Heeraben Death: హీరాబెన్ మృతిపై తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల సంతాపం, ప్రధాని మోదీకి ప్రగాఢ సానుభూతి!
Heeraben Death: ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతిపై తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో దేశమంతా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Heeraben Death: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి మృతిపై తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రాజకీయ ప్రమఖులు సంతాపం తెలియజేస్తున్నారు. హీరాబెన్ మోదీ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో దేశమంతా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.
Chief Minister Sri YS Jagan Mohan Reddy has expressed deep sorrow and grief over the passing away of Smt Heeraben Modi, mother of PM Sri Narendra Modi. The Chief Minister said that he shares the personal grief of Modiji and extended his heartfelt condolences on the bereavement.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 30, 2022
ప్రధాని నరేంద్ర మోదీ తల్లి శ్రీమతి హీరాబెన్ మోదీ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోదీజీకి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు తెలిపారు. హీరాబెన్ మృతికి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు వవరించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హీరాబెన్ మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Hon'ble Shri.@narendramodi ji's mother Smt #HeerabenModi reached lotus feet of God.Nation stands to share your loss & grief as our own families.We stand to pray for the departed soul while appealing God to give strength to bear the loss & continue tireless service to Nation. pic.twitter.com/Ma19cotWxx
— Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) December 30, 2022
హీరాబెన్ మోదీ ఆ భగవంతుడి పాదాలను చేరుకున్నారని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై అన్నారు. ఈ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు వివరించారు. ప్రధాని మోదీకి జరిగిన ఈ నష్టానికి దేశ ప్రజలంతా అండగా ఉంటారని ట్వీట్ చేశారు. ఆ బాధను తట్టుకునే శక్తిని ప్రధానికి ఇవ్వాలని ఆ దేవుడిని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
I express my profound grief and sadness over the passing away of Smt. Heeraben Modi, mother of Hon'ble Prime Minister Sri Narendra Modi, in the early hours on Friday.
— Biswa Bhusan Harichandan (@BiswabhusanHC) December 30, 2022
హీరాబెన్ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తున్నానని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు. శుక్రవారం రోజు ఉదయమే ప్రధాని మోదీ తల్లి మృతి చెందారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
తల్లీ బిడ్డ అనుబంధం వెలకట్టలేనిది: వెంకయ్య
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి మరణ వార్త తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. తల్లీ బిడ్డల మధ్య ఉన్న బంధం వెల కట్టలేనిదన్నారు. దేవుడి సృష్టిలో ఇంతకంటే విలువైనది ఏదీ లేదన్నారు. ఆ బంధం వర్ణించడానికి కూడా మాటలు సరిపోవని ట్వీట్ చేశారు. హీరాబెన్ ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థించారు.
My deepest condolences to Prime Minister Shri @narendramodi on the sad demise of his beloved mother, Smt. Heeraben Modi There is nothing as priceless & indescribable in God’s creation as the bond between mother & child. May her atma attain sadgati! Om shanti pic.twitter.com/NEFsir1SJb
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) December 30, 2022
ప్రధాని మాతృమూర్తి శ్రీమతి హీరాబెన్ స్వర్గస్తులయ్యారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మొదటి దైవం, తొలి గురువు అయిన తల్లిని కోల్పోతే ఉండే దుఖం తనకు తెలుసని.. ఈ బాధాకర సమయంలో ప్రధానికి, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు.
ప్రధానమంత్రి శ్రీ @NarendraModi గారి మాతృమూర్తి శ్రీమతి హీరాబెన్ గారు స్వర్గస్తులయ్యారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. మొదటి దైవం, తొలి గురువు అయిన తల్లిని కోల్పోతే ఉండే దుఖం నాకు తెలుసు. ఈ బాధాకర సమయంలో ప్రధాని గారికి, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను. pic.twitter.com/rmFpU5D2iV
— G Kishan Reddy (@kishanreddybjp) December 30, 2022
తల్లి హీరాబెన్ మృతి వార్త తనను తీవ్రంగా కలిచి వేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ఈ విషాధ సమయంలో కుటుంబ సభ్యులంతా ధైర్యంగా ఉండాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.
पूज्य माता जी के देवलोक गमन से मन व्यथित है,मातृत्व की शीतल छाया अब हमारे साथ नहीं है ह्रदय स्वीकार नहीं कर पा रहा है। ईश्वर की इच्छा ही सर्वोपरि है, इस दुखद घड़ी में हृदय से मेरी संवेदनाएं आपके और आपके परिवार के साथ है। श्रीहरि उन्हें अपने चरणों में स्थान दे, ओम शांति। https://t.co/CBsakFekwI
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) December 30, 2022
హీరాబెన్ మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఏపీ బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు , ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించదగిన సర్వోన్నతమైన స్థానం అమ్మదని సోము వీర్రాజు తెలిపారు. విశ్వం మెచ్చిన ధీరోదాత్తమైన నాయకుడికి జన్మనిచ్చిన తల్లిగా మీ ప్రస్థానం మాకు చిరస్మరణీయం అంటూ ట్వీట్ చేశారు.
ఈ సృష్టిలో ఏ జీవికైనా తొలి గురువు "అమ్మ"
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) December 30, 2022
ఎలాంటి పరిస్థితుల్లోనైనా దైవంగా భావించదగిన సర్వోన్నతమైన స్థానం "అమ్మ"
విశ్వం మెచ్చిన ధీరోదాత్తమైన నాయకుడికి జన్మనిచ్చిన తల్లిగా మీ ప్రస్థానం మాకు చిరస్మరణీయం. pic.twitter.com/o1D3bjS1ta
ప్రధాని మాతృమూర్తి హీరాబెన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నానని నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నట్లు వివరించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ప్రధాని @narendramodi గారి మాతృమూర్తి హీరాబెన్ గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/fIaS7keDLq
— Lokesh Nara (@naralokesh) December 30, 2022
ప్రధాని మోదీ తల్లి మృతిపై ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మోదీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Deepest condolences to @narendramodi ji on the loss of his mother. May God give the strength to family and friends.
— Revanth Reddy (@revanth_anumula) December 30, 2022