Top Headlines Today: సీఎం జగన్‌పై పూతలపట్టు ఎమ్మెల్యే ఆగ్రహం! కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు రెడీ
AP Telangana Latest News 02 January 2024: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం..
Telugu News Today: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం - ముహూర్తం ఖరారు.?
వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు తెలుస్తోంది. బుధవారం రాత్రి పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ కానున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక సమక్షంలో షర్మిల హస్తం పార్టీలో ఈ నెల 4న (గురువారం) చేరనున్నట్లు సమాచారం. ఆమెతో పాటు 40 మంది నేతలు కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం అందుబాటులోని పార్టీ ముఖ్య నేతలతో షర్మిల సమావేశం అయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
తెలుగుదేశం పార్టీలో నయా జోష్- ఎన్నికల వరకు ప్రజల్లోనే చంద్రబాబు, లోకేష్, భువనేశ్వరి!
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ఫుల్ యాక్టివ్ మోడ్‌లో కనిపిస్తోంది. గత ఆరు నెలలుగా కాస్త స్తబ్ధుగా ఉన్న కేడర్‌ను ఎన్నికల టైంకి ఉత్సాహంతో పరుగులు పెట్టించే ప్లాన్‌తో టీడీపీ(TDP) ఉంది. ఆ ఆలోచనతో కీలకమైన నేతలంతా జనాల్లో ఉండేలా చూస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు(Chandra Babu) టూర్ ఖరారు అయింది. లోకేష్(Lokesh) కూడా నియోజకవర్గాలపై ఫోకస్ పెడుతున్నారు. ఇప్పుడు సీన్‌లోకి భువనేశ్వరి(Bhuvaneswari Nara) కూడా వచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
దళితుల్నే బలి చేస్తున్నారు - సీఎం జగన్‌పై పూతలపట్టు ఎమ్మెల్యే ఆగ్రహం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల కసరత్తు రాను రాను వివాదాస్పదమవుతోంది. నేరుగా సీఎం జగన్‌పైనే ఎమ్మెల్యేలు విరుచుకుపడుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు తన ఆగ్రహాన్ని ఆపుకోలేదు. తనపై వ్యతిరేకత ఉందని సీటు ఇవ్వనని చెబితే ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు. తాను జగన్ చెప్పిన పనులన్నీ చేశానని ఆయన అన్నారు. జగన్ చెప్పిన పనులన్నీ చేసినప్పుడు అసంతృప్తి ఉంటే అది తనవల్ల ఎలా అవుతుందని ఆయన నిలదీశారు. తాను ఏం తప్పు చేశానో జగన్ పిలిచి చెప్పాలని ఎంఎస్ బాబు డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణకు రెడీ - కాంగ్రెస్ ఆ పని చేయాలన్న కిషన్ రెడ్డి
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ చేసిన అతిపెద్ద స్కామ్ అని కేంద్రమంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులు, పథకాల అమలులో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని అన్నారు.. మరీ కాళేశ్వరంపై కాంగ్రెస్ సర్కార్ ఏం చేయబోతోందని ప్రశ్నించారు. నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
టీడీపీ ట్రబుల్ షూటర్ ఇలాఖాలో ట్రబుల్.. యనమల నియోజకవర్గంలో ఇరు వర్గాల బాహాబాహీ
టీడీపీలో ట్రబుల్ షూటర్, చాణక్యునిగా ముద్ర ఉన్న ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఇలాఖాలో వివాదాలు నివురుగప్పిన నిప్పులా మారాయని తేలిపోయింది. తుని నియోజకవర్గ ఇంఛార్జీ బాధ్యతలు రామకృష్ణుడు కుమార్తె దివ్యకు అప్పగించింది పార్టీ అధిష్టానం. ఇదిలా ఉంటే నూతన సంవత్సరం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రామకృష్ణుడు, దివ్య వేదికపైనే ఉండగానే అక్కడకు విచ్చేసిన రామకృష్ణుడు చిన్నాన్న కుమారుడు యనమల కృష్ణుడు, రామకృష్ణుడు అన్న యనమల నాగేశ్వరరావు కుమారుడ రాజేష్ వర్గీయులు బాహాబాహీలకు దిగడం చర్చనీయాంశం అయ్యింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి