Elections Update: పార్లమెంట్ ఎన్నికలపై సీఈసీ రివ్యూ - అధికారులకు కీలక ఆదేశాలు
General Elections 2024: మరి కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సూచించారు.
Vikas Raj Review on General Elections: రానున్న పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్ జాబితా తయారీతో పాటు ఎన్నికల పకడ్బందీ నిర్వహణకు సర్వం సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ అన్నారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, దాసరి వేణు, ఆర్డీవో కదం సురేష్ లు పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. మరి కొద్ది రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల ఓటర్ల జాబితా నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. జాబితాలో తప్పులు లేకుండా చూడాలన్నారు.
18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు అయ్యే విధంగా చూడాలన్నారు. దీని కోసం అవగాహన కార్యక్రమాలు చేపట్టాలనీ, మార్పులు చేర్పులు చిరునామా మారిన వారు చేసుకున్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల్లోనీ తహసిల్దార్లు, సంబంధిత శాఖ అధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు.