News
News
వీడియోలు ఆటలు
X

SC On Live-in Relationships: సహజీవనం చేసే వాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా ?

Live-in Relationships: సహజీవనం చేసే వారికి రిజిస్ట్రేషన్ ఉండాలన్న పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది.

FOLLOW US: 
Share:

SC On Live-in Relationships: సహజీవనం చేసేవాళ్లకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇటువంటి సంబంధాల నమోదుకు ఓ వ్యవస్థ ఉండాలని పిటిషనర్ .. తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే ఇది ఆచరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ చేయడానికి నిరాకరించింది.  .శ్రద్ధా వాకర్, నిక్కీ యాదవ్ వంటి వారి హత్యల తర్వాత సహజీవనం చర్చనీయాంశమయిందని..  గోప్యంగా సాగుతున్న ఇలాంటి సంబంధాలు నిత్యం క్రూరమైన నేరాలకు కారణమవుతున్నాయని పిటిషనర్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెలల్ారు.  లైవ్-ఇన్ పార్టనర్‌ల భద్రత కోసం, వారి రిలేషన్‌షిప్ గురించి పోలీసులకు సమాచారం ఉండటం అవసరమని వాదించారు. కానీ ఇది ఆచరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

ఇటీవల జరిగిన కొన్ని సంచలన హత్యలు సహజీవనం చేస్తున్న వారు పాల్పడటంతో  ప్రస్తుతం ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిజానికి మన దేశంలో పెళ్లి చేసుకున్న తర్వాతే జంటలు కలిసి ఉంటాయి. పెళ్లి చేసుకోకుండా కలిసి ఉండే జంటల్ని సమాజం అంగీకరించదు. కానీ చట్టపరంగా మేజర్లు అయితే వారి ఇష్టం వచ్చినట్లుగా జీవించే హక్కు ఉంది. వారు కలిసి ఉండటం చట్ట పరంగా ఎలాంటి తప్పు కాదు. అయితే ఇలాంటి సహజీవన వ్యవహారాల వల్ల నేరాలు పెరుగుతున్నాయన్న వాదనతో సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.  అయితే ప్రస్తుతం ఉన్న చట్టాల మేరకు.. సహజీవనానికి రిజిస్ట్రేషన్ అనేది ఆచరణ సాద్యం కాని విషయమని సుప్రీంకోర్టు నిర్దారణకు వచ్చింది. 

యుక్త వయసు వచ్చిన జంట వివాహ వ్యవస్థ వెలుపల కూడా సహజీవనం చేయొచ్చునని సుప్రీంకోర్టు 2018లోనే తీర్పు ఇచ్చింది. తన జీవితభాగస్వామి ఎవరో నిర్ణయించుకునే స్వేచ్ఛ, నచ్చిన విధంగా ఎంపిక చేసుకునే హక్కు యువతికి ఉన్నదని .... పరస్పర అంగీకారంతో, ఇష్టపూ ర్వకంగా ఏర్పడే ఇలాంటి బంధాల్లో జోక్యం చేసుకునే హక్కు తల్లిదండ్రులతోసహా ఎవరికీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.  అయితే సమాజంలో ఉన్న నైతిక విలువల పరంగా ఇలాంటి బంధాలు వివాదా స్పదం అవుతూనే ఉన్నాయి. 

మరి పెళ్లి కాకుండా సహజీవనం చేసిన వారికి పిల్లల సంగతేమిటన్నదానిపైనా గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు   ఒక జంట వివాహమనేది లేకుండా దీర్ఘకాలం కలిసి ఉన్న పక్షంలో దాన్ని చట్టబద్ధమైన వివాహంతో సమానంగా గుర్తించాలని స్పష్టం చేసింది.  వారి సంతానాన్ని అక్రమ సంతా నంగా పరిగణించడం చెల్లదని  తం ఒక కేసులో తీర్పునిస్తూ సుప్రీంకోర్టు చెప్పింది. పెళ్లాడకుండా కలిసి ఉన్న ఒక జంట మధ్య విభేదాలు ఏర్పడి, భరణం కోసం ఆమె కోర్టును ఆశ్రయించినప్పుడు కూడా ఇదే న్యాయస్థానం సహజీవనంలో తప్పేమీ లేదని చెప్పింది. అయితే ఇలాంటి బంధంలో ఉండే మహిళల రక్షణ కోసం స్పష్టమైన చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అయితే ఇలాంటి చట్టాలు ఇంకా కేంద్ర ప్రభుత్వం రూపొందించలేదు. అలాగే ఈ సహజీవనాన్ని రిజిస్ట్రేషన్ చేయడం కూడా ఆచరణ సాధ్యం కాదు. 

Published at : 20 Mar 2023 01:06 PM (IST) Tags: Live-in relationship Supreme Court Cohabitation Shraddha Walker Murder

సంబంధిత కథనాలు

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

చాలా సింపుల్‌గా నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్‌ దంపతుల కుమార్తె వివాహం

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్‌జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?

Weather Latest Update: నేడు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలకు ఛాన్స్! బిపర్‌జోయ్ తుపాను తీవ్రత ఎలా ఉందంటే?

WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!

WDCWD: విశాఖపట్నం జిల్లాలో 34 అంగన్‌వాడీ పోస్టులు, వివరాలు ఇలా!

TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో 30 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్&సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్‌ పోస్టులు

TS WDSC: తెలంగాణ దివ్యాంగుల గురుకులాల్లో 30 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్&సెకండరీ గ్రేడ్ బేసిక్ ట్రైన్డ్ టీచర్‌ పోస్టులు

Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 09 June 2023: రేటు తగ్గిన పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

టాప్ స్టోరీస్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Janasena News : జనసేనలోకి ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు - చీరాలపై గురి పెట్టారా ?

Janasena News : జనసేనలోకి ఆమంచి  కృష్ణమోహన్ సోదరుడు -  చీరాలపై గురి పెట్టారా ?

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు- చేప ప్రసాదం కోసం వచ్చే వారికి  ప్రత్యేక పార్కింగ్ స్థలాలు

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam

RBI Governor Shaktikanta Das : లక్షా 80వేల కోట్ల రూపాయల విలువైన 2వేలనోట్లు ఉహసంహరణ | ABP Desam