Special trains: దసరా పండగకు ప్రత్యేక రైళ్లు - ప్రకటించిన రైల్వే శాఖ
దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
దసరా పండుగ వచ్చిందంటే ప్రతి రైలు, బస్సు ప్రయాణికులతో నిండిపోతాయి. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రతి రైలు జనంతో కిక్కిరిసిపోతుంది. చాలా మంది ప్రయాణికులు రెండు నెలలు ముందే టికెట్లు కోసం ఎదురు చూస్తేనే ఉంటారు. పండగ వేళ ప్రయాణికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే శాఖ శుభవార్త చెప్పింది.
దసరా సీజన్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని విజయవాడ మీదుగా ప్రత్యేక రైలు నడిపిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. సత్ర గజ్జ - బెంగళూరు (06286) రైలు ఈనెల 23వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు సత్ర గచ్చి లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్ నుంచి భువనేశ్వర్ (06073) రైలు ఈనెల 23, 30 నవంబర్ 6 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06074) ఈనెల 24, 31 నవంబర్ 7 తేదీల్లో రాత్రి 9 గంటలకు భువనేశ్వర్ లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుతుంది.
చెన్నై సెంట్రల్ - సత్ర గచ్చి (06071) రైలు ఈనెల 28, నవంబర్ 4 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ లో బయలుదేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు సత్ర గచ్చి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (06072) ఈనెల 23, 30 నవంబర్ ఆరు తేదీల్లో సత్ర గచ్చిలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. భువనేశ్వర్ - న్యూ బెంగళూరు (06288) రైలు ఈనెల 22న ఉదయం 8.15 గంటలకు భువనేశ్వర్ లో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
నాందేడ్ - పానిపట్ (07635) రైలు ఈనెల 26 వ తేదీన ఉదయం 5.40 గంటలకు నాందేడ్ లో బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 1.15 గంటలకు పానిపట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07636) ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 3.15 గంటలకు పానిపట్ లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.30 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది.
నిర్వహణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈనెల 23 నుంచి 26 తేదీ వరకు విజయవాడ - గుంటూరు (07783), గుంటూరు - మాచర్ల (07779), మాచర్ల - నడికుడి (07580), నడికుడి - మాచర్ల (07579), మాచర్ల - గుంటూరు (07780), గుంటూరు - విజయవాడ (07788) రైళ్ళను పునరుద్ధరించినట్టు రైల్వే అధికారులు చెప్పారు.
24వ తేదీన హైదరాబాద్-కటక్(07165) రైలును ప్రకటించింది. ఇది నల్గొండ, గుంటూరు, విజయవాడ, దువ్వాడ తదితర స్టేషన్ల మీదుగా నడుస్తుంది. 25వ తేదీన కటక్-హైదరాబాద్(07166) మధ్య మరో రైలు నడుస్తుందని, ఈ రైలు కూడా ఇదే మార్గంలో ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు. మిగిలిన ప్రత్యేక రైళ్లు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రయాణించవని అధికారులు పేర్కొన్నారు.
మరోవైపు, నిర్వహణ పరమైన కారణాలతో కాచిగూడ-రాయచూర్ (17693), రాయచూర్-కాచిగూడ(17694) మధ్య రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 25 వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైలు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ రైళ్లు, మార్గాలు ఎంచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.