అన్వేషించండి
Telangana Assembly session: తెలంగాణ శాసనసభ ఈ నెల 20కి వాయిదా, సభలో హాట్ హాట్ గా సాగిన చర్చ
Telangana Assembly News: తెలంగాణ శాసనసభ సమావేశాలు డిసెంబర్ 20కి వాయిదా పడ్డాయి.

తెలంగాణ శాసనసభ ఈ నెల 20కి వాయిదా
Telangana Assembly session 2023: తెలంగాణ శాసనసభ సమావేశాలు డిసెంబర్ 20కి వాయిదా వేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఆమోదం తరువాత తెలంగాణ శాసనసభ బుధవారానికి వాయిదా పడింది. అంతకుముందు సభలో వాడివేడిగా చర్చ జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స్, పేపర్ లీకేజీ, ప్రగతి భవన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మార్పులు లాంటి అంశాలపై ప్రసంగించగా.. మాజీ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో బదులిచ్చే ప్రయత్నం చేశారు.
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















