Top Headlines Today: పవన్ కల్యాణ్ ఇంటి అద్దె అంత తక్కువా?- ‘న్యాయ్’తో కాంగ్రెస్ కొత్త నాటకంటూ కేటీఆర్ ఫైర్
AP Telangana Latest News 07 April 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Andhra Pradesh Telugu News - ఆ ఇంటి రెంట్ రూ.1 - జనసేనాని పవన్ కల్యాణ్ పై అభిమానంతో!
జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో పిఠాపుర నుంచి పోటీ చేయనున్న విషయం తెలిసిందే. తాను నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని.. త్వరలోనే పిఠాపురంలో (Pithapuram) ఇల్లు తీసుకుంటానని జనసేనాని పవన్ కల్యాణ్ ఇటీవల బహిరంగ సభలో ప్రకటించారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలులో ఆయన తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జగన్ కుంభకర్ణుడు, ఇప్పుడే నిద్రలేచాడు - వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుంభకర్ణుడు అని.. ఇన్నాళ్లు నిద్ర పోయి ఎన్నికలకు ఆరు నెలల ముందు నిద్ర లేచాడని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. వివేకా హత్య జరిగి 5 ఏళ్లు అయ్యిందని.. హత్య చేసిన వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారని విమర్శించారు. అధికారం అడ్డుపెట్టుకొని దర్జాగా తిరుగుతున్నారని.. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవని అన్నారు. కడప జిల్లా కమలాపురం నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ఏపీ న్యాయ యాత్ర కొనసాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
డిప్యూటీ సీఎం భట్టి కాన్వాయ్‌లోని కారును ఆపేసిన కమిషనర్ - పోలీసుల అత్యుత్సాహం!
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీతోపాటు సీఎం రేవంత్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఇదే సభకు హాజరైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. భట్టి సమావేశానికి హాజరైన క్రమంలో ఆయన కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని పోలీసులు బయటే నిలిపేశారు. లోపలకు అనుమతించకుండా తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
‘న్యాయ్’తో నయా నాటకం, నమ్మేదెవరు? - కేటీఆర్ పోస్ట్
కాంగ్రెస్ పార్టీ గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీల పేరిట గారడి చేసిందని.. ఇప్పుడు మరో నాటకానికి తెరతీసిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు న్యాయ్ పేరిట నయా నాటకానికి తెరతీశారని విమర్శలు చేశారు. తెలంగాణకు తీరని అన్యాయం చేసి.. ఇప్పుడొచ్చి న్యాయ్ అంటే నమ్మేదెవరని రాహుల్ గాంధీని నిలదీశారు. కాంగ్రెస్ ను నమ్మి ఓటేసిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను నాలుగు నెలలుగా కాంగ్రెస్ నయవంచన చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ఓ సుదీర్ఘ పోస్టు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎన్నికల ఎజెండాగా మారుతున్న వైఎస్ వివేకా హత్య కేసు - వైఎస్ఆర్‌సీపీకి చిక్కులు తప్పవా ?
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ విషయం వైఎస్ కుటుంబాన్ని చూస్తే మరోసారి అర్థం అవుతుంది. అన్న వదిలిన బాణాన్ని అంటూ ఉమ్మడి రాష్ట్రంలో పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు అన్నను ఎదిరిస్తూ నిలబడ్డారు. ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల పీసీసీ అధ్యక్షురాలిగా పూర్తిగా స్థాయిలో తన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. కడప లోక్‌సభ బరిలో నిలబడ్డారు. ఆమెకు తోడుగా మరో సోదరి సునీత ఉన్నారు. ఇక్కడి వరకూ వచ్చాక మొహమాటాలేమిటని ఆమె నేరుగానే జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి