Supermoon: ఆకాశంలో ఒకేసారి రెండు చందమామలు, ఆగస్టు 1న సూపర్ మూన్ కనువిందు
Supermoon: ఆగస్టు 1వ తేదీన ఆకాశంలో సూపర్ మూన్ కనువిందు చేయనుంది.
Supermoon:
సూపర్ మూన్..
ఖగోళ వింతలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరినీ ఎగ్జైట్ చేసే విషయం ఇది. ఆకాశంలో ఇద్దరు నిండు చంద్రులు కనువిందు చేయనున్నారు. దీన్ని సూపర్‌మూన్ (Supermoon) అంటారు. ఆగస్టు 1వ తేదీన ఈ అద్భుతం జరగనుంది. ఖగోళ భాషలో దీన్ని Sturgeon Moon గానూ పిలుస్తారు. సాధారణ నిండు చంద్రుడి పరిమాణం కన్నా ఎక్కువ సైజ్‌లో, ఎక్కువ వెలుగుతో రెండు చంద్రుళ్లు ఆకాశంలో మెరవనున్నారు. ఈ స్టర్జియన్ మూన్‌కి ఖగోళ చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. నేటివ్ అమెరికన్స్, కొలొనియల్ అమెరికా, యూరోపియన్లు ఈ ఫుల్ మూన్స్‌ని తొలిసారి గమనించారు. అప్పుడే వాటికి ప్రత్యేకమైన పేర్లు పెట్టారు. స్టర్జన్ మూన్ పేరు వెనకాల ఓ చరిత్ర ఉంది. అప్పట్లో వేసవిలో గ్రేట్ లేక్స్(Great Lakes), లేక్ చాంప్లెయిన్ (Lake Champlain) సరసుల్లో స్టర్జన్ చేపలు విపరీతంగా కనిపించేవి. దాదాపు 10 కోట్ల సంవత్సరాల పాటు వీటి ఉనికి ఉన్నట్టు అంచనా. ఇవి చూడటానికి చాలా పొడవుగా, ఎముకలు ఎక్కువగా ఉండేవి. అయితే రానురాను వీటిని వేటాడి తినడం పెరిగిపోయింది. ఫలితంగా...క్రమక్రమంగా వీటి సంఖ్య తగ్గుతూ వచ్చింది.
#FullMoon in Aquarius Aug 1st
— Psychic Carla Baron (@Carla_Baron) July 29, 2023
11:31 am PT | 2:31 pm ET
This moon is called a Sturgeon Moon. It’s said this Moon was named after lake sturgeon- a freshwater fish and staple food source for Native Americans- caught in great amounts during this time of the year. pic.twitter.com/6rn0TbTA0c
పేరు ఇలా పెట్టారు..
అప్పట్లో వేసవి నెలల్లోనే ఈ చేపలు ఎక్కువ మొత్తంలో సరసుల్లో కనిపించేవి. వాటిని విపరీతంగా వేటాడి తినేవాళ్లు. ఆ సమయంలో నేటివ్ అమెరికన్స్‌కి అదే ఆహారంగా ఉండేది. సరిగ్గా అదే కాలంలో ఆకాశంలో సూపర్ మూన్ కనిపించేది. దీనికి గుర్తుగానే అప్పుడు ఆకాశంలో కనిపించే ఈ వింతకు "స్టర్జన్ మూన్" అని పేరు పెట్టుకున్నారు. అలా ఈ పేరు స్థిరపడిపోయింది. చంద్రుడి కక్ష్య భూ కక్ష్యకు అతి దగ్గరగా వచ్చినప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఈ సారి ఆగస్టు 1న ఈస్టర్న్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 2.32 నిముషాలకు ఈ సూపర్ మూన్‌ని చూడొచ్చు. చాలా నిండుగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. నిజానికి ఈ ఏడాది సూపర్ మూన్స్‌కి చాలా స్పెషల్. మొత్తం నాలుగు సార్లు ఇవి కనిపించనున్నాయి. ఆగస్టు 30వ తేదీన బ్లూ మూన్ (Blue Moon) కనువిందు చేయనుంది.
Aussie stargazers will be treated to two rare astronomical events happening in Australia in August, a Sturgeon Supermoon and a Blue Moon.
— The Project (@theprojecttv) July 30, 2023
READ MORE: https://t.co/ESWx5uDeHE pic.twitter.com/dQLCz6KBPj
Also Read: జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఎందుకు ఉంది, ఈ తప్పిదాన్ని ముస్లింలే సరిదిద్దాలి - యోగి ఆదిత్యనాథ్