By: Ram Manohar | Updated at : 13 Mar 2023 04:42 PM (IST)
స్వలింగ వివాహాలపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court:
స్వలింగ వివాహాల కేసుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుని 5 జడ్జ్‌లతో కూడిన ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు వెల్లడించింది. ఏప్రిల్ 18వ తేదీన ఈ కేసు విచారణ చేపడతామని స్పష్టం చేసింది. స్వలింగ వివాహాలకు చట్టబద్ధతనివ్వాలంటూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిపై చాన్నాళ్లుగా విచారణ కొనసాగుతోంది. అయితే...ఈ విషయమై కేంద్రాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించగా...చట్టబద్ధత కల్పించలేమని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కేసుని వేరే ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. ఎవరైనా ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు రాజ్యాంగం కల్పించినప్పటికీ వివాహం విషయంలో ఇది వర్తించదని తేల్చి చెప్పారు.
SG Mehta says the moment marriage as a recognized institution comes between same sex, question will come on adoption and therefore Parliament will have to see the issue of psychology of child, which has to be examined whether it can be raised in such a way.
— ANI (@ANI) March 13, 2023
Same-sex marriage matter in SC: SG Tushar Mehta, appearing for Centre, says the right to love, express and freedom of choice is already upheld and no one is interfering with that right but doesn't mean conferring the right of marriage.
— ANI (@ANI) March 13, 2023
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ తరహా వివాహాలకు గుర్తింపు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఈ ట్రెండ్ కొనసాగుతుంది. అంతేకాదు.. స్వలింగ సంపర్కాన్ని అడ్డు చెప్పిన పాత చట్టాలను కొట్టేస్తే కొత్త చట్టాలను తిరిగి తీసుకొచ్చాయి చాలా దేశాలు. కొద్ది రోజులక్రితం సింగపూర్ ప్రభుత్వం స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని వెల్లడించింది. సింగపూర్ ప్రభుత్వం ఎన్నో దశాబ్దాలుగా వివాదాస్పద 377ఏ చట్టాన్ని అమలుచేస్తోంది. ఇది బ్రిటిష్ పాలన నుంచి సంక్రమించింది చట్టం. ఈ చట్టం ప్రకారం ఇద్దరు పురుషుల మధ్య స్వలింగ సంపర్కం నిషేధం. స్వలింగ సంపర్కం ఆమోదయోగ్యం కాదన్నది సింగపూర్ సమాజం అభిప్రాయమని, ఈ చట్టం దాన్ని ప్రతిబింబిస్తుందని అధికారులు ఏళ్ల తరబడి చెబుతూ వచ్చారు. కానీ, గత వారం సింగపూర్ పార్లమెంట్ ఈ చట్టాన్ని రద్దు చేసింది. అంతకు కొన్ని నెలల క్రితం సింగపూర్ ప్రధానమంత్రి లీ షెన్ లోంగ్ ఈ చట్టాన్ని రద్దు చేయనున్నట్టు ప్రకటించారు.Also Read: Oscars 2023 Rajamouli : ఆస్కార్ తెచ్చిన రాజమౌళి - దర్శక ధీరుడికి చరిత్ర సలామ్ కొట్టాల్సిందే
Brand Value: తగ్గేదేల్యా, బ్రాండ్ వాల్యూ పెంచుకున్న అల్లు అర్జున్, రష్మిక
Stocks to watch 22 March 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - డివిడెండ్ స్టాక్స్ Hindustan Zinc, SBI Card
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోయిన వర్షాలు, మళ్లీ 24, 25 తేదీల్లో కురిసే ఛాన్స్!
ABP Desam Top 10, 22 March 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Petrol-Diesel Price 22 March 2023: చెమటలు పట్టిస్తున్న చమురు ధరలు - మీ నగరంలో రేటు ఇది
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా