అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Police Dance: గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్‌

ప్రస్తుతం పోలీసుల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

మొత్తం 40 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. 20వేలకిపైగా సీసీ కెమెరాలతో హైదరాబాద్ నగరం మొత్తం నిఘా నీడలో ఉంది. ఇక బడా గణేశుడు ఖైరతాబాద్‌ వినాయకుడి నిమజ్జనం హుస్సేన్‌ సాగర్‌లో ముగిసింది. భారీ గణేశుడిని వీక్షించేందుకు లక్షలాదిగా జనం తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శోభయాత్రను, నిమజ్జనాన్ని అధికారులు పూర్తి చేశారు.

ఇదిలా ఉంటే గణేశుడి శోభా యాత్రలో జనాలు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. భక్తులు డీజీ సౌండ్స్‌తో గణనాథులను గంగమ్మ ఒడికి పంపించారు. డ్యాన్స్‌లు చేస్తూ ఉషారుగా శోభయాత్ర కొనసాగింది. ఈ క్రమంలోనే డ్యూటీలో బిజీగా ఉన్న పోలీసులు సైతం వారితో కలిసి స్టెప్పులు వేశారు. గణేశుడి నిమజ్జన పర్యవేక్షణలో ఉన్న పోలీసులు డీజే సౌండ్‌కు కాలు కదిపారు. ఓ గ్రూప్‌గా ఏర్పడ్డ పోలీసులు పని ఒత్తిడిని కాసేపు మరిచి చిందేశారు. ఇక వీరిలో ఓ పోలీస్ బాస్‌ వేసిన స్టెప్పులు హైలెట్‌గా నిలిచాయి. మైకేల్‌ జాక్సన్‌లా మారి అదిరిపోయే స్టెప్పులతో మెస్మరైజ్ చేశారు. ప్రస్తుతం పోలీసుల డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. డ్యాన్స్‌ చూసిన నెటిజన్లు పోలీసుల స్టెప్పులకు ఫిదా అవుతున్నారు.

గణేష్‌ నిమజ్జనాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్‌ 28వ తేదీన హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. జంట నగరాలతో పాటు మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో కూడా బంద్‌ ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో జారి చేసింది. గురువారం రోజు పైన తెలిపిన చోట్ల పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయకు సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జంట నగరాల్లో నిమజ్జనం సందర్భంగా 21 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. వీరితో పాటు అదనంగా ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, రైల్వే పోలీస్‌ ఫోర్స్‌తో నిఘా పెంచారు.

నిమజ్జనం రోజున హుస్సేన్ సాగర్ చుట్టూ రోడ్డుపై ఇసుక వేస్తే రాలనంత భక్తులు గుమిగూడి ఉత్సవాలు చేసుకున్నారు. వీరి రద్దీని కంట్రోల్ చేయడం కోసం పోలీసులు కూడా నిమజ్జన ప్రాంతాల్లో భారీగా మోహరించారు. భక్తుల ఆటపాటలు, డాన్సులతో బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేస్తుండగా పోలీసులు తమ బాధ్యతలు నిర్వహించారు.

ఈ ఏడాది మాత్రం పోలీసులు అడుగు ముందుకు వేశారు. హుషారుగా కాలు కదుపుతూ భక్తులతో పాటు ఊరేగింపులో వారు కూడా భాగస్వామ్యం పంచుకున్నారు.  గణపయ్య భక్తులతో పాటు పోలీసులు కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మిలాద్ ఉన్ నబీ, గణపతి నిమజ్జనం ఒకేరోజు రావడంతో మతపరమైన ఉద్రిక్తతలు చోటు చేసుకునే ముప్పును పోలీసులు అంచనా వేశారు.

హైదరాబాదులోని పాతబస్తీ సహా మిగిలిన ఏరియాలోను ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉంటారు. గణపతి నిమజ్జనం నగరంలో పెద్ద ఎత్తున జరుగుతుందని తెలిసిందే. ఈ రెండు ఒకేరోజు వచ్చినప్పటికీ నగరంలో మతపరమైన ఉద్రిక్తతలు ఎక్కడ కూడా చోటు చేసుకోలేవు. అంతేకాదు మతసామరస్యత వెల్లివెరిసింది. 

హైదరాబాదులో ఇలాంటి మత ఘర్షణలు జరగవని రుజువైంది. ఒక మతాన్ని మరో మతం వారు గౌరవించుకోవడం స్పష్టంగా కనిపించింది. ముస్లింలు మిలాన్ నబి ఊరేగింపును అక్టోబర్ 1 వ తేదీకి వాయిదా వేసుకున్నట్లు సియాసత్ పత్రిక రిపోర్ట్ చేసింది. గణపతి నిమజ్జనం అదే రోజు రావడం వల్లే వాయిదా వేసినట్లు తెలిపింది. 28న వినాయకుని నిమజ్జనం కావడంతో శాంతియుతంగా వాళ్లు విరమించుకున్నారు. ఇకపోతే కొన్ని ఏరియాలో వినాయకుడు 15 రోజులకు నిమజ్జనం చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Embed widget