Bonda Uma: 9 నెలల్లో పూర్తవ్వాల్సిన పనులు, 4 ఏళ్లవుతున్నా కాలేదు: బోండా ఉమా
Bonda Uma: విజయవాడ మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
Bonda Uma: వైసీపీ ప్రభుత్వంపై తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ శాసన సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని చేతకాని సర్కారు అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన బోండా ఉమా.. జగన్ మోహన్ రెడ్డి అసమర్ధ ముఖ్యమంత్రి అంటూ విమర్శలు గుప్పించారు. మధురా నగర్ డబుల్ రైల్వే లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి పనుల వద్ద బోండా ఉమా సెల్ఫీ దిగారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2018లో రైల్వే శాఖ నుండి అనుమతులు తీసుకుని 18 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు చేపట్టామని తెలిపారు.
SELFIE CHALLENGE
— Bonda Uma (@IamBondaUma) April 21, 2023
ఇది @ncbn గారి హయాంలో నేను శాసనసభ్యుడిగా ఉండి రైల్వే అధికారుల దగ్గర అన్ని అనుమతులు తీసుకొని రూ.18 కోట్లు శాంక్షన్ చేయించి మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు 70% పూర్తి చేస్తే.. (1/2) pic.twitter.com/nEF7Pm9lob
వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చే నాటికి రైల్వే అండర్ బ్రిడ్జి పనులు 70 శాతం పూర్తయ్యాయని, 2019 జనవరిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పనులు అలాగే కొనసాగిస్తే కేవలం 9 నెలల్లో పూర్తి అయి ఉండేవని బోండా ఉమా అన్నారు. కానీ డబుల్ లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి పనులు నాలుగు సంవత్సరాలు పూర్తి అవుతున్నా ఇంకా పూర్తి కాకపోవడంపై ఆయన విమర్శలు చేశారు. చేతకాని ప్రభుత్వం వల్లే ఈ దుస్థితి దాపురించిందని, జగన్ మోహన్ రెడ్డి అసమర్థ సీఎం కాదా అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువ నాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బోండా ఉమా ఈ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. రైల్వే అండర్ బ్రిడ్జీ పనులు ఎప్పటి లోపు పూర్తి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యేలు పావలా ఎమ్మెల్యే అంటూ దుయ్యబట్టారు.
ఈ అసమర్థ వైసిపి ప్రభుత్వం వచ్చాక 9 నెలల్లో పూర్తవల్సిన పనులను 4 సంవత్సరాలు అవుతున్న పూర్తి చేయకపోవడం ఈ పావలా ఎమ్మెల్యే, వైసీపీ ప్రభుత్వం చేతకానితనం కాదా? (2/2)
— Bonda Uma (@IamBondaUma) April 21, 2023
ఉత్సాహంగా సాగుతున్న నారా లోకేష్ పాదయాత్ర
నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. టీడీపీ కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని రేకెత్తిస్తోంది. జనవరి 27వ తేదీన ప్రారంభమైన లోకేష్ యువగళం పాదయాత్ర నేటికి 77వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వెయ్యి కిలోమీటర్లకు చేరుకోనుంది. ఆధోని టౌన్ సిరిగుప్ప క్రాస్ వద్ద లోకేష్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మార్క్ ను పూర్తి చేసుకుంటారు. ఈ సందర్భంగా నారా లోకేష్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఆదోని బైపాస్ వద్ద స్థానికులతో లోకేష్ సమావేశం అవుతారు. వారి సమస్యలపై చర్చిస్తారు.