అన్వేషించండి

Swiggy: మసాల దోస్సై అంటున్న ఆహార ప్రియులు - స్విగ్గీ సర్వేలో వెలుగులోకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్‌

Online Food Orders: దేశవ్యాప్తంగా భోజన ప్రియులు వెజ్‌ వెరైటీలనే ఇ‌ష్టపడుతున్నారు.ఆన్‌లైన్ ఫుడ్‌ డెలీవరీ యాప్‌ల్లో వెజ్ వంటకాలనే ఎక్కువగా ఆర్డరిస్తున్నారని స్విగ్గీ జరిపిన సర్వేలో వెల్లడైంది.

Swiggy: చల్లని సాయంత్రం..వర్షం పడుతున్న వేళ ఘుమఘుమళాడే చికెన్‌(Chicken) లాలీపప్స్‌ తినాలనిపిస్తుందా..వెంటనే మనకు గుర్తుకొచ్చేది ఆన్‌లైన్ ఫుడ్‌ డెలీవరీయాప్‌లే, అలాగే రాత్రిపూట ఆకలేస్తోందా...ఓ బిర్యానీ(Biryani) ఆర్డర్ పెట్టుకుందామంటూ  ఫోన్‌ తీసుకుంటాం. స్నేహితులు ఇంటికి వచ్చారా...ఓ జంబోప్యాక్‌ను క్లిక్‌మనిపిస్తాం. ఇలా ఆన్‌లైన్‌ ద్వారా తెచ్చుకుని ఏం తినాలన్నా ముందుగా మనం వెతికేది నాన్‌వెజ్‌ (Non Veg)వెరైటీలే. కానీ ఇటీవల జరిగిపిన ఓ సర్వేలో ఆన్‌లైన్ ఫుడ్‌ ఆర్డర్లలో నాన్‌వెజ్‌ కన్నా వెజ్‌(Veg) ఆర్డర్లే ఎక్కువ వస్తున్నాయి. అవి ఎక్కడో ఒకసారి చూద్దాం

నాన్‌వెజ్‌ కన్నా వెజ్‌ ఆర్డర్లే ఎక్కువ
కొందరికి ముక్కలేనిదే ముద్ద దిగదు...కానీ నాన్‌వెజ్‌(Nonveg)లో అన్నిరకాల వెరైటీలు చేసుకుని తినడం మనవల్ల అయ్యే పనికాదు. ముఖ్యంగా స్టార్టర్స్ గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఆ రుచి, రంగు ఇంట్లో తీసుకురావడం ఎవరి వల్ల కాదు. పైగా అనుకున్నదే తడవుగా అరగంటలో చేతిలో వచ్చిపడటం అసాధ్యమనే చెప్పాలి. ఇక ఘుమఘుమలాడే బిర్యానీ(Biryani) తినాలని ఉన్నా...అప్పటికప్పుడు ఇంట్లో చేయడం కుదరదు. ఏదో వెజ్‌ ఐటెంలు అంటే ఇంట్లో చేసుకోగలం కానీ నాన్‌వెజ్‌ వెరైటీలు మనవల్లకాదని ఆన్‌లైన్‌లో ఆర్డర్లు ఇచ్చేస్తాం.

ఫుడ్‌డెలీవరీ యాప్‌ల్లో సైతం ఈ నాన్‌వెజ్ వెరైటీలదే అగ్రస్థానం. ఎక్కవ డెలివరీలు సైతం ఇవే ఉంటాయి అనుకుంటే మీరు ప్యూర్ వెజ్‌పప్పులో కాలు వేసినట్లే. ఎందుకంటే ఇప్పుడు ఆన్‌లైన్‌ ఆర్డర్లో నాన్‌వెజ్ వెరైటీల కన్నా వెజ్‌ ఆర్డర్లే ఎక్కువ వస్తున్నాయి.అందులో చెప్పుకోలాల్సిన విషయం ఏంటంటరా...బిర్యానీ అంటే పడిచచ్చిపోయే హైదరాబాద్‌(Hyderabad)లోనూ ఫుడ్‌డెలీవరీ యాప్‌ల్లో వెజ్‌ ఐటెలదే అగ్రస్థానం అంటే....ఈ బిర్యానీ, ముక్కలు తినీతినీ మొహం మొత్తేసినట్టు ఉందేమో అందుకే వెజ్ ఐటెంలు ఆర్డర్లు చేస్తున్నట్లు ఉన్నారు. ఈ వెజ్‌ఐటెంలు ఆర్డర్లు ఇచ్చేవారిలో టెక్‌ నగరం బెంగళూరుదే అగ్రస్థానం.

ప్రముఖ ఫుడ్ డెలీవరీ యాప్ స్విగ్గీ(Swiggy) నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వెజ్‌ ఐటెంలు ఆర్డర్లు ఇచ్చే నగరాల్లో బెంగళూరు(Bengalore) తొలిస్థానంలో ఉండగా ఆ తర్వాత ముంబయి(Mumbai) రెండోస్థానం, హైదరాబాద్‌ మూడోస్థానంలో నిలిచాయి. దేశవ్యాప్తంగా వచ్చిన ఆర్డర్లలో మూడోవంతు ఒక్క బెంగళూరు నుంచే వచ్చాయంటే టెక్కీలు వెజ్‌పై ఎంత మోజు పెంచుకున్నారో అర్థమవుతోంది.

వెజ్‌లోనూ వెరైటీలు అధికం
నాన్‌వెజ్‌లో ఎన్ని వెరైటీలు ఉంటాయో అందుకు రెట్టింపు వెజ్‌లోనూ అందిస్తుండటంతో పెద్దఎత్తున ఆర్డర్లు వస్తున్నాయని స్వీగ్గీ తెలిపింది. ముఖ్యంగా వీటిల్లో అల్పాహారాలదే అగ్రస్థానం. మసాలా దోసె, పన్నీరు బిర్యానీ, పన్నీర్ బటర్ మసాలాను ఎక్కువ ఇష్టపడుతున్నారు. ముంబయిలో అయితే దాల్‌ కిచిడీ.మార్గరీటా పిజ్జా, పావ్‌బజ్జీని ఎక్కువ తింటున్నారు. ఇక మన హైదరాబాదీలకు అయితే మస్ట్‌గా మసాలా దోసె ఉండాల్సిందే. ఇడ్లీని సైతం ఎక్కువ మంది ఆర్డరిచ్చారు. దేశవ్యాప్తంగా స్విగ్గీకి వస్తున్న 10 వంటకాల్లో ఆరు వెజ్‌ వెరైటీలే ఉండటం విశేషం. వీటిల్లో మసాలా దోశ, పన్నీర్ బటర్ మసాలా, మార్గరీటా పిజ్జా, పావ్‌ బజ్జీ టాప్‌ పొజిషన్‌లో నిలిచాయి. ఒక్క వారంలోనే 60వేల వెజ్‌ సలాడ్‌లను స్విగ్గీలో ఆర్డర్లు వచ్చాయి. దీన్నిబట్టి చూస్తే జనం మెల్లగా మళ్లీ వెజిటేరియన్‌లుగా మారిపోతున్నారా అన్న భావన కలుగుతోంది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget