By: ABP Desam | Updated at : 30 Jan 2023 09:46 AM (IST)
Edited By: jyothi
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు - నలుగురు అరెస్ట్
Tirupati News: తిరుపతి జిల్లా సత్యవేడు మండల పరిధిలోని ప్రముఖ పారిశ్రామికవాడ శ్రీసిటీలో తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ కుటుంబ సభ్యుల కిడ్నాప్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. శ్రీ సిటీ డీఎస్పీ జగదీష్ నాయక్ కథనం మేరకు తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా గుమ్మిడిపూడి తాలూకా పళ్ళువాడ గ్రామానికి చెందిన ఏఐఏడీఎంకే తిరువళ్లూరు ఉత్తర జిల్లా అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి, మాజీ పంచాయతీ ప్రెసిడెంట్‌గా ఉంటూ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. ఆయన సతీమణి రోజా గుమిడిపూడి పంచాయతీ వార్డు కౌన్సిలర్ గా పదవిలో కొనసాగుతున్నారు. వీరి కుమారుడు జాకబ్ చదువుకుంటున్నాడు. ఇంట్లోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేసి మరీ రమేష్ భార్య, కుమారుడిని వాళ్ల కారులోనే కిడ్నాప్ చేశారు. అనంతరం శ్రీ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో గల రాళ్ల కుప్పం గ్రామంలో వదిలేసి పరారయ్యారు.
అందుకే కిడ్నాప్ చేశామంటున్న నిందితులు
రంగంలోకి దిగిన శ్రీ సిటీ పోలీసులు తమిళనాడు పోలీసులతో కలిసి చేసిన కేసును సవాల్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే శ్రీ సిటీ డిఎస్పీ జగదీష్ నాయక్, గుమ్మిడిపుండి డిఎస్పి క్రియాశక్తి మూడు బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కిడ్నాప్‌నకు పాల్పడ్డ సత్యవేడు, నాగలాపురం పల్లెవాడ గ్రామాలకు చెందిన సురేందర్, సంతోష్, భాస్కర్, నవీన్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న చంద్రశేఖర్ కోసం గాలింపును ముమ్మరం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కౌన్సిలర్ రోజా భర్త రమేష్ కుమార్.. తమకు చెందిన మూడెకరాల భూమిని తక్కువ ధరకు కొనుగోలు చేశారని, ఆ భూమికి తగిన మొత్తం చెల్లించ లేదని, మిగిలిన ఐదెకరాల భూమిని తక్కువ ధరకు అమ్మాలని బెదిరించాడని, వ్యవసాయానికి కావాల్సిన విద్యుత్తును కూడా రాకుండా అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేశాడని... అందుకే కిడ్పాన్ చేశామని నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు పోలిసులు తెలిపారు.
పది రోజుల క్రితం కాశీబుగ్గలో యువతి కిడ్నాప్
శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ వాణిజ్య కేంద్రంలో ఓ యువతి కిడ్నాప్ యత్నానికి గురైన ఘటన కలకలం రేపింది. సూది కొండ నుంచి హుదుద్ గృహాల ప్రాంతానికి యువతిని బలవంతంగా తీసుకెళ్లి దాదాపు ఆరుగంటలపాటు బంధించారు. కుటుంబసభ్యులు స్థానికులు యువతి కోసం వెతగ్గా చివరకు చున్నీతో బంధించిన వైనాన్ని గుర్తించి సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో అలజడి రేపింది. సూదికొండకు సమీపంలోని ఇండస్ట్రీయల్ ఏరియాకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఇద్దరు అమ్మాయిలు ఓ యువకుడు థియేటర్ అడ్రసు అడగగా ఆమె చెప్పేలోపే చున్నీతో కట్టి బలవంతంగా పట్టుకుపోయారని బాధితరాలు చెబుతుంది. కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఆ ప్రాంతంలో పాడుపడిన భవనాలు చూసి ఆశ్చర్యపోయారు. అసలు కిడ్నాప్ కు యత్నించిన వారేవరై ఉంటారనేది అంతు చిక్కడంలేదు. హిందీ, తెలుగు భాషలో మాట్లాడుకున్నారని చెప్పడంతో పోలీసులు వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అమ్మాయికి ఎటువంటి హాని కలుగకుండా బయటపపడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమౌదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.
CBI Recruitment: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 5,000 అప్రెంటిస్ ఖాళీలు, తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే?
ABP Desam Top 10, 21 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
CMA Result 2023: ఐసీఎంఏఐ సీఎంఏ ఇంటర్, ఫైనల్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ లింక్ ఇదే!
Ugadi Wishes: తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు చెప్పిన సీఎంలు, దేశాభివృద్ధికి పాటుపడాలని సూచన
రైల్వే అధికారులతో దక్షిణ మధ్య రైల్వే జీఎం సమావేశం - చర్చించిన అంశాలివే
Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా
AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !
TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?