Top Headlines Today: జనసేనకు బిగ్ షాక్, పార్టీని వీడిన పోతిన మహేష్- ఈ నెల 13 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర
AP Telangana Latest News 08 April 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Andhra Pradesh News: ఎన్నికల వేళ జనసేనకు బిగ్ షాక్ - పార్టీకి కీలక నేత రాజీనామా
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన (Janasena) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీలో కీలక నేత పోతిన వెంకట మహేష్ (Pothina Venkata Mahesh) సోమవారం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జనసేనాని పవన్ కల్యాణ్ కు తన రాజీనామా లేఖను పంపించారు. కాగా, విజయవాడ పశ్చిమ టిెకెట్ ను మహేష్ ఆశించారు. అయితే, టీడీపీ - బీజేపీ - జనసేన పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీ నేత సుజనా చౌదరికి కేటాయించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ అరెస్టు
ప్రజాభవన్ వద్ద జరిగిన కారు ప్రమాదం కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ వద్ద జరిగిన ప్రమాదం తర్వాత షకీల్ కుమారుడు రహేల్ దుబాయ్ పారిపోయాడు. దీంతో ఆయనపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. ఇన్ని రోజుల తర్వాత దుబాయ్ నుంచి వచ్చిన రహేల్‌ను పోలీసులు శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. గతేడాది డిసెంబర్ 23 అర్థరాత్రిలో ప్రజాభవన్ వద్ద ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
'పొద్దు తిరుగుడు పంటను ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి' - సీఎం రేవంత్ కు హరీష్ రావు లేఖ
రాష్ట్రంలో పొద్దు తిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి.. పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి (Cm Revanth Reddy) సోమవారం లేఖ రాశారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ కనీసం మద్దతు ధర రూ.6,750 చెల్లించి కొనుగోలు చేయాలన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన నిధుల మేరకే కొనుగోలు చేసి.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాల్సిన వాటాపై మౌనంగా ఉంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఇది రైతులను అవమానించడమే అవుతందని చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌కు నిప్పు- ఉలిక్కిపడ్డ పల్నాడు- 144 సెక్షన్ విధింపు
ఎన్నికల వేల పల్నాడు మరోసారి ఉలిక్కిపడింది. తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో అన్న సందేహంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులోని క్రోసురులో తెలుగు దేశం పార్టీ ఆఫీస్‌కి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో కార్యాలయం అగ్నికి ఆహుతి అయిపోయింది. మంటలలో ఫర్నీచర్ పూర్తిగా ధ్వంసమైంది. ఎన్నికల వేళ తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఈ నెల 13 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర - పార్లమెంట్ ఎన్నికల వేళ జనంలోకి గులాబీ బాస్
పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) బస్సు యాత్రకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 13 నుంచి ఆయన ప్రజల్లోకి రానున్నారు. ఆ రోజు చేవెళ్ల (Chevella) బహిరంగ సభలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. బహిరంగ సభల కంటే బస్సు యాత్రల వైపే గులాబీ బాస్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ పాల్గొననున్నట్లు సమాచారం. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచే బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి