Top Headlines Today: ఫ్యామిలీ పొలిటికల్ వారసత్వం నాదేనన్న జగన్- కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
AP Telangana Latest News 05 May 2024: నేటి ఉదయం నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. ఒక్క క్లిక్ చేసి 5 ప్రధాన వార్తలు చదవండి.
అందుకే మేం టీడీపీ, జనసేనతో కలిశాం, స్పష్టత ఇచ్చిన అమిత్ షా - పోలవరంపై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో గూండా గిరి, అవినీతి, అరాచకాలను అరికట్టేందుకు తాము కూటమిలో కలిశామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియాను నివారించడానికి పొత్తు పెట్టుకున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి అమరావతిని రాజధాని చేసేందుకే రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో కలిశామని అమిత్ షా తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్రతను పున:స్థాపితం చేయడం కోసం, తెలుగు భాషను కాపాడేందుకే బీజేపీ కూటమిలో చేరిందని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
షర్మిల రాజకీయాల్లోకి వచ్చి ఉండకూడదు, ఫ్యామిలీ పొలిటికల్ వారసత్వం నాదే- జగన్
వైఎస్ రాజకీయ వారసుడిగా తనకు మాత్రమే గుర్తింపు ఉందని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఒక తరంలో ఒకే కుటుంబం నుంచి ఒకరికి మించి రాజకీయాల్లోకి వస్తే.. అది అనివార్యంగా కుటుంబంలో చీలికకు దారితీస్తుందని తన సోదరి షర్మిలను ఉద్దేశించి అన్నారు. ఆయన ఓ జాతీయ చానెల్ ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాల్లో జగన్ ఓ వైపు- మిగతా వాళ్లంతా మరోవైపు అన్నట్లుగా ఎన్నికలు జరుగుతున్న విషయం చూస్తూనే ఉన్నాం. తాను సింగిల్ అంటూ ఆయన కూడా చెప్పుకుంటున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
జూ.ఎన్టీఆర్ సీఎం అంటూ నినాదాలు - అమిత్ షా, చంద్రబాబు సభలో ప్లకార్డులు, ఫ్లెక్సీలు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభలో జై ఎన్టీఆర్ అన్న నినాదాలు మారుమోగాయి. ఎన్నికల వేళ అమిత్ షా, చంద్రబాబు పాల్గొన్న ప్రచార కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల ప్రదర్శన, ఎన్టీఆర్ సీఎం అంటూ పలువురు చేసిన నినాదాలు చర్చనీయాంశంగా మారాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్న బహిరంగ సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ప్రదర్శన చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కిన్నెర మొగిలయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం - కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న కేటీఆర్
కిన్నెర వాయిద్యకారుడు, 'పద్మశ్రీ' అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు (Darshanam Mogulaiyya) బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఆర్థిక సాయాన్ని అందించారు. మొగులయ్య ప్రస్తుతం కూలీ పని చేసుకుని జీవనం సాగిస్తున్నారంటూ ఓ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయనకు గత ప్రభుత్వం ఇచ్చిన కళాకారుల పెన్షన్ ఆపివేయడంతో ఆయన కూలీ పని చేస్తున్నారంటూ వైరల్ అయిన వార్త పట్ల స్పందించిన కేటీఆర్ ఆయన్ను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
ఐదు ఏపీ గ్రామాలు తెలంగాణలో విలీనానికి కాంగ్రెస్ హామీ
2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలుపుతూ పార్లమెంట్ చట్టం చేసింది. ఈ ఏడు మండలాల ఇష్యూ తెలంగాణలో అప్పుడప్పుడూ రాజకీయం అవుతూ ఉంటుంది. బీఆర్ఎస్ నేతలు బీజేపీపై కోపం వచ్చినప్పుడల్లా తెలంగాణకు చెందిన ఏడు మండలాలు ఏపీకి ఇచ్చారని విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ఏపీలో చంద్రబాబునాయుడు ఆ ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని పట్టుబట్టి కలిపించుకున్నానని చెప్పుకుంటూ ఉంటారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి