భోగి మంటల్లో జీవో నెంబర్1 ప్రతులు- ఏపీలో టీడీపీ వినూత్న నిరసన
రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనెంబర్1ను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ సంక్రాంతి వేళ వినూత్న ఆందోళన చేపపట్టింది.
సంక్రాంతి సంబరాలను వేదికగా చేసుకొని జీవో నెంబర్ 1పై వ్యతిరేకత తెలుగుదేశం వ్యక్తం చేసింది. భోగి సందర్బంగా ఏర్పాటు చేసిన మంటల్లో జీవో నెంబర్ 1 ప్రతులను తగులబెట్టింది. ఇకపైన అయినా ప్రభుత్వానికి మంచి బుద్ది రావాలని నేతలు అభిప్రాయపడ్డారు.
రోడ్లపై ర్యాలీలు, సభలు నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోనెంబర్1ను వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం పార్టీ సంక్రాంతి వేళ వినూత్న ఆందోళన చేపపట్టింది. జీవో ప్రతులను భోగి మంటల్లో వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించింది. చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు... జీవో నెంబర్ 1 ప్రతులను మంటల్లో వేశారు. ప్రతిపక్షాలను అడ్డుకొని ప్రజల గొంతు నొక్కేందకే ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి జీవో తీసుకొచ్చిందని మండిపడ్డారు. ఇలాంటి వాటికి న్యాయస్థానాల్లో పరాభవం తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యతిరేక జీవోను ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని... అందరూ భోగిమంటల్లో జీవో ప్రతులను కాల్చి నిరసన తెలియజేయాలన్నారు.
సంక్రాంతి సందర్భంగా నారావారిపల్లెకు వెళ్లిన తెలుగుదేశం అధినేత @ncbn గారు పార్టీ నేతలు, ప్రజలతో కలిసి భోగి మంటల కార్యక్రమంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన జీవో నెంబర్.1 ప్రతులను పార్టీ నేతలతో కలిసి #Bhogi మంటల్లో వేసి తగలబెట్టారు#NCBN#CBNinNaravaripalli pic.twitter.com/iNUJByLQus
— Telugu Desam Party (@JaiTDP) January 14, 2023
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ లీడర్లు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 1 ప్రతులను మంటల్లో వేసి కాల్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజావ్యతిరేక జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.