Himachal Pradesh: హిమచల్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత - సీఎం సుఖ్విందర్ సమర్థత సరిపోవడం లేదా ?
Chief Minister Sukhvinder Singh Sukhu : హిమచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజా అసంతృప్తి బహరంగమవుతోంది. హామీలు నెరవేర్చకపోవడం, డ్రగ్స్ పెరగడం, నిరంతరం ఘర్షణలు సీఎం అసమర్థతగా మారింది.
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌కు అద్భుతమైన ముఖ్యమంత్రి అవుతారని అనుకున్న సుఖ్విందర్ సింగ్ సుఖూ సూపర్ పెయిల్యూర్ సీఎంగా ప్రజల ముందు నిలుస్తున్నారు. గత కొంతకాలంగా హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలే దానికి నిదర్శనం. పాలన చేపట్టి రెండేళ్లు కాక ముందే ఆయనపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. హామీలు నెరవేర్చకపోవడమే కాదు. అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం కూడా ప్రజల్లో అసంతృప్తి పెరగడానికి కారణం అవుతోంది
హామీలు నెరవేర్చలేదు.. ప్రభుత్వ వైఫల్యాలు
హిమచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా బాధ్యతలు తీసుకున్న సఖు ప్రజలకు చాలా హామీలు ఇచ్చారు. నిరుద్యోగాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పర్చడంతో పాటు సంక్షేమ పథకాల అమలుపై హామీలు ఇచ్చారు. అయితే రెండేళ్లు గడిచినా ఇందులో కనీస హామీలు కూడా అమలు కాలేదు. నిరద్యోగ భృతి హామీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కీలకం. ఇప్పటి వరకూ ఆ హామీని అమలు చేయలేకపోయారు. గ్రామీణ రోడ్లను మెరుగు పరుస్తామని చెప్పారు కానీ ఇంత వరకూ చేయలేకపోయారు. టూరిజం పై ఎక్కువగా ఆధారపడి ఉన్న హిమచల్ కు రోడ్లు చాలా ముఖ్యం. కానీ వాటినీ కూడా పట్టించుకోవడం లేదు. అందుకే గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ అసహనం పెరుగుతోంది.
ఘోరమైన పాలనా వైఫల్యాలు
హామీలు అమలు చేయకపోవడం పక్కన పెడితే కనీసం పాలన కూడా సరిగ్గా చేయలేకపోతున్నారన్న విమర్శలను సఖు ఎదుర్కొంటున్నారు. ప్రజలకు అందాల్సిన కనీస సౌకర్యాలైన విద్య, వైద్యం వ్యవహారాల్లో గతంలో ఉన్నట్లుగా కూడా సేవలు ప్రజలకు అందడం లేదు. ఆస్పత్రుల్లో వైద్యులు.. స్కూళ్లల్లో టీచర్ల కొరత చెప్పలేనంత ఉంది. సీఎం సమర్థంగా వ్యవహరించడం వల్ల కింది స్థాయి అధికారులు కూడా నిమిత్తమాత్రులుగా మిగిలిపోతున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేవారు పెద్దగా కనిపిచండం లేదు. సమస్యలను పరిష్కరించే విషయంలో సీఎం చాలా నింపాదిగా, నిర్లిప్తంగా ఉంటున్నారు.
సిమ్లాలో వరుస వివాదాలు
హిమాచల్ ప్రదేశ్ కు గుండెలాంటి సిమ్లాలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు అనేక ఆందోళనలకు కారణం అవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా మసీదుల వంటివి అక్రమంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఓ మసీదు విషయంలో స్థానికలు అక్రమ నిర్మాణాలపై ఆందోళనలు చేశారు. సిమ్లా డెమెగ్రాఫిక్ స్ట్రక్చర్ ను అక్రమ నిర్మాణాలు మార్చేస్తున్నా .. సఖు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాన్ని చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నా.. ప్రజల్లో వస్తున్న ఆగ్రహాన్ని ఆపలేకపోతున్నారు. సిమ్లా గొప్పతనాన్ని కాపాడుకోవాలని వారనుకుంటున్నారు.
అసెంబ్లీలో నిద్రపోయిన సీఎం సుఖు
హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వాన్ని నడపడంపై .. సీఎం సుఖ్విందర్ సింగ్ సఖుకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అసెంబ్లీ సమావేశాల్లో తేలిపోయింది. ఓ వైపు సీరియస్ గా చర్చలు జరుగుతూంటే ఆయన నిద్రపోయారు. ఓ వైపు ప్రభుత్వం వద్ద డబ్బు లేదని జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు. ప్రభత్వ ఉద్యోగులంతా ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలోనూ ఆయన హాయిగా అసెంబ్లీలో నిద్రపోయారంటే.. ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థం చేసకోవచ్చంటున్నారు.
హిమాచల్ లో పెరుగుతున్న డ్రగ్స్
హిమచల్ ప్రదేశ్ లో డ్రగ్స్ అతి పెద్ద సమస్యగా మారింది. యువతను డ్రగ్స్ నిర్వీర్యం చేస్తున్నయి. టూరిజంపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రభుత్వం కఠిన చర్యల తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోంది. డ్రగ్స్ అమ్మేవారిని.. రాకెట్లను పట్టుకోవడంతో డ్రగ్స్ బారిన పడిన వారి కోసం రీహాబిటేషన్ సెంటర్లు పెట్టే ఆలోచన కూడా చేయడం లేదు. అలాగే.. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం పనితీరు తీసికట్టుగా ఉంది. ఈ పరిస్థితులతో పూర్తి సఖు ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి కాంగ్రెస్‌కు పెను సమస్యగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.