అన్వేషించండి

Quash Petition : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై వీడని ఉత్కంఠ- త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ

Supreme Court On Quash Petition : సుప్రీంకోర్టులో సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న క్వాష్ పిటిషన్‌పై తీర్పు ఇవాళ వెల్లడైంది. ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.

స్కిల్ డెలవప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు వేసుకున్న క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. తనపై చట్ట విరుద్ధంగా కేసు నమోదు చేశారని తనకు 17ఏ సెక్షన్ వర్తిస్తుందని చంద్రబాబు పిటిషన్‌పై దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. గతంలో విచారణ పూర్తయిన తర్వాత అక్టోబర్ 20వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు. సుదీర్ కాలంగా రిజర్వ్ లో ఉన్న తీర్పును ఇవాళ ఇచ్చారు.   

ఇవాళ సమావేశమైన బెంచ్‌లో చంద్రబాబుకు అనుకూలంగా జస్టిస్ అనిరుద్ధ బోస్ తీర్పు వెల్లడించారు. ఆయన పిటిషన్ సరైనదేనంటూ సమర్థించారు. ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా నిర్ణయాన్ని వెల్లడించారు. అనంతరం తన తీర్పు తెలియజేసిన త్రివేది... ఈ కేసులో 17ఏ వర్తించదని అభిప్రాయపడ్డారు. దీంతో చీఫ్‌ జస్టిస్‌కు రిఫర్ చేశారు.   

స్కిల్ కేసులో తనకు 17ఏ వర్తిస్తుందన్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీఐడీ కేసు పెట్టింది. మొదట ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినప్పటికీ అర్థరాత్రి అరెస్టు చేసి ఆ తర్వాత ఎఫ్ఐఆర్‌లో ఆయన పేరు నమోదు చేశారు.  తనపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తర్వాత హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ వచ్చింది. కనీస సాక్ష్యాధారాలను కూడా సీఐడీ చూపించలేకపోయిందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీనిపైనా ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 

క్వాష్ పిటిషన్ పై తీర్పు అక్టోబర్ 18వ  తేదీన రిజర్వ్                               
స్కిల్ డెవలప్‌‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు అక్టోబర్ 18వ తేదీన రిజర్వ్ చేసింది. అప్పటి నుంచి తీర్పు పెండింగ్ లో ఉంది. చంద్రబాబుపై ప్రభుత్వం పెట్టిన ఇబ్బడిమబ్బడి కేసుల గురించి అటు ఏసీబీ కోర్టులో.. ఇటు హైకోర్టులో.. సుప్రీంకోర్టులో అదే పనిగా విచారణకు వస్తున్నాయి. కానీ క్వాష్ పిటిషన్ పై తీర్పు రాని కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరికి చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ కూడా ఈ కారణంగానే వాయిదా పడింది.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 3rd ODI Highlits: క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?

వీడియోలు

Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్
Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 3rd ODI Highlits: క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
క్వింటన్ డికాక్ రికార్డ్ సెంచరీ, భారత్‌కు మోస్తరు టార్గెట్.. రాణించిన ప్రసిద్ధ్, కుల్దీప్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RBI Key Decisions: జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
జీరో బ్యాలెన్స్ బ్యాంకు ఖాతాదారులకు RBI గుడ్‌న్యూస్, పలు ఛార్జీలు ఎత్తివేస్తూ నిర్ణయం
Gummadi Narsayya biopic: రాజకీయాల్లో లెజెండ్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ - హీరోగా శివరాజ్  కుమార్ - షూటింగ్ ప్రారంభం
రాజకీయాల్లో లెజెండ్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ - హీరోగా శివరాజ్ కుమార్ - షూటింగ్ ప్రారంభం
IndiGo Flights-BCCI: ఇండిగో తప్పిదంతో బీసీసీకి చిక్కులు!సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్‌లో భారీ మార్పులు?
ఇండిగో తప్పిదంతో బీసీసీకి చిక్కులు!సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ షెడ్యూల్‌లో భారీ మార్పులు?
Hanumakonda Additional Collector : ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ - రైతుల సంబరాలు - ఇంతగా కాల్చుకుతిన్నారా?
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ - రైతుల సంబరాలు - ఇంతగా కాల్చుకుతిన్నారా?
Embed widget