అన్వేషించండి

Solar Eclipse Effect: సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు మూసివేత, అక్కడ తప్ప!

Solar Eclipse Effect: సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నింటినీ మూసివేశారు. ఒక్క శ్రీకాళ హస్తిలో ఆలయాన్ని మాత్రమే తెరిచి ఉంచబోతున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.

Solar Eclipse Effect: సూర్యగ్రహణం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నింటినీ మూసివేశారు. కానీ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని మాత్రమే తెరిచి ఉంచుతారు. తిరుమల శ్రీ‌వారి ఆల‌యాన్ని 12 గంటల పాటు మూసివేయనున్నారు. అదే విధంగా న‌వంబర్ 8న చంద్ర గ్రహ‌ణం కాబట్టి ఆరోజు కూడా ఆలయం మూసివేసి ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. నేటి సాయంత్రం 5.11 గంట‌ల నుండి 6.27 గంట‌ల వ‌ర‌కు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ కార‌ణంగా ఉద‌యం 8.11 నుండి రాత్రి 7.30 గంట‌ల‌కు శ్రీ‌వారి ఆల‌య తలుపులు మూసి ఉంచుతారు. అనంత‌రం స‌ర్వద‌ర్శనం భ‌క్తుల‌ను మాత్రమే అనుమ‌తిస్తామని టీటీడీ అధికారులు ప్రకటించారు.

సూర్య గ్రహణానికి 9 గంటలు మునుపే ఆలయాన్ని మూసి వేయడం ఆచారంగా వస్తోంది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం రోజుల్లో కచ్చితంగా 12 గంటల పాటు ఆలయాన్ని మూసి ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే బ్రేక్ ద‌ర్శనం, శ్రీ‌వాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ ద‌ర్శనం, ఇత‌ర ఆర్జిత సేవ‌ల‌ను టీటీడీ ర‌ద్దు చేసింది. ఈ రోజుల్లో ఆలయంలో శుద్ధి నిర్వహించిన తరువాత స‌ర్వద‌ర్శనం భ‌క్తుల‌ను మాత్రమే అనుమ‌తి ఇస్తారు. ఇదే విషయాన్ని టీటీడీ అధికారులు భక్తులకు తెలిపారు. గ్రహణం కారణంగా స్వామి వారి ఆలయాన్ని మూసివేయడంతో తిరుమలకి వచ్చే భక్తులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరింది. గ్రహ‌ణ స‌మ‌యంలో అన్నప్రసాద వితరణ రద్దు చేస్తారు.

తిరుచానూరు పద్మావతి ఆలయం.. 

తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సూర్యగ్రహణం కారణంగా ఆలయ అధికారులు మూసివేశారు. గ్రహణానికి తొమ్మిది గంటల ముందే ఆలయ నిబంధన అనుగుణంగా తలుపులు మూసివేశారు. తిరిగి రాత్రి 7:30 గంటలకు ఆలయాన్ని తెరిచి ఆలయ శుద్ది, పుణ్యాహవచనం నిర్వహించిన అనంతరం అమ్మవారికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాత భక్తులను అనుమతించనున్నారు. 

వేములవాడ రాజన్న ఆలయం మూసివేత..

ఈరోజు సూర్య గ్రహణాన్ని పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అధికారులు మూసి వేశారు. ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఆలయ తెరవబోమని అధికారులు తెలిపారు. సాయంత్రం 7 గంటలకు సంప్రోక్షణ జరిపిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామన్నారు. మహా నివేదన, ప్రదోషకాల పూజ, నిర్వహించిన అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి ఇస్తారు. 

భద్రాద్రి రామయ్య ఆలయం కూడా..

ఈరోజు  పాక్షిక సూర్య గ్రహణం సందర్భంగా ఉదయం 10 గంటలకు భద్రాచలం రామచంద్ర ఆలయాన్ని అధికారులు మూసివేశారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ శివాజీ తెలిపారు. గ్రహణం అనంతరం ఈరోజు రాత్రి 7.15 నిముషాలకు రామాలయం తలుపులు తెరచి శుద్ధి కార్యక్రమాలు, సంప్రోక్షణ జరిపిస్తామన్నారు. తిరిగి రేపు తెల్లవారుజాము నుంచి భక్తులకు దర్శనానికి అనుమతిస్తామన్నారు. 

గ్రహణ సమయంలోనూ తెరిచి ఉండనున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం..

గ్రహణ సమయంలోనూ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని తెరిచే ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే గ్రహణ సమయంలో తెరిచి ఉంచే ఒకే ఒక్క ఆలయం.. శ్రీకాళ హస్తీశ్వర ఆలయం. యథావిధిగా అభిషేకాలు, రాహుకేతు పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు. భక్తులందరికీ దర్శనం కల్పిస్తామన్నారు. గ్రహణం సందర్భంగా స్పర్శ కాల సమయంలో అంటే సాయంత్రం 5.11 గంటలకు శ్రీ జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, శ్రీకాళహస్తీశ్వర స్వామివారికి విశేష శాంతి అభిషేకం నిర్వహించబోతున్నారు. అనంతరం నైవేద్యం, దీపారాధన సమర్పించబోతున్నట్లు ఆలయ అర్చకులు చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Rohit- Virat Mission: 2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
2027 వన్డే వరల్డ్ కప్ వేటలో దిగ్గజ ద్వయం.. నెట్స్ లో రచ్చ లేపిన రోకో జంట‌, కివీస్ గడ్డపై బిగ్ వార్ కు సై
Hyderabad Rains: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగైదు రోజులపాటు రెయిన్ అలర్ట్
హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరో నాలుగైదు రోజులపాటు రెయిన్ అలర్ట్
PM Kisan 24th Installment: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. మీ ఖాతాలో రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ నిధులు విడుదల.. రూ.2 వేలు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections: ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
ఏపీలో పట్టణ స్థానిక సంస్థలకు ముగిసిన ఎన్నికల ప్రచారం.. మైకులు బంద్
Kavitha Kalvakuntla: చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
చరిత్రలో తొలిసారి రైతులను పంటలు వేయొద్దన్న అసమర్థ సీఎం.. ఇంద్రవెల్లి సభలో కవిత ఘాటు విమర్శలు
NZ VS IND 4th T20 Result Update: కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
కివీస్ కు ఓదార్పు విజ‌యం.. నాలుగో టీ20లో భార‌త్ ప‌రాజ‌యం.. స‌త్తా చాటిన ఫిలిఫ్స్, డ‌ఫీ, తిల‌క్ ఒంట‌రి పోరాటం వృథా
Comrade Kalyan Movie OTT : ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి శ్రీవిష్ణు కొత్త మూవీ - నెల రోజుల్లోపే కామ్రేడ్ కల్యాణ్ మూవీ సడన్ స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
AP Local Body Elections: ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. వెబ్‌సైట్‌లో అభ్యర్థుల నామినేషన్ పత్రాలు
CM Revanth Reddy: మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడినందుకు నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
BRS హయాంలో మియాపూర్ భూములు కాజేసే కుట్ర.. పోరాడితే నన్ను జైలుకు పంపారు: రేవంత్ రెడ్డి
Arnab Cyclone Effect: అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
అర్నబ్ తుపాను ఎఫెక్ట్.. లారీ డ్రైవర్ల ఆకలి కేకలతో పలాస టోల్ గేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
Tirupati Janasena: టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
టికెట్ కోసం రూ.50 లక్షల డిమాండ్.. తిరుపతి జనసేన నేత ఆత్మహత్యాయత్నం!
Embed widget