Shivaji Remarks Row: 'మా దేవుడయ్యా శివాజీ'- రంగంలోకి దిగిన నితిన్ గడ్కరీ!
Shivaji Remarks Row: శివాజీ మహారాజ్‌పై మహారాష్ట్ర గవర్నర్ చేసిన వ్యాఖ్యల మంటలను ఆర్పేందుకు గడ్కరీ ప్రయత్నిస్తున్నారు.
Shivaji Remarks Row: ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి మహారాష్ట్ర గవర్నర్ బీఎస్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఈ వ్యాఖ్యల కారణంగా ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన వర్గానికి భాజపాకు మధ్య మాటల మంటలు అంటుకున్నాయి. వీటిని ఆర్పేందుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ రంగ ప్రవేశం చేశారు. మరాఠీలో ఆయన ఓ ట్వీట్ చేశారు.
మా దేవుడు!
छत्रपती शिवाजी महाराज आमचं दैवत. pic.twitter.com/QOe2l7A7tM
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) November 21, 2022
గవర్నర్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ముంబయి సహా ఇతర నగరాల్లో శివసేనకు చెందిన ఉద్ధవ్ ఠాక్రే శిబిరం, కాంగ్రెస్, ఎన్‌సీపీ భారీ నిరసనల చేపడుతున్నాయి. శివాజీని అవమానించిన వ్యక్తికి మహారాష్ట్రలో చోటు లేదని తేల్చి చెబుతున్నాయి.
శిందే వర్గం నుంచి
సీఎం ఏక్‌నాథ్ శిందే వర్గం నుంచి కూడా గవర్నర్‌పై విమర్శలు వస్తున్నాయి. ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ తాజాగా గవర్నర్‌ను విమర్శించారు.
గవర్నర్
ఛత్రపతి శివాజీ ఐకానిక్ పర్సనాలిటీ అయినా అదంతా పాత రోజుల్లోనని...ఇప్పటి ఐకానిక్ పర్సనాలిటీస్ వేరే ఉన్నారని గవర్నర్ ఇటీవల అన్నారు. ఔరంగాబాద్ లోని డాక్టర్ బాబాసాహెబ్ అండేక్కర్ యూనివర్సిటీలో ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆ సమయంలోనే ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: Satyendar Jain: 'ఆ వీడియోలో ఉన్నది ఫిజియోథెరపిస్ట్ కాదు రేపిస్ట్'