అన్వేషించండి
Advertisement
Satya Nadella: మన సత్యనాదెళ్ల గురించి ఈ 13 విషయాలు తెలుసా?
సత్య నాదెళ్ల.. ప్రపంచ దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్‌కు ఛైర్మన్, సీఈఓ. అయితే అంత స్థాయికి ఎదిగిన నాదెళ్ల ఓ తెలుగువాడు. మరి అలాంటి వ్యక్తి గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
సత్య నాదెళ్ల.. పరిచయం అక్కర్లేని పేరు. నేటి తరానికి ఓ ఇన్‌స్పెరేషన్. దిగ్గజ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఛైర్మన్, సీఈఓ. అనంతపురం నుంచి అమెరికా వరకు వెళ్లడమే చాలా టఫ్ టాస్క్. అలాంటిది ప్రపంచ టెక్నాలజీని రూల్ చేస్తున్న కంపెనీకి ఛైర్మన్ అంటే చిన్న విషయం కాదు. అలాంటి వ‌్యక్తి ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటారు... వర్క్‌హాలిక్ అనే ఫీల్ కలగడం చాలా నార్మల్. కానీ సత్య నాదెళ్ల చాలా డిఫరెంట్.
- మైక్రోసాఫ్ట్ సీఈఓ కాకముందు నాదెళ్ల ఆ సంస్థలో 20 సంవత్సరాలు వివిధ విభాగాల్లో పని చేశారు.
- ఆయనకు ఆన్లైన్ కోర్సులు చేయడమంటే చెప్పలేనంత ఇష్టం. రీసెంట్‍గా న్యూరో సైన్స్‌లో ఆన్లైన్ కోర్స్ చేశారు నాదెళ్ళ.
- సత్య నాదెళ్లకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన చేసే పనిపై కూడా క్రికెట్ ఎఫెక్ట్ ఉంటుంది.
- హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకున్న నాదెళ్ళ, HPS తరఫున చాలా క్రికెట్ మ్యాచ్‍లు ఆడారు. అలా ఆడటం వల్లనే తనకు నాయకత్వ లక్షణాలు అలవడ్డాయని, పనిభారాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలిసిందని చెప్తారు.
- ఆ టైమ్‌లో తన స్కూల్ స్వీట్ హార్ట్ అనుపమని తర్వాత ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.
- ఆయనకు ముగ్గురు పిల్లలు. ఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్లు.
- నాదెళ్ళ తన ఉద్యోగులకు ఎప్పుడు చెప్పేది ఒక్కటే, వీలైనన్ని ఎక్కువ బుక్స్ చదవండి, కొత్త విషయాలు నేర్చుకోండి.
- తన వ్యక్తిగత జీవితానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు నాదెళ్ళ.
- సత్య నాదెళ్లకు ఇండియన్ క్రికెటర్లు అశ్విన్, కోహ్లి అంటే ఇష్టమట.
- ఆయనకు భారతీయ, అమెరికన్ లిటరేచర్ ఆసక్తి.
- నాదెళ్ళకి కవితలంటే కూడా చాలా ఇస్టం. కష్టమైన విషయాన్ని చాలా పేజీలలో చెప్పే కన్నా ఒక చిన్న కవితతో చెప్తే ఈజీగా అర్థమవుతుందని అంటారు.
- సత్య నాదెళ్ల ఓ పుస్తకాన్ని కూడా రాశారు. దాని పేరు 'హిట్ రిఫ్రెష్'.
- అంతర్జాతీయంగా పేరు సంపాదించిన ఇండియన్ మోస్ట్ సక్సస్ఫుల్ బిజినెస్ పర్సన్స్ జాబితాలో ఇంద్ర నూఈ, సుందర్ పిచాయ్ తర్వాత ఉన్నది హైదరాబాదీ నాదెళ్ళనే.
ఆయన రూటే సెపరేటు..
2014లో స్టీవ్ బామర్ నుంచి సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించారు. ఆయన వచ్చాక మైక్రోసాఫ్ట్‌లో కీలక మార్పులు జరిగాయి. కొత్త తరం టెక్నాలజీ వైపు కంపెనీని నడిపించారు. క్లౌడ్ కంప్యూటింగ్ రంగంపై కూడా కంపెనీ విస్తృతంగా పనిచేసింది. మొబైల్ రంగంపై ఎక్కువ దృష్టి పెట్టింది. ఇలా ఏది చేసినా, ఏం ఆలోచించినా ఆయన రూటే సెపరేటు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement