Top Headlines Today: ఫ్రీ సింబల్ గాజు గ్లాస్‌తో కూటమికి కష్టాలు- ఏ హీరోయిన్‌తో సంబంధం లేదన్న కేటీఆర్
AP Telangana Latest News 03 April 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
AP Telangana News: ఫ్రీ సింబల్ కేటగిరిలో గాజు గ్లాస్ - కూటమికి సమస్యలు తప్పవా ?
ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన బీజేపీలు కలిసి కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి దక్కిన నియోజకవర్గాల్లో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలోనూ జోరు పెంచారు. గ్లాసు గుర్తుపై ఓటు వేసి కూటమి మద్దతుతో బరిలో నిలిచిన జనసేన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం తాజా ప్రకటనతో జనసేన పార్టీకి షాక్ తగిలినట్లయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
చిత్తశుద్ధి ఉంటే సీబీఐకి అప్పగించండి- రేవంత్‌కు బీజేపీ సవాల్
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పెను దుమారాన్నే రేపుతోంది. దీనిపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య ఇప్పటికే మాటల తూటాలు పేలుతున్నాయి. ఇందులో బీజేపీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంటే ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తే మంచిదని సూచిస్తోంది. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడిన ఎంపీ లక్ష్మణ్..." ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లోనే కాకుండా అంతకు ముందు జరిగిన ఉపఎన్నికల్లో కూడా ట్యాపింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి షాక్ - కిల్లి కృపారాణి రాజీనామా ! కాంగ్రెస్ లో చేరే చాన్స్
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శ్రీకాకుళం జిల్లా వైసిపి కి గట్టి షాక్ తగిలింది..ఆపార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి పార్టీకి రాజీనామా చేశారు.పార్టీ కోసం కష్ట పడి పనిచేసిన తగిన గుర్తింపు లేని కారణంగా ఆమె రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. బుదవారం శ్రీకాకుళం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు.పార్టీలో తనను అడుగడుగున అవమానాలకు గురిచేశారనీ,టెక్కలి నియోజకవర్గంలో తనని అణచి వేసేందుకు కుట్రలు పన్నారని కృపారాణి ఆరోపించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఏ హీరోయిన్‌తో సంబంధం లేదు- ఎవర్నీ బెదిరించలేదు: కేటీఆర్
తెలంగాణలో తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవర్నీ బెదిరించలేదని.. ఏ హీరోయిన్‌తో తనకు సంబందం లేదన్నారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రెస్‌మీట్ పెట్టిన ఆయన... ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. తెలంగాణలో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. వాటిని పట్టించుకోని సీఎం... ఫోన్ ట్యాపింగ్‌పై దృష్టి పెట్టారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఫోకస్ చేయాల్సింది ఫోన్ ట్యాపింగ్‌పైకాదని... వాటర్ ట్యాప్‌పై అన్నారు. ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదని... ప్రాజెక్టు గేట్లు అంటూ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఎమ్మిగనూరు అభ్యర్థికి దూరంగా ఉంటున్న బీజేపీ జనసేన!
రాష్ట్రంలో వైయస్సార్సీపీ(YSRCP) పాలనకు వ్యతిరేకంగా రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తున్నాయి. రాష్ట్రంలో జగన్‌ని గద్దె దింపాలన ఏకైక లక్ష్యంతో మూడు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆ నియోజకవర్గంలో మాత్రం మూడు పార్టీల అభ్యర్థులు ఒకరికి ఒకరు సహకరించకపోవడం ఆసక్తిగా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి