లిక్కర్ షాప్‌లో చోరీకెళ్లారు- తాగుతూ అక్కడే ఉండిపోయారు
Tamil Nadu: తమిళనాడులో ఇద్దరు వ్యక్తులు వైన్ షాప్‌కు రంధ్రం పెట్టి లిక్కర్ కాజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tamil Nadu: మందుబాబులు చేసే పనులు కొన్నిసార్లు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఇద్దరు మందు బాబులు ఏకంగా లిక్కర్ షాప్ గోడకి రంధ్రం చేసి ఫుల్లుగా తాగేశారు. అయితే చివరికి పోలీసులకు చిక్కారు.
ఇదీ జరిగింది
తమిళనాడు తిరువళ్లూరు జిల్లాలో ఇద్దరు వ్యక్తులు వైన్ షాప్ గోడకు రంధ్రం చేసి లోపలకు వెళ్లారు. లిక్కర్ దొంగతనం చేసేందుకు వెళ్లిన ఆ ఇద్దరూ.. చివరికి మద్యాన్ని చూసి మనసు మార్చుకున్నారు. ఫుల్లుగా తాగుతూ ఎంజాయ్ చేశారు. అయితే అక్కడే అసలైన ట్విస్ట్ ఎదురైంది. పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు గోడకు రంధ్రం ఉండటం చూసి అవాక్కయ్యారు. ఏం జరిగిందో చూసే సరికి మందుబాబులు లోపల ఫుల్లుగా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో ఆ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
Two men drilled a hole in the wall of a liquor shop & were boozing inside when caught redhanded by a patrol police in Thiruvallur district. The men had planned to steal the liquor bottles but decided to booze before taking off when they were caught @xpresstn @NewIndianXpress pic.twitter.com/zF9MoRjlUX
— Novinston Lobo (@NovinstonLobo) September 4, 2022
వైరల్ వీడియో
ఈ వీడియోలో దొంగలను వైన్ షాప్ రంధ్రం నుంచి పోలీసులు లాగుతున్నారు. చిన్నరంధ్రం నుంచి అతి కష్టం మీద దొంగలు బయటకు వచ్చారు. లిక్కర్ కోసం మందుబాబులు చేసిన ఈ పనిపై నెటిజన్లు వింతగా కామెంట్లు చేస్తున్నారు. "వీళ్ల తెలివితేటలకు ఏ అవార్డు ఇచ్చినా తక్కువే" అంటూ కొంత మంది వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. "పోలీసులు ఇంకా తెలివైనవాళ్లు" అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
మరో ఘటన
రోటీ ఇవ్వలేదనే కోపంతో మందుబాబు ఓ వ్యక్తిని కత్తితో పొడిచి చంపేసిన ఘటన ఇటీవల కలకలం రేపింది ఇటీవల ఈ ఘటన జరిగింది. కరోల్‌బాఘ్‌లో రాత్రి రిక్షాలో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తున్నారు. ఫుల్లుగా మద్యం తాగిన మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. తనకు భోజనం పెట్టాలని అడిగాడు. దీంతో మున్నా అనే వ్యక్తి రోటీ ఇచ్చాడు. అయితే మరో చపాతీ ఇవ్వాలని మందుబాబు డిమాండ్ చేశాడు. అందుకు మున్నా నిరాకరించాడు.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన మందుబాబు తన వద్ద ఉన్న కత్తిని తీసి మున్నాను పొడిచాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడు మున్నాను ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Also Read: మోదీని దించేందుకు నితీశ్ బిజీబిజీ- ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన బిహార్ సీఎం
Also Read: Covid-19 Vaccine: భారత్ బయోటెక్ నాసల్ టీకాకు DCGI గ్రీన్ సిగ్నల్