారు. దీంతో ఎన్ని జిల్లాలను తగ్గిస్తారు ? ఏ ప్రాతిపదిక తీసుకుంటారు ? రాజకీయంగా జరిగే వివాదాలను ఎలా ఎదుర్కొంటారన్నది సస్పెన్స్‌గామారింది. ఇంకా చదవండి
కేశినేని నానికి చిన్ని స్ట్రాంగ్ కౌంటర్
వారం రోజుల నుంచి విజయవాడ రాజకీయం గుంటూరు కారం(Guntur Kaaram) కంటే ఘాటుగా ఉంది. ఎంపీ కేశినేని నాని(Kesineni Nani) వైసీపీ(YSRCP)లో చేరుబోతున్నారని ప్రకటన చేసిన తర్వాత మరింత హాట్‌హాట్‌గా మారింది. ఆయన వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటిస్తూనే టీడీపీ అధినేత చంద్రబాబుపై, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై తీవ్రస్థాయిలో విమర్సలు చేశారు. ఇంకా చదవండి
షర్మిలకు పీసీసీ చీఫ్ పదవి వద్దు
షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వడంపై కాంగ్రెస్ లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మాజీ ఎంపీ హర్షకుమార్ ఇంకెవరూ ఏపీలో లేరా అని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన వై,ఎస్. షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఇవ్వొద్దని హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఆ రాష్ట్రలో నిరాదరణకు గురైన ఆమె ఇక్కడెలా పనిచేయగలరని ప్రశ్నించారు.ఏపీలో కాంగ్రెస్ ను నడిపించే నాయకులు లేరా అని హర్షకుమార్ ప్రశ్నించారు.ఏపీకీ ప్రత్యేక హోదా,విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు పూర్తి, విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, ఇప్పుడు తెలంగాణలో పుట్టానని చెప్పుకునే షర్మిలకు నాయకత్వం ఇస్తే అదంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా చదవండి
పార్లమెంట్ ఎన్నికల వేళ బీజేపీకి భారీ షాక్
పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో (Telangana) బీజేపీకి (BJP) షాక్ తగిలింది. మాజీ మంత్రి ముఖేష్ కుమార్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ (Vikram Goud) తాజాగా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి (Kishan Reddy) పంపించారు. పార్టీ కోసం ఏమీ ఆశించకుండా పని చేసినా తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పార్టీ హైకమాండ్ కు ఓ లేఖ సైతం రాశారు. 'పార్టీలో కొత్తగా చేరిన వారిని అంటరాని వారిగా చూస్తున్నారు. పెద్ద నాయకులు క్రమశిక్షణకు మారు పేరు అంటూ కొట్టుకుంటుంటే కొందరు చోద్యం చూస్తున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం ఏమీ ఆశించకుండా కష్టపడినా ఫలితం లేకపోతోంది. ప్రజాబలం లేని వారికి పెద్ద పీట వేస్తున్నారు. అలాంటి వారి కింద పని చేయాలని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ఓటమికి, నేతల అసంతృప్తిపై ఎవరూ బాధ్యత తీసుకోలేదు. అందుకే ఆవేదనతో బీజేపీకి రాజీనామా చేస్తున్నా.' అంటూ లేఖలో పేర్కొన్నారు. ఇంకా చదవండి