Top Headlines Today: ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట- పిచ్చోడి చేతిలో రాయిలాగా పరిపాలన అంటూ కేటీఆర్ ఫైర్!
AP Telangana Latest News 28 May 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
Andhra Pradesh News Today: పిచ్చోడి చేతిలో రాయిలాగా తెలంగాణలో పరిపాలన- రాజముద్ర మార్పుపై కేటీఆర్ ఫైర్
తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్ర గేయంలో మార్పులకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టగా, తాజాగా రాష్ట్ర రాజముద్రపై సైతం మార్పులు చేపడుతుండటంతో మాజీ మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఉందంటూ కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. ప్రముఖ కళాకారుడు అలె లక్ష్మణ్ రూపొందించిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకి, సాంస్కృతిక వారసత్వానికి, గంగా- జమునా తహజీబుకి ప్రతీకలుగా కాకతీయ తోరణం, చార్మినార్ ఉండటం.. రాచరిక పోకడనట అంటూ అసహనం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
నార్త్ ప్రజల్ని మభ్యపెట్టడానికి సౌత్‌లో ఫలితాలపై అమిత్ షా వ్యాఖ్యలు - సజ్జల విమర్శలు
నార్త్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు సౌత్ లో ఎక్కువ సీట్లు వస్తాయని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. అమిత్ షా వ్యాఖ్యలు కూడా ఇదే ఉద్దేశంతో మాట్లాడి ఉండవచ్చన్నారు. రెండు రోజుల కిందట అమిత్ షా ఏపీలో పదిహేడు లోక్ సభ సీట్ల గెలవబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ సంఖ్యపైనే అమిత్ షా స్పందించారు. ఈవీఎంల్లో ఫలితాలు నిక్షిప్తమయ్యాక ఊహగానాలతో లాభమేంటని సజ్జల ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏపీ హైకోర్టులో పిన్నెల్లికి ఊరట.- 3 కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు
వైసీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. తనపై నమోదైన హత్యాయత్నం కేసుల్లో ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో లభించినట్టుగానే మిగతా మూడు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ దొరికింది. ఆ కేసులో అనుసరించిన షరుతులే ఈ మూడు కేసుల్లో కూడా వర్తిస్తాయని కోర్టు తేల్చి చెప్పింది.
పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్‌లో తనపై దాడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోత్సహించారని టీడీపీ పోలింగ్ ఏజెంట్ కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదు అయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యామ్ రామ్ నివాళి- సీఎం నినాదాలతో దద్దరిల్లిన ప్రాంగణం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి, నట విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారవు జయంతి సందర్భంగా తెలుగుదేశం నేతలు, సినీ అభిమానులు, నివళి అర్పిస్తున్నారు. రాష్ట్రానికి, తెలుగు చిత్ర సీమకు ఆయన చేసిన సేవలు గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమ సారథిగా ప్రజల గండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. కళామతల్లి ముద్దు బిడ్డగా ఆయన చేసిన పాత్రలు నేటికీ స్ఫూర్తిదాయమంటూ అభిప్రాయపడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కౌంటింగ్ రసాభాస అవబోతోంది - పేర్ని నాని ముందస్తు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం ఏర్పడిన అల్లర్ల కారణంగా కౌంటింగ్ విషయంలో అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే కౌంటింగ్ సెంటర్లలో గందరగోళం ఏర్పడుతుందని మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తుగా హెచ్చరించారు. పోస్టల్ బ్యాలెట్స్ విషయంలో ఆర్వో సంతకం విషయంలో ఈసీ విడుదల చేసిన మార్గదర్శకాలపై ఫిర్యాదు చేసిన తరవాత పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి