Top Headlines Today: చంద్రబాబు, బాలకృష్ణకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు - తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటు బ్యాంకు కొట్టేసిన కమలం!
AP Telangana Latest News 5 June 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
Andhra Pradesh News: గాజు గ్లాస్ గుర్తు శాశ్వతం - ప్రాంతీయ పార్టీ హోదా సాధించిన జనసేన
జనసేన పార్టీక గాజు గ్లాస్ గుర్తు శాశ్వతంగా కేటాయించనున్నారు. జనసేన పార్టీ ఇప్పుడు గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీ హోదా పొందింది. ఇప్పటి వరకూ రిజిస్టర్డ్ పార్టీనే. ప్రాంతీయ పార్టీ హోదా రావాలంటే కొన్ని ప్రమాణాలు అందుకోవాలి. గత ఎన్నికల్లో అన్ని చోట్లా పోటీ చేసినా అందుకోలేకపోయారు. కానీ ఈ సారి మాత్రం పొత్తులతో పోటీ చేసి అనుకున్నది సాధించారు. ఈ ఫలితాలతో 'గాజు గ్లాసు' గుర్తును ఆ పార్టీకి EC శాశ్వతంగా కేటాయించనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
మావయ్యకు, బాబాయికి శుభాకాంక్షలు - ఏపీ రిజల్ట్‌పై జూ.ఎన్టీఆర్ అదిరిపోయే స్పందన
ఏపీ ఎన్నికల ఫలితాలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘‘ప్రియమైన చంద్రబాబు మావయ్యకి ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించిందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఈ విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపున నడిపిస్తుందని ఆశిస్తున్నాను. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేశ్ కి, మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణ బాబాయికి, ఎంపీగా గెలిచిన శ్రీభరత్ కి, పురందేశ్వరి అత్తకి నా శుభాకాంక్షలు. అలాగే ఇంతటి ఘనవిజయం సాధించిన పవన్ కల్యాణ్ కు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ ఎంపీలు - విజేతలకు ముఖ్యమంత్రి అభినందనలు
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నివాసంలో ఆయన్ను కాంగ్రెస్ ఎంపీలు కలిశారు. ఎంపీలు కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎంను కలిసి సన్మానించారు. వారితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన వారిని రేవంత్ అభినందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్- ఓటు బ్యాంకు కొట్టేసిన కమలం!
లోక్‌సభ ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే... జాతీయ పార్టీలకే జైకొట్టారు తెలంగాణ ఓటర్లు (Telangana voters). ప్రాంతీయ పార్టీ అయిన భారత రాష్ట్ర పార్టీ (BRS)ను పక్కన పెట్టి... కాంగ్రెస్ (congress), బీజేపీకు ఓట్లు గుద్దేశారు. దీంతో... రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల్లో 8 సీట్లను సాధించింది అధికార కాంగ్రెస్ పార్టీ మొదటిస్థానంలో నిలిచింది. కమలం పార్టీకి కూడా కాంగ్రెస్‌తో సమానంగానే ఎనిమిది ఎంపీలు స్థానాలు ఇచ్చారు. ఐఎంఐ పార్టీ ఒక ఎంపీ స్థానం దక్కించుకుంది. కానీ.. బీఆర్‌ఎస్‌కు మాత్రం ఒక్క ఎంపీ సీటు కూడా దక్కలేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీలో కూటమి చారిత్రాత్మక విజయం - వైసీపీపై నెట్టింట ట్రోల్స్, మీమ్స్
ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించిన వేళ సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. కొందరు టీడీపీ, జనసేనను ఆకాశానికెత్తేస్తూ పోస్టులు పెడుతుంటే.. మరికొందరు వైసీపీని విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి.. ప్రచారం, సభలు, రోడ్ షోలు, పోలింగ్ సరళి, ఎన్నికల ఫలితాలు ఇలా అన్ని సందర్భాల్లోనూ సామాజిక మాధ్యమాల్లో టీడీపీ, వైసీపీ మద్దతుదారులు తమ నేతలకు అనుకూలంగా మీమ్స్ వైరల్ చేస్తూనే ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి