News
News
X

Tirumala Hundi Income: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, నిన్న హుండీ ఆదాయం ఎంతంటే?

Tirumala Hundi Income: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శుక్రవారం (మార్చి3)వ తేదీ ఒక్కరోజే 58 వేల 137 మంది స్వామి వారిని దర్శించుకోగా..3.30 కోట్ల రూపాయల హుండీ ఆదాయం నెలకొంది. 

FOLLOW US: 
Share:

Tirumala Hundi Income: తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శనివారం శ్రీనివాసుడికి ప్రీతికరమైన రోజు కావడంతో సుప్రభాతంలో నువ్వుల గింజలతో ప్రసాదాన్ని నివేదిస్తారు. శుక్రవారం ఒక్క రోజునే (మార్చి3 ) 58,137 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 26,805 మంది తలనీలాలు సమర్పించగా, 3.30 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. అయితే సర్వదర్శనం భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 11 కంపార్ట్మెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. దీంతో టైం స్లాట్ టోకెన్లు లేని సర్వదర్శనం భక్తులకు స్వామి వారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతుంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు దాదాపు రెండు గంటల సమయం పడుతుంది. 

నల్ల నువ్వుల బెల్లంతో కలిపిన ప్రసాదం..

శ్రీవారి ఆలయంలో వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వేంకటేశ్వరుడికి కైంకర్యాలు నిర్వహిస్తున్నారు అర్చకులు. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన రోజుగా పిలువబడుతుంది. ఈ క్రమంలో ప్రత్యూషకాల ఆరాధనతో ఆలయ ద్వారమును తెరిచిన అర్చకులు.. వైఖానస అర్చకులు, సన్నిధి గొల్లలు, జియ్యంగార్లు స్వామి వారి సన్నిధిలోకి ప్రవేశించి స్వామి వారి తొలి దర్శనం చేసుకుంటారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వర సుప్రభాత స్త్రోతంతో స్వామి వారిని మేలు కొలిపారు. బంగారు వాకిలి వద్ద శ్రీ వేంకటేశ్వరుని సుప్రభాతం స్తోత్రం, ప్రవర్తి, మంగళ శాసనం వంటివి పటిస్తూ ఉండగా సన్నిధిలో వైఖానస అర్చకుల ప్రత్యూష కాలరాతనలో భాగంగా శ్రీవారికి మొదటి నివేదనగా పచ్చి పాలను నివేదన సమర్పించిన అనంతరం "నల్ల నువ్వుల బెల్లంతో " కలిపిన ప్రసాదాన్ని స్వామి వారికి నివేదిస్తారు. ముందు రోజు రాత్రి పావళింపు సేవలో బంగారు నవారు మంచంపై సేవించి ఉన్న శ్రీవారి కౌతుక బేరం శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి వారిని మూలవిరాట్ పాదాల వద్ద ఉంచి సింహాసనంపై జీవ స్థానంలో వేయించేపు చేస్తారు. అనంతరం ఏకాంతంగా శ్రీవారికి కర్పూర నిరాజనం సమర్పణ జరుపుతారు.దీనినే కైకర్యపరుల హారతిని కూడా పిలుస్తారు.

గొల్ల హారతి సమర్పణ..

శ్రీవారి మూలవిరాట్ ముఖ మండపంలో గడ్డం మీద అర్చకులు గడ్డం బొట్టుగా పచ్చ కర్పూరాన్ని అద్దిన తరువాత గొల్ల హారతి సమర్పణ జరుగుతుంది. తర్వాత వైఖానస అర్చకులు ముందుగా బ్రహ్మ తీర్థాన్ని తాము స్వీకరించిన తరువాత జియ్యంగార్లలకు, సన్నిధి గొల్లకు బ్రహ్మ తీర్థాన్ని అందిస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్ద మంగళ శాసన శ్లోకాలు పఠనం జరుగుతుండగా, సన్నిధిలో శ్రీవారికి కర్పూర నీరాజన సమర్పణ జరుగుతుంది. మహంతి మఠం, మైసూరు రాజావారి ప్రతినిధి, తాళ్లపాక అన్నమయ్య వంశీయులు తమళపాకు, వక్కలు శ్రీవారికి నివేదించి నవనీత హారతిని సమర్పిస్తారు. ఈ సమయంలో జరిగే దర్శనాన్ని విశ్వరూప దర్శనం అని కూడా పిలుస్తారు. అనంతరం భోగ శ్రీనివాసమూర్తి వారికి స్నాన పీఠంపై వేయించేపు చేసిన అర్చకులు.. తోమాల సేవ ప్రారంభిస్తారు. ముందుగా ఆకాశగంగా తీర్థం, పాలు పరిమళం మొదలైన ద్రవ్యాలతో పురుష సూక్త పఠనంతో అభిషేకం నిర్వహిస్తారు. తర్వాత శ్రీవారి బంగారు పాదకవచములకు, సాలగ్రామములకు యధాక్రమం తిరుమంజనం జరిపిస్తారు.

30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ

అనంతరం పరధా వేసి ప్రాతఃకాల ఆరాధనకు సంకల్పం చేసి ఆకాశగంగా తీర్థంతో పంచ పాత్రలను నింపి భూతశుద్ధి, ఆవాహనాధులను పూర్తి చేసి పరదా తొలగిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు ఆసనం, పాద్యం, అర్ఘ్యం,అచమనం మొదలైన 30 ఉపచారాలతో వేద మంత్రోచ్చారణ జరుగుతుంది. అటుతరువాత వక్షఃస్ధల లక్ష్మీ, పద్మావతి తాయార్లకు, శ్రీ భోగ శ్రీనివాస మూర్తి వారికి, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తికి శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారికి సీతా, లక్ష్మణ, రాములవారికి, రుక్మిణి సమేత శ్రీ కృష్ణ స్వామి వారికి సాలగ్రామ, శఠారిలకు శ్రీ సుదర్శనల వారికి విమాన వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి మూర్తులన్నింటినీ పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. శ్రీవారి మూలవిరాట్ కు నక్షత్ర హారతి, కర్పూర హారతి సమర్పిస్తారు. ఈ తంతుతో తోమాల సేవ పూర్తి అవుతుంది. అటు తర్వాత ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా స్నపన మండపంలో శ్రీ కొలువు శ్రీనివాసమూర్తి వారి సమక్షంలో దర్బార్ నిర్వహిస్తారు.

1008 నామాలు పటిస్తుండగా.. అర్చన

శ్రీవారికి పంచాంగ శ్రవణం, హుండీ జమాకర్షణ విన్నవించి, బెల్లంతో కలిపిన నువ్వుల పిండిని నివేదిస్తారు. నవనీత హారతి సమర్పించిన అనంతరం శ్రీనివాసమూర్తిని తిరిగి సన్నిధిలోకి వేంచేపు చేసి, సన్నిధిలో శ్రీవారికి సహస్రనామ అర్చన సేవ నిర్వహిస్తారు. శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళిలోని 1008 నామాలు పట్టిస్తుండగా తులసీ దళములతో శ్రీవారికి అర్చన చేస్తారు. అర్చన తర్వాత స్వామి వారికి నక్షత్ర హారతి, కర్పూర హారతి జరిపి మొదటి నివేదనకు సన్నాహాలు జరుపుతారు. అటు తరువాత శ్రీవారికి ప్రాతఃకాల ఆరాధనలో భాగంగా మొదటి ఘంటా నివేదన జరుగుతుంది. స్వామి వారి ప్రాతఃకాల నైవేద్యంలో భాగంగా అన్న ప్రసాదం, లడ్డూ, వడ, వంటి నివేదనలు సమర్పిస్తారు. అటు తర్వాత సన్నిధిలో శ్రీవారికి శ్రీ వైష్ణవ సాంప్రదాయకంగా సాత్తుమొర నిర్వహించిన తరువాత సర్కారు వారి హారతి జరిపి వీఐపీ బ్రేక్‌ దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. అటు తర్వాత శ్రీవారికి మధ్యాహ్నిక రెండో గంట నివేదన, బలి జరిపి తిరిగి సర్వదర్శనం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు. శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని విమాన ప్రదక్షణగా సంపంగి ప్రారకారంలోని కళ్యాణ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు అభిజీలగ్నంలో శ్రీవారికి నిత్య కళ్యాణోత్సవాన్ని అర్చకులు నేత్రపరంగా నిర్వహిస్తారు. 

తిరువీసం, ఘంటాబలి నిర్వహణ

శ్రీవారి ఆలయంలోని అద్దాల మండపంలో డోలోత్సవం సేవను శాస్త్రోక్తంగా నిర్వహించి, ఉత్సవ మూర్తులను ఆలయ వెలుపల ఉన్న వైభవోత్సవ మండపానికి ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ వారికి ఆర్జిత బ్రహ్మోత్సవం, ఆర్జిత వసంతోత్సవం సేవలు నిర్వహిస్తారు. సాయంత్రం కొలువు మంటపంలో సహస్త్ర దీపాల కాంతులతో శ్రీవారికి ఊంజల్ సేవను జరిపిస్తారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత తిరుమాఢ వీధిలో నిత్యోత్సవానికి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారిని సన్నిధిలోనికి వేంచేపు చేస్తారు. సర్వదర్శనం నిలుపుదల చేసి శ్రీవారికి రాత్రి కైంకర్యాలను ప్రారంభిస్తారు అర్చకులు. ఈ క్రతువులో భాగంగా శ్రీవారి మూలవిరాట్ కు ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలను తొలగించి, సన్నిధి పాత్ర శుద్ధి చేస్తారు. అనంతరం శ్రీవారికి రాత్రి తోమాల, రాత్రి అర్చన, రాత్రి గంట, తిరువీసం ఘంటాబలి నిర్వహించి సర్వ దర్శనం భక్తులను స్వామి వారి దర్శనంకు అనుమతిస్తారు. సర్వదర్శనం పూర్తయిన తర్వాత శ్రీవారికి చివరి సేవగా ఏకాంత సేవను నిర్వహిస్తారు అర్చకులు.

Published at : 04 Mar 2023 09:02 AM (IST) Tags: Tirumala latest updates Tirumala Rush Tirumala Hundi Income Tirumala News Tirumala Latest News

సంబంధిత కథనాలు

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

SSC CHSLE 2022 Key: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ఈ - 2022 ఆన్సర్ 'కీ' విడుదల, అభ్యంతరాలకు అవకాశం!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

ISRO Jobs: ఇస్రో-నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌లో ఖాళీలు, అర్హతలివే!

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

నెల గడువిస్తే 24 గంటల్లో రాహుల్ గాంధీపై అనర్హత వేటు అన్యాయమే: కేంద్ర మాజీ మంత్రి

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?