News
News
X

Independence Day 2022 : భారత వాటర్ వారియర్స్ - వీరి స్ఫూర్తి లక్షల మంది దాహం తీరుస్తోంది !

దేశంలో నీటి కోసం యుద్ధం చేసిన వారిలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. వారిలో బాగా ప్రభావితం చేసిన ముగ్గురి వివరాల గురించి తెలుసుకుందాం !

FOLLOW US: 

 

Independence Day 20222  :  భారత్‌లో జనాభా ఎక్కువ. నీటి అవసరాలు ఎక్కువ. అంతే కాదు నీరు అరుదుగా లభించే ప్రదేశాలు కూడా ఎక్కువే. దుర్బిక్ష  ప్రాంతాలు చాలా ఎక్కువ. ఇలాంటి సందర్భాల్లో నీటికి నిలకడ నేర్పి.. చాలా ప్రాంతాల్లో నీటి సమస్య లేకుండా చేసిన వారు కొంత మంది ఉన్నారు. వారు తమ జీవితాన్ని నీటి సంరక్షణ కోసమే కేటాయించారు. వాటిలో వారిలో ముగ్గురు గురించి తెలుసుకుందాం. 

వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా .. రాజేందర్ సింగ్

వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గురించి కాస్త అవగాహన ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు.  5 నదులకు జీవం పోశారు రాజేందర్ సింగ్  దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే రాజస్థాన్ లో వాటర్ కన్జర్వేషన్ విషయంలో ప్రజల్లో మార్పు తీసుకువచ్చి... ప్రభుత్వాలతో పని లేకుండా వెయ్యి గ్రామాలను సస్యశ్యామలం చేశారు. వట్టిపోయిన ఐదు నదులకు జీవం పోశారు. నీళ్లకు నిలకడ నేర్పిన రాజేందర్ సింగ్ కు గత ఏడాది స్టాక్ హోం వాటర్ ప్రైజ్ లభించింది. 2000వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ రివర్ ప్రైజ్...అదే సంవత్సరం ప్రతిష్ఠాత్మక మెగసెసె అవార్డు కూడా అందుకున్నారు.  నీటి కోసం రాజస్థాన్ ప్రజలు కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లడం... తమ జీవితంలో ఎక్కువ భాగం నీటి అన్వేషణలోనే గడిపేయడం గుర్తించి.. తన లక్ష్యాలను మార్చుకున్నారు. నీటి గురించి గ్రామీణులందర్నీ చైతన్యపరిచే లక్ష్యంతో ముందుకు వెళ్లాడు. కష్టమైన అందర్నీ ఒక చోటకు చేర్చి వాటర్ కష్టాల నుంచి బయటపడే మార్గాలను వివరించాడు. తనతో పాటు వచ్చినవారితోనే ముందుకు కదిలాడు. మొదట గ్రామాల్లో అక్కడక్కడా వర్షపునీటిని ఒడిసిపట్టే చిన్నపాటి చెక్‌డ్యాంలు, స్టోరేజ్ ట్యాంక్‌లను నిర్మాణం చేశాడు. దీంతో వర్షాలు పడిన తర్వాత భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఒకప్పుడు ఎండిపోయిన బావులు కూడా రాజేంద్ర సింగ్ పుణ్యమాని నిండిపోయాయి. ఇప్పుడు కేవలం 15 అడుగుల లోతులోనే ఆయా గ్రామాలకు నీళ్లు లభిస్తున్నాయి.  

ఇంకుడుగుంతల సృష్టికర్త అయ్యప్ప మసాగి  !

కర్నాటకలో లక్షల మంది రైతులను కరువు కోరల నుండి కాపాడిన వాటర్ వారియర్ అయ్యప్ప మసాగి. నార్త్ కర్నాటకలోని ఓ మరుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టిన అయ్యప్ప మసాగి.. సైన్స్ ను గ్రామీణ అభివృద్ధికి ఉపయోగించాలనే సంకల్పంతో ఉద్యోగం వదిలేసి గ్రామీణ బాట పట్టారు.  స్వగ్రామానికి వచ్చి ఆరెకరాల పొలం కొనుక్కుని వ్యవసాయం ప్రారంభించారు. కరువుకు నిలయమైన ఆ ప్రాంతంలో  సాగులో ఫెయిలైన అయ్యప్ప చేసిన పరిశోధన లక్షకు పైగా రైతుల కుటుంబాలకు వెలుగునిచ్చింది. చిన్న చిన్న టెక్నిక్స్ తో కరువు పరిస్థితుల్లో ఎలా సాగు చేయాలో ఇంకుడు గుంతల ద్వారా అయ్యప్ప రైతులకు తెలియజేశారు. ఒక్క ఎకరంలో ఎనిమిది చోట్ల ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి... వాటిలోకి నీరు వెళ్లేలా రైతులందరికీ అవగాహన కల్పించారు. ఈ ఎనిమిది ఇంకుడు గుంతులు శాశ్వతంగా రెయిన్ హార్వెస్టింగ్ యూనిట్లుగా ఉండిపోతాయి. వర్షం పడినప్పుడు ఇవి భూగర్భజలాలు పెరిగేందుకు ఉపయోగపడుతాయి. వీటి వల్ల ఎక్కడ పడిన వర్షం అక్కడే నిల్వ ఉండినట్లవుతుంది. లక్షల మంది రైతులు అయ్యప్ప చూపించిన బాటలో నడిచి మంచి ఫలితాలు పొందుతున్నారు. ఈ విధానం సూపర్ సక్సెస్ కావడంతో అయ్యప్ప మసాగి పేరు మార్మోగిపోయింది. ప్రస్తుతం అయ్యప్ప దేశవ్యాప్తంగా కొన్ని వేల వాటర్ కన్జర్వేషన్ ప్రాజెక్టుల్లో పాలు పంచుకుంటున్నారు. ఆరు వందలకుపైగా చెరువులను సృష్టించారు. మసాగి ప్రయత్నాల వల్ల 70బిలియన్ల లీటర్ల వర్షపు నీరు పునర్వినియోగంలోకి వచ్చిందని అంచనా. అయ్యప్ప బెంగళూరు కేంద్రం వాటర్ లిటరసి ఫౌండేషన్ ను నడుపుతున్నారు.  

 నీళ్లీ లీకయితే ప్రత్యక్షమయ్యే అబిద్ సుర్తి

అబిద్ సుర్తి... ముంబైలోని చాలా ఇళ్లకు సుపరిచితుడు.  ఆయన లక్ష్యం వేరు. నీరు వృధాకాకుండా కాపాడటమే ఆయన చేసే యుద్ధం. వాటర్ లీకవుతున్నట్లు అనుమానం వచ్చినా అక్కడ వాలిపోతాడు. సొంత ఖర్చుతో ప్లంబింగ్ పని చేయించి.. వాటర్ లీక్ కావడం లేదని నిర్ణయించుకున్న తర్వాతే అక్కడ్నుంచి కదులుతాడు. అబిద్ ముంబై లో డ్రాప్ డెడ్ ఫౌండేషన్ ను నడుపుతున్నారు. ఇందులో అబిద్ ఒక్కడే సభ్యుడు. రోజంతా ఓ ప్లంబర్ ను తన వెంట తీసుకుని.. ఎక్కడెక్కడ నీళ్లు లీకవుతున్నాయో తెలుసుకోవడం ... దాన్ని ఆపేందుకు ప్లంబింగ్ వర్క్ చేయించడం.. ఇదే అబిద్ పని. ఇదంతా ఉచితంగానే చేస్తూంటాడు. . 2007లో తన రచనకు గాను.. హిందీ సాహిత్య సంస్థ ఇచ్చిన అవార్డుకు వచ్చిన లక్ష రూపాయల నగదుతో - వాటర్ కన్జర్వేషన్ ప్రయత్నాలకు శ్రీకారం చుట్టాడు.  

Published at : 09 Aug 2022 04:47 PM (IST) Tags: Independence Day Azadi ka Amrit Mahotsav Post Independence Development Water Warriors Rajender Singh Ayyappa Masagi Abid Surti

సంబంధిత కథనాలు

Ballistic Missile Over Japan: దూకుడు పెంచిన కిమ్- జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం!

Ballistic Missile Over Japan: దూకుడు పెంచిన కిమ్- జపాన్ మీదుగా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం!

Breaking News Live Telugu Updates: టీడీపీ నాయకుల వెరైటీ నిరసన, బురదలో కూర్చొని నినాదాలు

Breaking News Live Telugu Updates: టీడీపీ నాయకుల వెరైటీ నిరసన, బురదలో కూర్చొని నినాదాలు

Karnataka Road Accident: బాబు చికిత్స కోసం రూ.1 కోటి సమకూరినా, ట్రీట్‌మెంట్‌కు వెళ్తుంటే తీవ్ర విషాదం

Karnataka Road Accident: బాబు చికిత్స కోసం రూ.1 కోటి సమకూరినా, ట్రీట్‌మెంట్‌కు వెళ్తుంటే తీవ్ర విషాదం

NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

NEET UG Counselling: నీట్ యూజీ 2022 కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

Nellore: స్వచ్ఛ సర్వేక్షణ్ - నెల్లూరు టార్గెట్ ఎలా రీచ్ అయిందంటే?

టాప్ స్టోరీస్

FIR On Srikalahasti CI : చిక్కుల్లో శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

FIR On Srikalahasti CI :  చిక్కుల్లో  శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్ - ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశం !

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

J&K DGP Murder: జమ్మూకాశ్మీర్ డీజీ దారుణ హత్య - కేంద్ర మంత్రి అమిత్ షాకు గిఫ్ట్ అని ఉగ్రసంస్థ ప్రకటన

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

SP Balu Statue Removed: గుంటూరులో ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు, ఏర్పాటు చేసి 24 గంటలు గడువకముందే !

Dharmana : రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !

Dharmana :  రాజధాని లేక పోవడానికి చంద్రబాబే కారణం  - మేధావులు స్పందించాలని పిలుపునిచ్చిన మంత్రి ధర్మాన !