అన్వేషించండి

Covid-19 Vaccine: భారత్ బయోటెక్ నాసల్ టీకాకు DCGI గ్రీన్ సిగ్నల్

Bharat Biotech Nasal Vaccine: భారత్ బయోటెక్ తయారు చేసిన నాసల్ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి డీసీజీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Bharat Biotech Nasal Vaccine: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్​ టీకా (బీబీవి154/నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్​ మాండవీయ తెలిపారు.

" కరోనాపై యుద్ధంలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన చుక్కల మందు కొవిడ్​ టీకా (బీబీవి154/నాసల్‌ వ్యాక్సిన్‌) అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది. 18 ఏళ్లు నిండిన వారికి అత్యవసర పరిస్థితుల్లో ఈ టీకా ఇవ్వొచ్చు.                                           "
-మన్‌సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య మంత్రి

ఇక భయం వద్దు

కరోనా వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడే వారికి ముక్కు ద్వారా వేసుకొనే ఈ టీకా ఉపశమనం కలిగించనుంది. దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ ముక్కుద్వారా వేసే ఈ కరోనా వ్యాక్సిన్‌‌ను అభివృద్ధి చేసింది. హైదరాబాద్‌లో గల భారత్ బయోటెక్ రూపొందించిన 'కొవాగ్జిన్' కరోనా టీకాను ఇప్పటికే చాలామంది తీసుకున్నారు. ప్రస్తుతం ఈ టీకాను సిరంజీ ద్వారా అందిస్తున్నారు. 

ఒక్కసారి చాలు

భారత్ బయోటెక్ తయారు చేసిన ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌ను ఒక్కసారి తీసుకుంటే చాలని నిపుణులు అంటున్నారు. ఈ నాసల్ స్ప్రే వ్యాక్సిన్‌‌ను 'BBV154'గా పేర్కొంటున్నారు. ప్రస్తుతం సిరంజీ ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ కంటే మెరుగ్గా ఈ నాసల్ స్ప్రే పనిచేస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ వ్యాక్సిన్ తయారీ కోసం ఇప్పటికే సెయింట్‌ లూయిస్‌లోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఇలా వేసుకోవాలి

ఈ వ్యాక్సిన్‌ను పోలియో చుక్కల తరహాలోనే ముక్కు పుటల్లో వేసుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. పైగా దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు లేకుండానే శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. ముక్కు ద్వారా వేసే ఈ వ్యాక్సిన్‌తో కరోనాను 99.9 శాతం చంపేయవచ్చని ఓ పరిశోధనలో తేలింది. ఈ వ్యాక్సిన్‌ను కేవలం ఇండియాలోనే కాకుండా అమెరికా, కెనడా యూకేల్లో కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

Also Read: మరో ట్విస్ట్ ఇచ్చిన పుతిన్- కిమ్‌ సాయంతో ఉక్రెయిన్‌పై పోరు!

Also Read: Bengaluru Rains: హతవిధి! వీధి వీధిలో వరదే- ప్రతి ఇంట్లో బురదే- బెంగళూరు కష్టాలు! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Pushpa 2 Thanks Meet: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
Indhiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు వడపోత పూర్తి, తొలిదశలో 71,482 మందికి అందజేత
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు వడపోత పూర్తి, తొలిదశలో 71,482 మందికి అందజేత
Tirumala News: ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త,  ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

AAP Loss Yamuna Pollution Key Role | Delhi Election Results 2025లో కేజ్రీకి కలిసి రాని యమున | ABP DesamArvind Kejriwal on AAP Election Loss | ఆమ్ ఆద్మీ ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్ | ABP DesamDelhi Elections Results 2025 | మాస్టర్ మైండ్ Manish Sisodia ను వీక్ చేశారు..ఆప్ ను గద్దె దింపేశారు | ABP DesamDelhi Elections Results 2025 | Delhi గద్దె Arvind Kejriwal దిగిపోయేలా చేసింది ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
First GBS Death in Telangana: తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
తెలంగాణలో తొలి జీబీఎస్ మరణం, చికిత్స పొందుతూ మహిళ మృతి - వ్యాధి లక్షణాలు ఇవే
Pushpa 2 Thanks Meet: 'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
'పుష్ప 3 సినిమా ఓ అద్భుతం' - అందరూ గర్వపడేలా చేస్తానన్న బన్నీ, 'బాలీవుడ్'పై కామెంట్స్ వైరల్
Indhiramma Houses: ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు వడపోత పూర్తి, తొలిదశలో 71,482 మందికి అందజేత
ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు వడపోత పూర్తి, తొలిదశలో 71,482 మందికి అందజేత
Tirumala News: ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త,  ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
ఎన్ఆర్ఐలకు టీటీడీ శుభవార్త, ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ సభ్యులకు బ్రేక్‌ దర్శనం కోటా పెంపు
Caribbean Earthquake: కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
కరేబియన్‌ సముద్రంలో 8 తీవ్రతతో భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ
Mufasa OTT Release Date: ఓటీటీలోకి 'ముఫాసా: ది లయన్ కింగ్' - ఆ ప్లాట్ ఫామ్‌లో చూసి ఎంజాయ్ చేయండి, ఎప్పటి నుంచంటే?
ఓటీటీలోకి 'ముఫాసా: ది లయన్ కింగ్' - ఆ ప్లాట్ ఫామ్‌లో చూసి ఎంజాయ్ చేయండి, ఎప్పటి నుంచంటే?
Insurance Amendment Bill: బీమా సవరణ బిల్లుతో ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
బీమా సవరణ బిల్లుతో ఇన్సూరెన్స్‌ సెక్టార్‌లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
Ration Card Online Apply Telangana: మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
మీ సేవ కేంద్రాల్లో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేయడానికి లేదు- తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ
Embed widget