Benefits of Train Journey : ఫ్లైట్లో వెళ్లే స్థోమత ఉన్నా సరే రైళ్లలోనే వెళ్లండి - మీ జీవితాల్ని ఒక్క జర్నీ మార్చేయగలదు ! ఇదిగో సాక్ష్యం
Train Journey : విమానాల్లో వెళ్తే మజా ఏముంటుంది .. అదే డబ్బులున్నా సరే రైళ్లలోనే వెళ్లండి.. మీ జీవితాలు మారిపోతాయి. కావాలంటే కొంత మంది గురించి తెలుసుకోవచ్చు.
Software developer earning 30 LPA reveals why he prefers trains over flights : హైదరాబాద్ నుంచి బెంగళూరు లేదా చెన్నై లేదా ముంబై ఎక్కడికి వెళ్లాలన్నా మొదట ఏ రవణా సాధనంగా ఆలోచిస్తారు. ఎక్కువ మంది తమ ఆర్థిక వెసులుబాటుని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఏడాదికి పాతిక లక్షల జీతం ఉన్న వారయితే.. ఖచ్చితంగా ఎయిర్ పోర్టు దారి పడతారు. గంటలో గమ్యస్థానం చేరుకోవచ్చని అనుకుంంటారు. కానీ భిన్నంగా ఆలోచించేవాళ్లు కూడా ఉంటారు. చేతిలో డబ్బులు ఉన్నాయి.. ఫ్లైట్లో వెళ్లేంత అవకాశం ఉన్నా సరే.. ట్రైన్ జర్నీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎందుకంటే ట్రైన్ జర్నీతోనే తమ జీవితాలు మలుపు తిరిగాయని అంటున్నారు మరి.
సోషల్ మీడియాలో చిరాగ్ దేశ్ ముఖ్ అనే వ్యక్తి ట్రైన్ జర్నీలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని పంచుకున్నారు. తన ఎదురుగా ఉన్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో పరిచయం చేసుకున్నప్పుడు అతనికి ఏడాదికి ముఫ్పై లక్షల జీతం అని తెలిసింది. అలాంటప్పుడు ఫ్లైట్‌లో వెళ్లవచ్చు కదా అంటే.. అతను చెప్పిన ఆన్సర్ విని చిరాగ్ దేశ్ ముఖ్‌కు లాజిక్కే కదా అనిపించింది. ఇంతకూ అతనేమి చెప్పాడంటే.. ఓ సారి జాబ్ లేనప్పుడు ఇలా ట్రైన్ జర్నీలోనే వెళ్తూంటే.. పరిచయమైన వ్యక్తి .. రిఫరల్ ద్వారానే ఆయనకు జాబ్ వచ్చిందట. ఈ ట్రైన్ జర్నీ వల్లే జాబ్ వచ్చిందని అందుకే ఎక్కడికైనా రైలు ప్రయాణానికే ప్రాధాన్యత ఇస్తానని ఆ యువకుడు చెప్పాడు.
Funny story !!!!
— Chirag Deshmukh (@Geekychiraag) August 20, 2024
Today, I was traveling by train and met a guy who works as a software developer at a big company, earning over 30 lakhs a year. I asked him, "With that kind of money, why aren't you flying instead of taking the train?
Thread... pic.twitter.com/GH5yssTtLT
చిరాగ్ దేశ్ ముఖ్ ట్వీట్ కు చాలా మంది నెటిజన్లు పాజిటివ్ గా రియాక్టయ్యారు. తాము కూడా అదే పని చేస్తామని చెబుతూ వస్తున్నారు. రైలు ప్రయాణంలోనే తన జీవితాలు మలుపులు తిరిగే ఘటనలు చోటు చేసుకున్నాయని చెబుతూ వచ్చారు.
Absolutely. Many conversations happens during that time especially in longer journeys. I remember having a conversation with a tech lead who explained me importance of cloud technologies wayback in 2015 . It got me hooked into the world of aws .
— Sourav D 🇮🇳 (@souravdjr) August 20, 2024
నిజానికి భారతీయుల్లో రైలు ప్రయాణం అనేది ఓ జ్ఞాపకం. దూర ప్రాంత పర్యటనలను ఎక్కువ రైళ్లలోనే మధ్యతరగతి ప్రజలు ప్రయాణిస్తూంటారు. ఈ క్రమంలో ఎంతో మంది పరిచయం అవుతూంటారు. వారు జీవితం మలుపులు తిరగడానికి కారణం అవుతూంటారు. అందుకే.. విమాన ప్రయాణం అనేది ట్రైన్ జర్నీకి ప్రత్యామ్నాయం కానే కాదని నిరూపిస్తున్నారు.