Shubhanshu Shukla: ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో అడుగు పెట్టిన శుభాంశు శుక్లా - మొదటి భారతీయుడిగా చరిత్ర
nternational Space Station: శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పధ్నాలుగు రోజుల పాటు పరిశోధనలు చేయనున్నారు.

Shubhanshu Shukla ISS: గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా ISSతో విజయవంతంగా అనుసంధానమయ్యారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, భారత వైమానిక దళ టెస్ట్ పైలట్ , వ్యోమగామి, యాక్సియం-4 (Ax-4) మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)కు ప్రయాణించి భారత అంతరిక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. ఈ మిషన్ ద్వారా, 1984లో రాకేశ్ శర్మ తర్వాత అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడిగా, ISSను సందర్శించిన మొదటి భారతీయ వ్యోమగామిగా గుర్తింపు పొందారు.
యాక్సియం-4 (Axiom-4) వాణిజ్య అంతరిక్ష మిషన్, అమెరికా యాక్సియం స్పేస్ సంస్థ నిర్వహణలో, ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సహకారంతో జరిగింది. జూన్ 25, 2025, భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:01 గంటలకు, ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ ద్వారా ప్రయోగం జరిగింది. శుభాంశు శుక్లా ఈ మిషన్‌కు పైలట్‌గా వ్యవహరించారు. పెగ్గీ విట్సన్ (అమెరికా, నాసా మాజీ వ్యోమగామి) ,స్లావోస్జ్ ఉజ్నాన్స్కీ-విస్నీవ్స్కీ (పోలాండ్), టిబోర్ కాపు (హంగేరీ) ఇతర సభ్యులు. గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ నాయర్ బ్యాకప్ కెప్టెన్ గా ఉన్నారు.
వ్యోమనౌక జూన్ 26, 2025 సాయంత్రం 4:30 గంటలకు ISSతో అనుసంధానమైంది.14 రోజుల పాటు ఈ నలుగురు ISSలో శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహిస్తారు. సాంకేతిక సమస్యలు ఫాల్కన్-9లో ద్రవ ఆక్సిజన్ లీక్, రష్యన్ జ్వెజ్డా మాడ్యూల్‌లో పీడన సమస్య, వాతావరణ కారణాల వల్ల ఈ మిషన్ ఏడు సార్లు వాయిదా పడింది. మొదట మే 29, 2025న జరగాల్సిన ప్రయోగం జూన్ 25, 2025న విజయవంతంగా జరిగింది. శుభాంశు శుక్లా ఏడు పరిశోధన ప్రయోగాలను నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్ష యాత్రలకు సంబంధించిన పోషకాహారం , జీవనాధార వ్యవస్థలపై అధ్యయనాలు. భారరహిత స్థితి (మైక్రోగ్రావిటీ) వల్ల ఎముకలు, కండరాలు, గుండె, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థపై ప్రభావాన్ని పరిశోధించే ప్రయోగాలు ఇదులో ఉటాయి. మైక్రోగ్రావిటీలో మొక్కల పెరుగుదలపై అధ్యయనం కూడా ఇందులో ఉంది.
LIVE: @Axiom_Space's #Ax4 mission is scheduled to dock with the @Space_Station at approximately 6:30am ET (1030 UTC). Watch with us as the multinational crew starts their two-week stay aboard the orbiting laboratory. https://t.co/NrThYrmRrN
— NASA (@NASA) June 26, 2025
మొత్తం 31 దేశాలకు చెందిన 60 శాస్త్రీయ ప్రయోగాలను సిబ్బంది నిర్వహించారు. శుభాంశు శుక్లా వాయేజర్ టార్డిగ్రేడ్స్ (సూక్ష్మజీవులు, కఠినమైన పరిస్థితుల్లో జీవించగలవి)ను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, వాటిపై పరిశోధనలు చేస్తున్నారు. శుభాంశు శుక్లా లక్నోలోని సిటీ మాంటిస్సోరి స్కూల్‌లో పాఠశాల విద్య, 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా 2006లో చేరారు, సుమారు 2,000 గంటల ఫ్లైట్ అనుభవంతో టెస్ట్ పైలట్‌గా పనిచేశారు 2019లో ఇస్రో యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోస్పేస్ మెడిసిన్ (IAM) ద్వారా వ్యోమగామిగా ఎంపిక, 2020లో రష్యాలోని యూరి గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో ప్రాథమిక శిక్షణ, హ్యూస్టన్‌లోని నాసా జాన్సన్ స్పేస్ సెంటర్‌లో అధునాతన శిక్షణ పొందారు. ఈ మిషన్ భారతదేశ అంతరిక్ష పరిశోధనలో కీలకమైన మైలురాయి, ఇస్రో-నాసా సహకారాన్ని బలోపేతం చేసింది





















