జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఎందుకు ఉంది, ఈ తప్పిదాన్ని ముస్లింలే సరిదిద్దాలి - యోగి ఆదిత్యనాథ్
Gyanvapi Case: జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఎలా వచ్చిందో చెప్పాలని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు.
Gyanvapi Case:
యోగి సంచలన వ్యాఖ్యలు..
జ్ఞానవాపి మసీదు కేసుపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మసీదులో ఆవరణలో త్రిశూలం ఎందుకు ఉందని ప్రశ్నించారు. ముస్లిం పిటిషనర్లు చారిత్రక తప్పిదాన్ని సరి చేసే పరిష్కారంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ANIకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రస్తావన తీసుకొచ్చారు.
"మసీదులో త్రిశూలం ఎందుకుంది..? మేమేమీ పెట్టలేదే. అక్కడ కచ్చితంగా జ్యోతిర్లింగం ఉంది. దేవుడి ప్రతిమలున్నాయి. అక్కడి గోడలు మనకు ఏవో చెబుతున్నాయి. ఇది కచ్చితంగా ఓ చారిత్రక తప్పిదమే. దీనికి పరిష్కారం చూపించేందుకు ముస్లిం పిటిషనర్లు ముందుకు రావాలి. మాకు కావాల్సింది ఇదే. "
- యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి
EP-85 with Chief Minister of Uttar Pradesh Yogi Adityanath premieres today at 5 PM IST#YogiAdityanath #ANIPodcastwithSmitaPrakash #Podcast
— ANI (@ANI) July 31, 2023
Click the 'Notify me' button to get a notification, when the episode goes on air: https://t.co/HkTmnJcuXC pic.twitter.com/DnQd57EUSr
యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలపై AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అలహాబాద్ హైకోర్టు త్వరలోనే తీర్పునిస్తుందని, ఆలోగా యోగి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం న్యాయవ్యవస్థను ధిక్కరించడమే అవుతుందని అన్నారు."జ్ఞానవాపి మసీదులో ASI సర్వేని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి తెలుసు. అలహాబాద్ హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. మరి కొద్ది రోజుల్లోనే తీర్పు వస్తుంది. అయినా యోగి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కచ్చితంగా న్యాయవ్యవస్థ ధిక్కారం కిందకే వస్తుంది"
- అసదుద్దీన్ ఒవైసీ, AIMIM చీఫ్
#WATCH | On UP CM Yogi Adityanath’s Gyanvapi statement, AIMIM MP Asaduddin Owaisi says "CM Yogi knows that the Muslim side has opposed ASI survey in Allahabad High Court and the judgement will be given in a few days, still he gave such a controversial statement, this is judicial… pic.twitter.com/IuBSqMHepv
— ANI (@ANI) July 31, 2023
ఇదీ జరిగింది..
ఈ ఏడాది మే నెలల హిందువుల తరపున ఈ పిటిషన్ దాఖలైంది. ఐదుగురు మహిళలు ఈ పిటిషన్ వేశారు. సర్వే చేయడంతో పాటు మసీదులోని శివలింగానికి పూజలు చేసేందుకు అనుమతినివ్వాలని కోరారు. అంతే కాదు. ఈ మసీదు గోడ అవతల ఉన్న వినాయకుడు, హనుమంతుడు, నంది విగ్రహాలకూ పూజలకు పర్మిషన్ కావాలని అడిగారు. అయితే..ఈ పిటిషన్ విచారణలో మసీదు కమిటీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. హిందువులు చెబుతున్నట్టుగా ఔరంగజేబు ఇక్కడి ఆలయాన్ని కూలగొట్టి మసీదు కట్టారన్నది కేవలం నిరాధార ఆరోపణలు అని వాదించింది. ఆదివిశ్వేశ్వర ఆలయంపై ముస్లింలు దాడి చేయగా...ఆ తరవాత రాజా తొండల్ మల్ ఆలయాన్ని పునరుద్ధరించారన్న వాదననూ కొట్టి పారేసింది. మసీదు ప్రాంగణంలో శివలింగం కనిపించలేదని తేల్చి చెప్పింది. గతేడాది మే 16న స్థానిక కోర్టు పర్యవేక్షణలో వీడియో సర్వే నిర్వహించారు. మసీదులోపల శివలింగం కనిపించిందని సర్వేలో తేలింది. ముస్లింలు మాత్రం అది వాటర్ ఫౌంటేన్‌లో ఓ శకలమే అని వాదిస్తున్నారు.
Also Read: ఇప్పటి వరకూ ఎన్ని FIRలు నమోదు చేశారు? మణిపూర్ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు