అన్వేషించండి

Amit Shah: అందుకే మేం టీడీపీ, జనసేనతో కలిశాం, స్పష్టత ఇచ్చిన అమిత్ షా - పోలవరంపై కీలక ప్రకటన

Dharmavaram News: బీజేపీ అగ్రనేత అమిత్ షా ధర్మవరం పట్టణంలో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డిపై నేరుగా విమర్శలు చేశారు.

Amit Shah Comments in Dharmavaram: ఆంధ్రప్రదేశ్‌లో గూండా గిరి, అవినీతి, అరాచకాలను అరికట్టేందుకు తాము కూటమిలో కలిశామని కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా స్పష్టత ఇచ్చారు. రాష్ట్రంలో భూ కబ్జాలు, ల్యాండ్ మాఫియాను నివారించడానికి పొత్తు పెట్టుకున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తిరిగి అమరావతిని రాజధాని చేసేందుకే రాష్ట్రంలో టీడీపీ, జనసేనతో కలిశామని అమిత్ షా తెలిపారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి పవిత్రతను పున:స్థాపితం చేయడం కోసం, తెలుగు భాషను కాపాడేందుకే బీజేపీ కూటమిలో చేరిందని ఆయన స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళం సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు కూడా పాల్గొన్నారు. 

రెండేళ్లలో పోలవరం పూర్తి

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని అమిత్ షా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఏపీలో జగన్ రెడ్డి అవినీతితో వాటిని దుర్వినియోగం చేశారని తెలిపారు. తద్వారా పోలవరం బాగా ఆలస్యం అయిందని అన్నారు. ‘‘వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయండి.. కేంద్రంలో నరేంద్ర మోదీని అధికారంలో కొనసాగించండి. ఇక రాబోయే రెండు సంవత్సరాల్లోనే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం’’ అని అమిత్ షా హామీ ఇచ్చారు. ప్రజలు అందరూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయాలని.. ఇక ఏపీలో అభివృద్ధిని చంద్రబాబు, ప్రధాని మోదీ చూసుకుంటారని భరోసా కల్పించారు.

‘‘అరే రాహుల్ గాంధీ, జగన్ గారూ వారికి కూడా ప్రాణ ప్రతిష్ఠకు మేం ఆహ్వానాలు పంపాం కానీ వారు రాలేదు. ఇలాంటి వారికి మీరు ఓటు వేస్తారా? చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా ఉన్నప్పుడు పరిపాలన బాగా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కూడా చంద్రబాబు ఆర్థిక విధానాలు బాగా పటిష్ఠంగా అమలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చాక నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. పెట్టుబడులు జీరో అయ్యాయి. డెవలప్ మెంట్ అనేది లేదు. రాష్ట్ర అప్పులు ఏకంగా రూ.13 లక్షల కోట్లకు చేరాయి. ఆరోగ్య శ్రీ ఆర్భాటంగా ప్రారంభించినా ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదు. ఏ ఆస్పత్రికి వెళ్లినా వారు వైద్యం చేయడమే లేదు.’’

ఏపీలో తెలుగు భాషను కాపాడుతాం. ఇక్కడ భాష ఉనికి కోల్పోయే విధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్లను కూడా ఇంగ్లీష్ మీడియం చేసేశారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి, మళ్లీ తెలుగు మీడియం ప్రవేశపెడతాం. జగన్ మోహన్ రెడ్డికి ఒకటే చెబుతున్నా.. బీజేపీ ఉన్నంత వరకూ తెలుగు భాషను సమాప్తి ఎవరూ చేయలేరు’’ అని అమిత్ షా తెలిపారు.

I.N.D.I.A. కూటమిపైనా అమిత్ షా విమర్శలు

I.N.D.I.A. కూటమి నేతలపైన కూడా అమిత్ షా విమర్శలు చేశారు. వారు పదే పదే తమకే ఓటు వేయాలని కోరుతున్నారని అమిత్ షా గుర్తు చేశారు. ఒకవేళ I.N.D.I.A. కూటమి గెలిస్తే ఎవరు అధికారంలోకి వస్తారు అని అమిత్ షా ప్రశ్నించారు. ‘‘శరద్ పవార్ ప్రధాన మంత్రి అవుతారా? లేక మమతా బెనర్జీ ప్రధాని అవుతారా? లేదా ఉద్ధవ్ ఠాక్రే పదవి చేపడతారా? ఇంకా నేను మీకొకరి పేరు చెబుతా నవ్వకూడదు.. రాహుల్ గాంధీ బాబా ప్రధాన మంత్రి అవుతారా? I.N.D.I.A. కూటమి అధికారంలోకి వస్తే ఎవరు ప్రధాని అవుతారో వాళ్లకే స్పష్టత లేదు’’ అని అమిత్ షా ఎద్దేవా చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget