Bengaluru Rains: హతవిధి! వీధి వీధిలో వరదే- ప్రతి ఇంట్లో బురదే- బెంగళూరు కష్టాలు!
Bengaluru Rains: బెంగళూరును భారీ వర్షాలు, వరదలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Bengaluru Rains: కర్ణాటకను భారీ వర్షాలు వెంటాడుతున్నాయి. వర్షాల ధాటికి బెంగళూరును వరదలు ముంచెత్తాయి. వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా బెంగళూరులోని చాలా ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వేరే ప్రాంతానికి వెళ్లేందుకు ప్రజలు పడవలు, ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. రహదారులపైకి వరదనీరు చేరడంతో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది.
ట్రాక్టర్లపై టెకీలు
భారీ వర్షాలకు ప్రైవేట్ పాఠశాలలు సెలవులు ప్రకటించగా కొన్ని పాఠశాలలు ఆన్‌లైన్ క్లాసులు బోధిస్తున్నాయి. కానీ బెంగళూరులో ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉండటంతో ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ట్రాలీలో కూర్చొని ఆఫీసులకు వెళ్తున్నారు.
#WATCH via ANI Multimedia | Many employees of IT companies are forced to use tractors to reach their offices in the Yemalur area of Bengaluru, Karnataka amid waterlogging due to heavy rains.https://t.co/TXX3aFEntQ
— ANI (@ANI) September 6, 2022
Residents take Poclain & tractor rides to reach office #bengalururains #BengaluruRain #bengalurufloods #BengaluruWeather #BengaluruAirport #weather pic.twitter.com/ueFfLB2lUi
— INDER YADAV (@inderyadav29) September 6, 2022
సహాయక చర్యలు
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్, విపత్తు నిర్వహక సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. సహాయక చర్యలను ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
భారీ వర్షాలు
సెప్టెంబరు 1 నుంచి 5వ తేదీ వరకు బెంగళూరులో సాధారణ వర్షాల కంటే 150 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.